ప్రత్యేక హోదా దొంగల గురించి-శ్రీమాన్ చంద్రబాబుకో కంప్లైంటు

thieves
నమస్కారం!
చాలా వ్యతిరేక శక్తులున్నా కూడా మీ పరిపాలన, ముందు చూపు చాలా బాగా ఉన్నాయి. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా మీ మీద నమ్మకం పెరుగుతూ ఉంది.
 
ప్రత్యేక హోదా గురించి నరేంద్ర మోడి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం మరియు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ లో పడిన తపన ప్రతి ఆంధృడికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీటికి తోడు మీ పట్టుదల, అవినీతి లేని తనం, నమ్మకం, ముందుచూపు వల్ల మీ మీద భారం వేసి తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకున్నాము.   ఈ విషయం మీకు అందరికన్నా బాగా తెలుసు.

ప్రత్యేకంగా ఈ ఉత్తరం ఎందుకు వ్రాస్తున్నానంటే, పై విషయలే కాక మాకెప్పటికీ గుర్తుండిపోయే మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎం.
పి లు చేసిన దారుణమైన ద్రోహం. వాళ్ళందరున్నారులే మన రాష్ట్రానికి ఏమి పర్లేదు, అన్యాయం జరగదు అనే అందరం అనుకున్నాము.   అమాయకంగా నమ్మేము. ఆ నమ్మక ద్రోహానికి ప్రతిఫలంగా కొత్త  ఆంధ్రప్రదేశ్  అసెంబ్లి లో ఒక్క కాంగ్రెస్ అభ్యర్ధి కూడా లేకుండా చేసేము.

విభజన సమయంలో ఎప్పుడు ప్రజలు వాళ్ళని ప్రశ్నించినా, రిజైన్ చేసి మాట్లాడండి అంటే “మేము మంత్రి ప్రదవికి రాజీనామా ఇస్తే మన రాష్ట్రానికి న్యాయం  ఎలా జరుగుతుంది?” అని తిరిగి ప్రశ్నించే వారు. మేము నిజమే అనుకున్నాము. ప్రత్యేకించి శ్రీమతి పురందరేశ్వరి.  

ఇప్పుడు మీ కేంద్ర మంత్రి శ్రీ సుజనా చౌదరి గారు కూడా అదే తప్పు చేస్తున్నారు. అదే డైలాగ్ చెప్తున్నారు.  ఆ డైలాగ్ తో మేమెంతో విసిగి వేసారి పోయి ఉన్నాము.  అసహ్యం వేస్తోంది. అది చిన్నగా మీక్కూడా పాకుతుంది. కాబట్టి దయచేసి మీ మంత్రులకి, ఎం.పి లకి మీరు నచ్చ చెప్పండి. వాళ్ళు రిజైన్ ఇవ్వకపోయినా క్షమిస్తాం గాని ఈ డైలాగ్ చెప్తూ పబ్బం గడుపుకుంటే మాత్రం చివరికి ఉన్నది పోతుంది ఉంచుకున్నదీ పోతుంది కాంగ్రెస్ నాయకులకి జరిగినట్లు.

తెలుగు వాళ్ళు పార్లమెంట్లో  తలవంచుకుని ఉండద్దని చెప్పండి.  ప్రత్యేక హోదా రాకున్నా సరే ఇలాంటి ఎంగిలి డైలాగ్ లు ఇకపై వాడద్దని చెప్పంది , అసహ్యంగా ప్రవర్తించద్దని చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పు రిపీట్ అవుతుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పండి దయచేసి.  

ఇట్లు మీ అభిమాని
 
గిరిచంద్,
అహ్మదాబాద్,
గుజరాత్.

పాపం కట్టప్ప బాహుబలిని చంపనే లేదు – 3 క్లూలు – ఒక రీసెర్చ్

images

అహ్మదాబాద్ లో రెండేళ్ళ కిందట నా భార్య నాకో గిఫ్ట్ ఇచ్చింది…. కాని కండిషన్స్ అప్లై అంది. గిఫ్ట్ ఏమిటంటే బాహుబలి రిలీజ్ అయ్యేంతవరకు తను ఇక్కడి ధియేటర్స్ లో ఏ సినిమా చూడనని. కండిషన్స్ ఏమిటంటే తను చూడబొయ్యే తర్వాతి సినిమా బాహుబలి అవ్వాలని, అదీ మొదటి రోజు మొదటి షో అవ్వాలని చెప్పేసింది.

