తారు రోడ్లపై పంటలు పండవురా….
పోలో అరణ్యం, గుజరాత్ లో కనిపించిన ఈ మొక్క తారు రోడ్డుని కూడా తొలుచుకుని బయటకు వచ్చింది. పరిశీలిస్తే ఇలాంటివి అక్కడక్కడ తారు రోడ్డు పై చాలా కనిపించాయి. కష్టాల నుండి బయట పడటానికి మనషికి ప్రకృతి ఇచ్చిన సందేశంలా అనిపించి, వెంటనే కెమెరా క్లిక్ మంది.
పూలవాన పెళ్ళిపిలుపు
మన పూలవాన రవికిరణ్ తెలుగులో (పిలిచి) చేసిన తన సోదరుని వివాహ ఆహ్వానపత్రిక ఈ వీడియోలో వీక్షిద్దాం …….
వ్యాసం కన్నా వ్యాఖ్య గొప్పది. “ఇ – తెలుగు” సమావేశం. ఓ సందేశం.
“ఈ కాంక్రీట్ జనారణ్యంలో కొన్ని పిచ్చి మొక్కలు, ఎవరికీ పనికి రావు. కొన్ని కలుపు మొక్కలు, ఇవి పరాన్న బుక్కులు. ఇంకా కొన్ని విషపు మొక్కలు. నమ్మకంగానే కనిపిస్తాయి. కాని నమ్మితే చంపుతాయి. అయితే చాలా, చాలా మొక్కలు మాత్రం ఆహారాన్నీ, ఆవాసల్నే కాక , తాము ఎండినా మనకు నీడనిస్తాయి. అవి తడిచినా మనల్ని తడవనివ్వవు, మరి కొన్ని చనిపోయి మనల్ని బ్రతికిస్తాయి. ఇది పకృ తి సహజమేమో? నిస్వార్ద “ఇ – సేవ” కి నమస్సుమాంజిలి.”
– నక్కా కృష్ణ
కొందరి వ్యక్తుల నిస్వార్ధ “ఇ – సేవ” గురించి ఈ బ్లాగులో ఈమధ్య ప్రచురించబడిన ఓ వ్యాసానికి వచ్చిన వ్యాఖ్య ఇది. వ్యాసం కన్నా ఇదే బాగుందనిపించింది . అందుకే మీ కందిస్తున్నాము. ఈరోజు ౦౬-౦౧-౨౦౦౮ (౦6-౦1-2008) ఆదివారం, మధ్యాహ్నం 3 గంటలకి, కష్ణకాంత్ పార్క్, యూసఫ గూడ, హైదరాబాద్ లో “ఇ – తెలుగు ” సమావేశం జరగనుంది. అందరూ ఆహ్వానితులే. ఈ “ఇ – తెలుగు” సమావేశాలు విజయవంతమవ్వాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాము.




