July 30, 2007 at 10:29 AM (కృకీలు)

bds.jpg

ఆకాశంలో విమానాల హొరు ,
పక్షి లోకంలో గ్రహాంతరవాసుల గూర్చి
చర్చల జోరు..

Permalink Leave a Comment

మృగరాజు నవ్వుతుంది…..

July 29, 2007 at 9:33 PM (మనసులో మాట)

lin.jpg 

అనగనగా ఒక అడవిని ఓ మృగరాజు పాలించేది.తను చేసిన తప్పులును అదునుగా చేసుకొని అవకాశం కొసం పొంచివున్న మరో మృగరాజు సమయం చూసి చేసిన పాదయాత్రతొ ఆడవిలోని జంతువులు అన్నీ తృప్తిపడి  ఆ రాజుని కాదని పాదయాత్ర చెసిన రాజుని తమ నాయకునిగా ఎన్నుకున్నాయి.అధికారం లోకి రాగానె ఈ కొత్త రాజు తనకు కోపం నరం తెగిపోయిందని ప్రకటించి నవ్వడం మొదులుపెట్టాడు .మొదట్లో ఇది అందరికీ నచ్చినా రానూ రానూ దానికి అర్ధాలు వెతకటం మొదలయ్యింది..పాత రాజు తను  ఏమిచెప్పినా నవ్వుతున్న ఆ కొత్త రాజుని చూసి ఉడుక్కోసాగాడు.మీవాళ్ళందరూ మావాళ్ళని చంపేస్తున్నారన్నా నవ్వే,అడవిలో భూములు లేకుండా చేస్తున్నారన్నా నవ్వే ,కోట్లు కోట్లు అడవి సంపద దోచేస్తున్నారన్నా నవ్వే.పేదజంతువులను పొలీసులు పిట్టలులాగా కాల్చేస్తున్నారన్నా నవ్వే. ఈ నవ్వులు చూసి పాత రాజుకి అయితే  నిజంగా పిచ్చిపట్టసాగింది. పాపం అడివంతా తిరగసాగాడు తన ప్రశ్నకు జవాబు కోసం.దొరకలేదు.ఎంతో  మేధావులు అనుకున్నవారినీ అడిగాడు.పాత పుస్తకాలూ తిరగేశాడు.లాభం లేకపోయింది.అప్పుడు ఎవరో మహానుభావుడు చెప్పిని సలహాతో అన్నీ తాత్కలికంగా వదిలేసి  శివుడు గురించి తపస్సు   చేయసాగాడు.అతని కఠినమయిన తపస్సుకి మెచ్చ్చి ప్రత్యక్షం అయిన శివుడు కూడా ఆనవ్వుకి అర్ధం తెలుసుకోలేక నేను చెప్పలేను బాబూ  సారీ అని చేతులెత్తేశాడు. 

 కట్ చేస్తె ఓ వంద ఏళ్ళ తరువాత అలా ఆకాశంలొ  మేఘాలమధ్యన నవ్వుకుంటూ నడిచిపొతున్న ఆ  మృగరాజుని చూసి శివుడు బాబ్బాబూ ఇప్పుడైనా ఆనవ్వుకి అర్దం  చెపుతావా అని బతిమలాడసాగాడు.ఏనవ్వుకి అడిగాడు నవ్వటం ఆపి ఆ మృగరాజు సందేహంగా.అదే వివరించి చెప్పాడు శివుడు.అప్పుడు మళ్ళీ పగలబడి నవ్వసాగాడు ఆ  మృగరాజు.అలా నవ్వీ నవ్వీ కళ్ళల్లొ నీళ్ళు వచ్చాక ఆపి అటూ ఇటూ చూసి అప్పడు చెప్పాడు శివుడికి.నిజానికి  వాళ్ళు అడిగే మాటలకు నేను నవ్వేవాడినికాదు……కాని ఆ పాతరాజుని చూసినప్పుడల్ల పాదయాత్రలతొ  ప్రజలని ఏలా మోసం చెయ్యొచ్చొ గుర్తుకొచ్చి నవ్వేవాడిని అని గుట్టువిప్పాడు ఆ మృగరాజు.తల తిరిగిన శివుడు ఆపాత రాజుని వెతుకుతూ మేఘాలమధ్యన  మాయమాయ్యడు.మళ్ళీ మన మృగరాజు  నవ్వుకుంటూ మేఘాలమధ్య  సాగిపోయాడు. 
                             