ఆ…. చాలా రోజులుంది కదా అని సుఖంగా ఉంటుంటే,  అప్పుడప్పుడూ గుర్తుచేసేది ట్రైలెర్ వచ్చిందని, ఆడియో అనీ .. చివరకు డేట్ వచ్చేసింది జులై 10 అని. ఇక అప్పటినుండి నేను ఇంటర్నెట్ లో వెతుకులాట మొదలు పెట్టేను. అహ్మదాబాద్ లో ఏ థియేటర్స్ లో వస్తుందో అని. అన్ని పెద్ద థియేటర్స్ కి వెళ్ళి అడిగేను. అందరూ ఒకటే చెప్పేరు “రిలీస్ ముందు రోజు సాయంత్రం మాత్రమే మాకు తెలుస్తుంది” ఆ రోజు రండి అని విసిగించద్దు అన్నట్లుగా చేప్పేరు. ఆ రోజు వాళ్ళకి తెలీదు బాహుబలి చెయ్యబోయే తుఫాను సంగతి.

ఇలా కాదు అనుకుని రేపు రిలీస్ అనగా ఈరోజు నెట్లో చూసేను. తృళ్ళి పడ్డాను టిక్కెట్లు ఇస్తున్నారు ఆన్ లైన్  లో. కాని ఒకే థియేటర్ చూపిస్తున్నారు అందులో. మా ఆవిడ గుర్తుకొచ్చి భయం వేసింది. పాపం రెండేళ్ళ పాటు వెయిట్ చేసింది.. తన కోరిక ఎలా అయినా తీర్చాలని  వెంటనే బుక్ చేయాలని చూస్తే కేవలం రెండు సీట్లు ఉన్నాయి అదీ ముందు వరసలో. నా పని అయిపోయింది అనుకున్నాను. సర్లే ముందు సీట్లో కూర్చుని చూడటం కూడా ఒక రికార్డే అనుకుని బుక్ చేసేసాను పాప్ కార్న్, సమోసలతో కలిపి.

పిచ్చి వాళ్ళలాగా రెండు గంటల ముందే థియేటర్ కి వచ్చేము. లోపలికి వెళ్ళనివ్వలేదు. క్లీన్ చేస్తున్నారు అని చెప్పేరు. చాలా జనం వచ్చేరు. ఎవ్వరూ ఇంకొకరికి పరిచయం లేదు కాని అందరూ తెలుగు వాళ్ళే. థియేటర్ స్టాఫ్ ఆశ్చర్యంతో చూస్తున్నారు అందర్నీ. ఒక రీజనల్ సినిమాకి అంతమంది రావటం,  అంత ముందుగా రావటం వాళ్ళకి కొత్తగా ఉంది.
వాళ్ళకింకా అర్థం కాలేదు బాహుబలి దెబ్బ ఎలా ఉంటుందో. ఆంధ్రలో టికెట్ ధర వేలకి వేలు పలుకుతూంటే మాకిక్కడ నూట యాభై కి దొరికిపోయింది.

తెర ముందుకు తెచ్చి సీట్లో కూర్చోబెట్టేను మా ఆవిడని, నన్నూ  స్క్రీన్ నీ  ఎగా దిగా చూసింది కాని అంతలోనే అడ్జస్టైపోయింది. ఇంక సినిమా మొదలయ్యేక మేము వేరే వింతలోకంలో ఉన్నట్లే ఫీలయ్యేము. కట్టప్ప బాహుబలిని పొడిచేసేక సినిమా అయిపొయ్యేసరికి ఏడుపొచ్చింది మాకు. సినిమా అయిపోయిందని జీర్ణించుకోలేక పొయ్యేము చాలామందిలాగ.

