చిన్ని మా అమ్మాయి చీరకేడిస్తేను!

July 29, 2007 at 3:40 PM (బోసి నవ్వులు)

ca5bi6ty.jpg

చిన్ని మా అమ్మాయి చీరకేడిస్తేను!
నెయ్యవోయి సాలీడు ఓ నేతగాడా!
పమిట కొంగున రెండు పద్మాలు నెయ్యి!
గోచి కొంగున రెండు గోరింకలెయ్యీ!
నడాన నాలుగు నెమళ్ళు నెయ్యీ!
అరుస్తూ చాకలి ఆర్నెల్లు ఉతికే! 

ముచ్చటగ అమ్మణ్ణి మూడేళ్ళు కట్టే.

మహానుభావుడు “బ్రౌన్” గారి సేకరణలనుంచి.

Permalink 12 Comments

ఏడవకు ఏడవకు నా చిట్టి తల్లీ!

July 29, 2007 at 3:35 PM (బోసి నవ్వులు)

hush.jpg

ఏడవకు ఏడవకు నా చిట్టి తల్లీ!
భావి భారత బాలికవు నీవు!
పుట్టినావు ఈ పుణ్య దేశమున!
మన దేశమున పాపలేడ్వరాదు!
బాలచంద్రుడు నిన్ను పరిహసిస్తాడు!
వీర శివాజి నిన్ను ఎక్కిరిస్తాడు!

మహానుభావుడు “బ్రౌన్” గారి సేకరణలనుంచి.

Permalink 2 Comments

అందుకోని ప్రేమలేఖ

July 29, 2007 at 3:27 PM (భావాలమాల)

ca09610r.jpg

ప్రియతమా!
ఎలా వున్నావు?
ఇక్కడ అంతా బాగానే వుంది
నీ నీడ పారాడిన దారుల్లో,
నావంటూ మిగిలిన గీతల్లో
నిజం అపజయం
పెనుగులాడుకుంటూనే ఉన్నాయి
కాలం చూపించిన అడుగుజాడల్లో
ఆడుకుంటున్నాయి.
నీ ఆలోచనల తో నిండిపోయి
అందమైన గ్లాసులు బద్దలవుతున్నాయి
అస్థిత్వం వాటిపై రంగుల చిత్రాలు వేస్తూ…
నన్నిప్పటికీ నిలదీస్తూ వుంది.
నీదంటూ మిగిలిన ప్రపంచం లో
మనుషులు పోరాడుతూ వుంటే
ఇక్కడ కంకాళాలు కర్మసాధన చేస్తున్నాయి.
సరేలే…ఇక వుంటాను
గుడిలో దీపలు,
నేలరాలిన పారిజాతాలు,
కొబ్బరి చెట్టు చాటున దాగుడు మూతలాడే
నిండు చందమామ,
ఆ చెట్టు కింద నిలుచున్నా కూడా మనల్ని
నిలువునా తడిపేసిన వర్షపు చినుకులు…
అన్నీ నిన్నడిగినట్లు చెప్పమన్నాయి
ఆ…మరచిపోయాను
నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు
వాటన్నింటికీ తెలిసిపోయింది…
ఉంటాను.
 

Permalink 4 Comments

« Previous page · Next page »