            
                                                     
                                  
                               

Permalink 4 Comments

పెన్సిలిన్

July 29, 2007 at 4:28 PM (అనగనగా .....)

    pencilin.jpg

        స్కాట్లాండ్ కి చెందిన ఫ్లెమింగ్ అనే ఒక పేద రైతు ఒక రోజు తన ఇంటి ముందు పని  చేసుకుంటూ ఉంటే,  దగ్గర  లోనే ఉన్న ఊబి  నుండి రక్షించండి.. రక్షించండి   అన్న కేకలు  వినిపించాయి.   వెంటనే   చేతిలో  ఉన్న  పనిముట్లను అలాగే వదిలేసి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఊబి లో కూరుకు పోతూ చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ ఒక పిల్లవాడు  దీనంగా  అరుస్తూ ఉన్నాడు.  ఆ   రైతు   వెంటనే  ఆ  పిల్లవాడిని  రక్షించాడు.  లేకుంటె  ఆ  ఊబిలో నెమ్మది నెమ్మది గా కూరుకు పోయి భయానకమైన చావుని రుచి చూసి ఉండే వాడు.

              పక్క రోజు, ఒక అందమైన రధం లాంటి బండి ఆ రైతు ఇంటి పరిసరాల్లో కి వచ్చి ఆగింది. అందులోనుండి  మంచి  దుస్తులు వేసుకున్న ఒక గౌరవనీయ మైన వ్యక్తి దిగి,   నిన్న రక్షింపబడిన   పిల్లవాడి  తండ్రి గా  పరిచయం  చేసుకుని ఇలా అన్నాడు. “నా బిడ్డని కాపాడినందుకు ప్రతిఫలంగా నీకు ఏమైనా ఇవ్వాల నుకుంటున్నాను.”

              “లేదు, నేను చేసిన దానికి  ఎలాంటి ప్రతిఫలాన్నీ తీసుకోను.” ఆ రైతు బదులిచ్చాడు. అదే సమయం లో ఆ రైతు కొడుకు ఇంటి లో నుండి బయటకు వచ్చి నిలుచున్నాడు.

             “అతను నీ కొడుకా?” ఆ గౌరవనీయమైన వ్యక్తి ప్రశ్నించాడు.
             “అవును” రైతు గర్వంగా చెప్పాడు.

             ”అయితే మనం ఒక  వప్పందానికు వద్దాం. నా  కొడుక్కి ఎలాంటి      చదువు  సంధ్యలు చెప్పిస్తానో,  అంత  మంచి  చదువూ  నీ  కొడుక్కి  కూడ చెప్పిస్తాను. అతడికీ నీ లాంటి లక్ష్యణాలు ఎమైనా ఉండి వుంటే మనిద్దరి కీ గౌరవం తెస్తాడనటం లో సందేహం లేదు.”

              ఆ వ్యక్తి అన్నమాట నిలబెట్టుకున్నాడు. 

             ఆ రైతు కొడుకు ఆ రోజుల్లో ఉన్న అన్నింటి  కన్న మంచి బడులలో చదివాడు,  లండన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన  సెయింట్ మేరీస్ హాస్పిటల్ మెడికల్  స్కూల్  నుండి   పట్టభద్రుడయ్యాడు.   ఆ  రైతు బిడ్డే  “పెన్సిలిన్“  ని కనుగొని ప్రపంచమంతటా కొనియాడబడిన సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కొన్నాళ్ళ తరువాత   చిన్ననాడు  ఊబిలో   నుండి   రక్షింపబడిన  ఆ  ధనికుడి   కొడుకు న్యూమోనియా కు గురైతే ఈసారి అతన్ని రక్షించిందెవరో తెలుసా? పెన్సిలిన్. ఆ  ధనికుడి పేరు లార్ద్ రొనాల్ద్ చర్చిల్. ఆయన కొడుకు? సర్ విన్స్టన్ చర్చిల్.   

“టైంస్ ఆఫ్ ఇండియా సౌజన్యం తో”

Permalink 3 Comments

Next page »