మా తాతయ్య

July 28, 2007 at 3:30 PM (మావూరు....మావారు)

ముత్యాల మొలనూలు
మురిపెంబుగా జుట్టు
కాలికిన్ కడియము కట్టు బొట్టు
బొడ్డున నశ్యంపు బుర్ర నిండుగ యుండు
మాడరన్ ఫేషన్లు మట్టు బెట్టు
నడ్డ కట్టుల గాంచి ఆవేశ పడబోవు
క్రాపు తలల జూచి కసరబోవు
ఆచార్య జనమునకు నతి యాదరము జూపు
భక్తి తో దేవుని భజన చేయు
నట్టి బలిజశెట్ల యందు మేల్
ధరణి పువ్వలదొర్వు గ్రామ పుర నివాసి
రాజశ్రీ నూవుశెట్టి రాఘవయ్య నెపుడు
కేలనంజలిడురు బాలలార.

                                        – శ్రీ నూవుశెట్టి వెంకట రమణయ్య
                                        – శ్రీ అళహరి వెంకట శేషయ్య
                                           రచనా కాలం 1960

Post a Comment