“నా మాట నిలబెట్టుకున్నాను చూడు మొదటి రోజు, మొదటి షో, మొదటి రో” అని గర్వంగా మా ఆవిడతో అన్నప్పుడల్లా “కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపేడో చెప్పలేనివాడివి నువ్వు వేస్ట్?” అనేది. ఇక వాట్సప్, ఇంటర్నెట్ లో అయితే ఎన్నో జోకులు కట్టప్ప గురించి.

“అసలు కట్టప్ప గురించి నీకు ఏమి తెల్సు?” అని అడిగేను.
“కట్టప్ప సింహాసనానికి కట్టుబానిస అని తెల్సు” అంది.
“అదే మీకు తెల్సింది…అసలు కట్టప్ప గురించి రెండు విషయాలు చెప్తాను విను. అతను కట్టుబానిస అయితే కావచ్చు కాని అంత నీతిమంతుడైతే కాదు. లాయల్ అని అందరూ అనుకుంటారు..కాని అది పూర్తిగా నిజం కాదు….రెండు విషయాలు చెప్తా విను.”

1. కట్టప్ప సింహాసనానికి కట్టు బానిస అయితే, ఆ సింహాసనానికి అధినేత అయిన భల్లాలదేవ దగ్గర ఉన్న బందీ అంటే దేవసేన దగ్గరకొచ్చి ఊరకే “నేను నిన్ను విడిపిస్తాను, సైనికులు దగ్గరలో లేరు” అని ఎందుకు చెప్తాడు? మరి కట్టు బానిస కి అర్థం ఏముంది?

2. తను విడిపిస్తానన్న దేవసేనని వేరే ఎవరో విడిపిస్తుంటే ఎందుకు ఆపటానికి ప్రయత్నిస్తాడు? అంటే తప్పు తను చేస్తే పర్లేదు కాని, వేరే ఎవరైన చేస్తే మాత్రం అడ్డు పడతాడు.

మూతి బిగించింది మా ఆవిడ.”నీకేమి పనిలేదా? ఆఫీస్ కి వెళ్ళేక ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటున్నావా?” అని రుసరుస లాడింది.

అనాలోచితంగా అలా అవన్నీ అనేసేను కాని, నిజంగానే మనసు లోపల ఆ సినిమా ఎప్పుడూ తిరుగుతూనే ఉంది. ఎదో ఒక సీన్ వెంటాడుతూనే ఉంది. ఇది చాలమందికి ఉండే పిచ్చే అనుకున్నాను.

అప్పుడెప్పుడో చదివేను “చివరకు మిగిలేది” నవలపై ఎవరైన పి.హెచ్.డి చేసుకోవచ్చు అని. అలాగే ఇప్పుడు “బాహుబలి” సినిమా కూడా అంతకన్నా తక్కువ కాదు అనిపించింది. కట్టప్ప గురించి ఎన్నో జోకులు చదివేను, రాజమౌళి గారి ఇంటర్వ్యూ చూసేను. అందులో రాజమౌళి గారు ఒకమాట చెప్పేరు “కట్టప్ప సింహసనానికే కాదు ఇంకొక మనిషికి కూడా కట్టుబానిస.” అని… “అయితే అదెవరో కాదు ఆ సినిమా డైరెక్టర్…అంటే తనే” అని నవ్వుతూ చెప్పేడు. తర్వాత బాహుబలి లో వాడిన వస్తువులు మ్యూజియం లో లాగా పెట్టి చూపించేరు. సరిగ్గా అప్పుడు మెదిలింది ఒక ఆలోచన నా మదిలో. అసలు కట్టప్ప బాహుబలిని చంపనే లేదు అని. అదే చెప్పేను నా భార్యకి.  చాలమందిలాగే తను కూడా చాలా ఆలోచిస్తూ ఉంది ఆ విషయం గురించి.

“బాహుబలిని కట్టప్ప చంపనే లేదా?!!  ఎలా?”  అని ఆశ్చర్యంగా అడిగింది వంటపని పక్కన పెట్టి.

నేను “మూడు క్లూలున్నాయి”  అని చెప్పేను.

“ఏమిటో అవి త్వరగా చెప్పు”  అని రక్కేసింది.

