భయంతో …

July 28, 2007 at 3:45 PM (భావాలమాల)

cal0cscu.jpg

కనులు మూస్తే
కనిపించిన కటిక చీకటి
రేపటి వెలుగు రేఖలు
కనిపించవేమోనని చెప్పటం తో ..
భయం తో చప్పున కనులు తెరిచాను
ఎదురు గా అవే ఆకలి కేకలు
నీటిలో అవే ఙ్ఞాపకాల చేపలు
కదిపి చూసాను కన్నీటి బొట్టు నై
గుండె రాతి పొరల్లో
మిలమిల మెరిసే కళ్ళ తో నీ చిత్తరువు
కొత్తకొత్త వలయాలు స్రుష్టించింది     
వాటితో …
చీకటికి నీవు అద్దిన రంగులు భీతి గొలిపిస్తుంటే తాళలేక
ఆవేదన కిటికీలను ఆలోచనల పరదాల తో కఫ్ఫివేసాను
పగటికి నీవు దిద్దిన హంగుల తో
చిన్న చిన్న నీటి బుడగలు   సైతం
పది తలల పాములై నర్తిస్తూవుంటే …
కకావికలమైన ఆ కన్నీటి చేపలను చూడలేక
భయం తో …
చప్పున కనులు మూసాను.

                                               -గ్రి

Post a Comment