నేను చెప్పటం మొదలు పెట్టేను.
1. “కట్టప్ప బాహుబలిని చంపి ఉంటే కట్టెలేరుకునే దేవసేన కట్టప్పతో అంత మర్యాదగా మాట్లాడదు. ఇంకా అవంతిక వాళ్ళ  తిరుగుబాటు నాయకుడు కూడా పోసిటివ్ గా మాట్లాడడు. అంటే… కట్టప్ప సింహాసనానికి కట్టుబానిస అన్నాడు గాని ద్రోహి అనలేదు.”

మా ఆవిడ కళ్ళు మెరిసేయి…”ఇంకా చెప్పు”  అంది బుద్దిగా.
నేను గర్వంగా చూసి చెప్పసాగేను.
2. “భల్లాలదేవ (రాణా),  చేతులకి గొలుసులతో ఉన్న మన దేవసేనతో ఏమి చెప్పేడు?”  అని నేను మా ఆవిడ కళ్ళలోకి చూసేను ఏదో దేవసేన మా పెద్దమ్మ అన్నట్టు.

“ఏమి చెప్పేడో నువ్వే చెప్పు నాకు బుర్ర పనిచేయట్లేదు సస్పెన్స్ తో” అంది…అంతలోనే “ఆ…గుర్తొచ్చింది…బాహుబలిని కళ్ళతో చూడాలని నువ్వు…ఇంకొకసారి కసి తీరా చంపాలని నేను ఎదురుచూస్తున్నాము” ఇలాగే ఏదో అంటాడు అంతేకదా అని ఆదుర్ధా గా చెప్పేసింది.

నేను నవ్వేను తన తొందరికి.
ఒక రీసెర్చ్ స్కాలర్ లాగా చెప్పసాగేను.

నువ్వు చెప్పింది కరక్టే. “ఎప్పుడెప్పుడొస్తాడా అని నువ్వు… మళ్ళీ ఈ చేతులతో కసి తీరా చంపాలని నేను..” అని అంటాడు. ఇదే నా రెండో క్లూ అన్నాను.

“ఏముంది ఇందులో?” అని ఆసక్తిగా అడిగింది.

“చెప్తా విను బాలా!! ముందు కాసిన్ని మంచినీళ్ళు పట్టుకురా” అని ఆజ్ఞాపించేను.

“చాల్లే నీ ఒవర్ యాక్షన్” అని వాటర్ బోటిల్ తెచ్చిచ్చింది కోపంగా చూస్తూ. “చెప్పు” ఇంక అన్నట్లుగా.

విను..భల్లాలదేవ ఎమన్నాడో మళ్ళి చెప్తా విను. “మళ్ళీ కసి తీర చంపాలని నేను” అని వత్తి పలికేను భల్లాలదేవ లాగా. ఇప్పుడన్నా అర్ధమైందా మట్టి బుర్రకి? అన్నను ధైర్యంగా.

కోప్పడలేదు మా ఆవిడ ఆ మాటకి. గిరి ప్లీజ్ చెప్పవా అని అడిగింది దీనంగా చూస్తూ.

చెప్పేసేను ఇలా. “మళ్ళీ చంపుతాను అన్నాడు అంటే దానర్ధం ఒకసారి చంపేడు అనే కదా….అంటే  బాహుబలిని చంపింది కట్టప్ప కాదు భల్లాలదేవ అని అర్థం చేసుకోవచ్చు కదా.” “చూసేవా నా ఇన్వెస్టిగేషన్!!” అని రకరకాల ఫీలింగ్స్ మొహంలో పెట్టేను.

“సర్లే ముందా మూడో క్లూ కూడా చెప్పు తర్వాత నీ గురించి చెప్తా” అంది.

అంటే ఆర్డర్ వేస్తున్నావా లేక రెక్వెస్టా? అడిగేసేను తెగేసి ధైర్యంగా.

“నీ బోడి ఇన్వెస్టిగేషన్ నాకవసరం లేదులె…బాహుబలి2  నెక్స్ట్ ఇయర్ జులై లో వచ్చేస్తుంది.” అనేసింది తేలిగ్గా.

“సరే నీ ఇష్టం. ఆఖరి క్లూ విన్నావంటే అద్దిరిపోతావ్…రాజమౌళి కూడా నన్ను తిట్టుకుంటాడు.” అన్నాను ఆఖరి అస్త్రంగా.

రాజమౌళి గారి పేరు వినగానే మెత్తబడింది. “సర్లే బుజ్జి చెప్పు నాకు టెన్షన్ గా ఉంది” అని గోముగా అడిగింది.

ఇదే ఛాన్స్… మళ్ళి వినను అని మొడికేస్తుంది రాక్షసి  అని అనుకుని  ఇలా చెప్పేను. “రాజమౌళి గారి ఇంటర్వ్యూ చూసేవు కదా నాతోపాటు?” అని అడిగేను.

“అవును..చూసేను కాని నేను నీతో పాటు కాదు..నువ్వే నాతో పాటు చూసేవు.” అంది మా ఇగోఇస్టు

“సరేలే … అందులో బాహుబలి సినిమాలో వాడిన వస్తువులు చాలా చూపించేరు గుర్తున్నాయా?” అన్నాను

“ఉన్నాయి..బోలెడు కత్తులు, కిరీటాలు ఇంకా భల్లాలదేవ వాడిన ఫాన్-బండి ఇంకా చాలా చాలా చూపించేరు.” అంది కాంఫిడెంట్గా.

“అవును కరక్టే…కాని ఇంకా ఒకటి కూడా చూపించేరు…అదేంటో తెల్సా…..?” అని ఆగేను.

“చెప్పు ఆపకు” అంటూ దిండు తీసుకుని కొట్టింది.

“అందులో ఒక వస్తువు కూడా చూపించేరు..ఇంకా అలాంటిది ఒకే ఒక్కటి చూపించేరు…అది…కట్టప్ప మాస్క్” అని మెరిసే కళ్ళతో చూసేను మా ఆవిడ వైపు. “అంటే కట్టప్ప మాస్క్ వేసుకుని,  భల్లాలదేవుడే బాహుబలిని చంపేసేడు.”

నిశ్శబ్దం…

నమ్మలేనట్లు చూసింది నన్ను.

“నిజం..ఆ మ్యూజియం లో ఇంకెవరి మాస్క్ లేదు, చూపలేదు. కేవలం కట్టప్ప మాస్క్ మాత్రమే ఉంది. అంటే దానర్ధం అదే అని నేననుకుంటున్నాను… నాకు తెల్సింది, న్యాయమనిపించింది చేప్పేను. ఏదైనా మనం సెకండ్ పార్ట్ రిలీస్ అయ్యేవరకు వెయిట్ చెయ్యల్సిందే సస్పెన్స్ తొలగిపోవాలంటే” అని చెప్పేను.

“నీ బుర్రకి అందేట్లు ఉండదులే రాజమౌళి సినిమా…అయినా నీ రీసెర్చ్ కి మెచ్చేను..మంచి కర్రీ చేస్తాలె డిన్నర్ కి” అని నన్ను వెక్కిరించి వంటగదిలోకి వెళ్ళిపోబోతూ… నువ్వు చెప్పింది నిజమేనంటావా? నాపాటికి నేనేదో మాడిపొయ్యిన మసలాదోస తింటూ కట్టప్ప గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు లేనిపోని అనుమానాలు పెట్టి నన్ను కంఫ్యూస్ చేసేసేవు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే బాహుబలి2  కి టికెట్స్…. ఇంకా ఫుడ్ కర్చు నేను పెట్టుకుంటాలే… అదే నీ ఈ రీసెర్చ్ కి నేనిచ్చే స్కాలర్షిప్.” అని నవ్వుతూ అభయమిచ్చింది ఈ కట్టుబానిసకి.

అదంతా ఏమోగాని. బాహుబలి దెబ్బ ఏంటో సినిమా థియేటరోళ్ళకి ఆ పక్కరోజుకి అర్థమై నోళ్ళు వెళ్ళబెట్టి టికెట్ రేట్లు అమాంతం పెంచేసేరు. ఆ తర్వాత ఈ సినిమా చూడలంటే వారం పదిరోజులు థియేటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది అందరికీ. ఆఫీసుల్లో, టీకొట్ల దగ్గర, పక్కింటివాళ్ళు అందరు మన బాహుబలి గురించి మాట్లాడుకుంటూ ఉండటంతో వళ్ళు పులకరించేది. ఆఫీస్ నుండి వస్తూ పోతూ అనేక థియేటర్ల దగ్గర నిలువెత్తు బాహుబలి పోస్టర్లు తెలుగులో చూస్తే గర్వంగా అనిపించేది. ఏనాడూ చూడని కళ్ళు మొట్టమొదటిసారి తెలుగు సినిమా పేరు, ఫోటోలు ఇక్కడి లోకల్ న్యూస్ పేపర్లలో  చూడ్డంతో  కేక పెట్టేసాం ఆనందంతో.  ఎనాడూ వినపడని “తెలుగు సినిమా” అన్నమాట (సౌత్ అంతా తమిళ్ సినిమాలే అనుకుంటారు వీళ్ళు) బాహుబలి సింహనాదంతో అందరి మెదళ్ళలో తిష్టవేసేసింది శాశ్వతంగా.

భళా బాహుబలి!! భళా భల్లాలదేవ!! భళా రాజమౌళి!! జై కట్టప్పా

“తోక తెగని బల్లి “

నువ్వుశెట్టి బ్రదర్స్

lizards_large.jpg

“నెక్స్ట్” అంటూ పిలిచి బెల్లు నొక్కాడు డాక్టరు.
క్యు లో ముందు ఉన్న బల్లి చరచరమంటూ పాక్కుంటూ డాక్టరు గారి దగ్గరి కొచ్చింది.
“ఏమిటి నీ సమస్య?” కుర్చిలో బాగా వెనక్కి వాలి అడిగాడు.
“…సార్”
“నసగకు..చెప్పు..ఇక్కడ ఇంకెవరూ వినరులే. అసలేమిటి నీ సమస్య?”
“సార్! నాకూ…నాకు తోక తెగటం లేదు సార్.”
“తోక తెగటం లేదా?” అని విరగబడి నవ్వాడు డాక్టరు. నవ్వి నవ్వి”ఎక్కడ దాకా తెగాలో గుర్తు పెట్టివ్వు, అక్కడికి అంగుళం పైనే కోసేస్తాను” అని నవ్వుతూనే అడిగాడు “అది సరే!   అసలెందుకు తోక తెగటం?”
సిగ్గుతో బిక్కచచ్చిపొయిన బల్లి ఇలా అంది.
“ఎవరైనా మమ్మల్ని చంపటానికి వచ్చినప్పుడు, తోకలో కొంత భాగాన్ని వదిలేస్తాం సార్. శత్రువు దృష్టి, కిందపడి తనకలాడే తోక మీదకు వెళ్ళి కొద్ది క్షణాలు కన్ ఫ్యూజ్    అవుతారు సార్. ఈ లోపు మేము తప్పించేసుకుంటాం సార్.”
“తోక తెంచుకోవటం  దేనికి? ఎదురు తిరిగి పోరాడచ్చు గదా? లేకపోతే పారిపోవచ్చుగా!”
“ఏం చేస్తాం సార్? మమ్మల్ని మేం రక్షించుకోవటానికి భగవంతుడు మాకు పెట్టిన రక్షణ పద్దతి ఇది సార్.”
“మరి భగవంతుడ్నే వెళ్ళి అడగలేక పోయావా?”
“ఈ భూమ్మీద మీరె కద్సార్ భగవంతులు.” అంది ఇంకేం అనాలో అర్ధం కాక.
దాక్టరు గారికి జాలేసింది.
“సరే! ఈ సమస్య నీకొక్కదానికేనా? లేక మీ ఇంట్లో ఇంకెవరికైనా ఉందా?” అడిగాడు వివరాలు  వ్రాసుకుంటూ.
“లేద్సార్…నాకు తెలిసి ఇంకెవరికీ లేదు…

View original post 151 more words

సో…నాడు…..నేడు

images

నాడు

అమ్మా “T” పెద్దగా అరిచాడు మొద్దబ్బాయి మంచం దిగకుండానే,
అరే ఆగరా మొద్దొడా! టీ పెట్టడమంటే చిన్న విషయమా? పాలు పితకాలి నీళ్ళు కలపాలి తరువాత మంటపెట్టి పొడేస్తే కాని Tరాదు కాస్త వుండరా తయారు చేస్తాను, అంతలోపల ఆ కుర్చి తుడువు దుమ్ముకొట్టుకుపోయి ఉంది అంది ఆ మహా తల్లి తన చేతిలోని కత్తెర నూరుతూ.

అయినా ఈ పాలేరెదవ ఎటు పోయాడు పాలు తెమ్మంటే…. రేయ్…. ఎంకన్నా ఎక్కడకి పోయావురా? పాలు తేకుండా ఇక్కడ అబ్బాయికి టీ కావాలంట, త్వరగా రా అంటూ పెద్దగా అరిచింది తన చేతులలోని కత్తెరని పక్కనేఉన్న A.P మాప్ పైన పెడుతూ. ఆ అరుపులు విని పెరట్లోనుంచి పరుగెత్తుకొచ్చాడు పాలేరు వెంకన్న.వాడి మూతి పగిలుంది, చెంపవాసి పోయుంది, వళ్ళంతా పేడ అంటుకునివుంది.

ఏంట్రా ఈ వేషం ఎవరిచేత తన్నిచ్చుకొచ్చావ్ అరాగా అడిగింది.
పాలు తీయబోతే ఆ గేద ఎడమ కాలితో తన్నిందమ్మా, మహ పొగరుగా ఉంది,అన్నాడు పగిలిన తన ముక్కు తడుముకుంటూ..
పాలు పితకతం రాని వెదవా నువ్వెం పాలేరువిరా ఎదవన్నర ఎదవా దాని రెండూ కాళ్ళు కట్టెయ్  ఇవ్వకుండా ఎక్కడికి పోద్ది హుకుం జారి చేసింది.
అది కూడ చేసాను తల్లి అయినా అరుస్తూనేఉంది అన్నాడు పాలేరు తల గోక్కుంటూ..
అరిస్తే నోరుకట్టెయ్ రా అది కూడా చెప్పాల్నా?
కట్టేసానమ్మ అయినా ఇంకా కుమ్ము తుంది అంటూ నసిగాడు ఆ పాలేరెదవ.
కుమ్మితే కొమ్ములు కోసెయరా వెదవా అన్నీ చెప్పాలి యెదవకి
కోసేసానమ్మ
ఇప్పుడేంచేస్తుందిరా?
కిందపడి మూలుగుతుందే అమ్మా రేపో మాపో సచ్చే తట్లుంది.
పర్లేదు ఇప్పుడు పాలు పితుకునిరా అబ్బయికి కడుపులోకి T పోతే కాని కుర్చి ఎక్కడంట  అంది ఎదురుగావున్న మొద్దబ్బాయి కుర్చి వంక మురిపంగా చూస్తూ ..
పాలేరు కదిలాడు దూరంగా సచ్చిన శవానికి జరుగుతున్న ఊరేగింపు చూస్తూ తన చావ బోయే గేదని ఎలా వూరేగించాలా అని..

శవాలకి పెళ్ళిళ్ళు చేస్తున పార్లమంటపాల సాక్షిగా… T కాయటం జరిగిపోయింది

నేడు

ఆ కత్తెర నూరిన తల్లి అడ్రెస్ ఎక్కడో? ఆ T తాగి కుర్చి ఎక్కాలనుకున్న పిల్లోడెక్కడో ,బంగారు గేదె కొమ్ములు కోసి అడ్డంగా చీల్చిన పాలేరు గాళ్ళు   ఎక్కడ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారో  అవసరం లేదు… కాని చావబొయే గేదె బతికి బట్టకట్టింది, త్వరలో రంకె కూడా వేస్తుంది.సందేహం లేదు.