సామెత – బ్లామెత

March 9, 2008 at 4:55 AM (బోసి నవ్వులు)

సామెత

“దానము అయితే ఇవ్వలేను, దండము అయితే పెట్టగలను.”

బ్లామెత

వ్యాఖ్య అయితే వ్రాయలేను, హిట్టయితే కొట్టగలను.

సామెత

“మొగుడ్ని కొట్టి మొగసాలెక్కినట్లు”

బ్లామెత

బ్లాగుని తిట్టి కూడలికెక్కినట్టు.

సామెత

“తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్టు.”

బ్లామెత

వ్యాఖ్య ముదిరి టపా అయినట్టు.

సామెత

“యధా రాజా తధా ప్రజ”

బ్లామెత

యధా బ్లాగు తధా హిట్లు

సామెత

“అడుసు తొక్కనేల? కాలు కడగనేల?”

బ్లామెత

అనామక వ్యాఖ్య రాయనేల? అనవసరంగా తిట్లు తిననేల?

(ఈ బ్లామెతని జ్యోతిగారు, ఈ బ్లాగులో వ్యాఖ్యగా ఇచ్చారు.)

సామెత

“ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి.”

బ్లామెత

ఎగిరెగిరి రాసినా అన్నే హిట్లు, ఎగరకుండా రాసినా అన్నే హిట్లు

13 Comments

  1. Phani said,

    Hilarious!

  2. Srividya said,

    Wow Really good………….. :)

  3. ప్రవీణ్ గార్లపాటి said,

    ఇరగ…

  4. నెటిజన్ said,

    బ్లాగులు రాసే, చదివే మేధావులకి, మీ బ్లామెతలు, వారి బ్లాగులకి మంచి మేతనిస్తున్నవి!

  5. jyothi said,

    SUPER giri,,,

    keep it up………

  6. నల్లమోతు శ్రీధర్ said,

    మీ ఫొటోలు, సామెతలు, బ్లామెతలు ఒకదానికొకటి లింక్ చేసుకుని ఊహించుకుంటే ఆపుకోలేనంత నవ్వొచ్చేసిందండీ.

    - నల్లమోతు శ్రీధర్

  7. ramakrishna said,

    కెవ్వు కేక…

  8. రానారె said,

    బ్రహ్మాండం. :) అన్నింట్లోనూ మరీ నచ్చినవి- ‘వ్యాఖ్య ముదిరి టపా అయినట్లు’ మరియు చివరి బ్లామెత.

  9. తెలుగు 'వాడి' ని said,

    కెవ్వు…కేక…సూపర్ డూపర్ హిట్ … 10/10

  10. radhika said,

    20/10

  11. నువ్వుశెట్టి బ్రదర్స్ said,

    ఫణి, శ్రీవిద్య, ప్రవీణ్ గార్లపాటి, నెటిజన్, జ్యోతి, నల్లమోతుశ్రీధర్, రామకృష్ణ, రానారె , తెలుగు’వాడి’ని, రాధిక గార్లికీ మరియు మిగిలిన అందరికీ. సామెత – బ్లామెత నచ్చినందుకుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. :)

  12. నెటిజన్ said,

    హమ్మయ్య, పదకొండు మందిని గుర్తించి మీ ధన్యవాదాలు అందించి నందుకు – ధన్యవాదాలు!

  13. నువ్వుశెట్టి బ్రదర్స్ said,

    అమ్మా జీవి గారు, తప్పించుకుందామనే? మీరిక్కడికి రాకపోతే ఎప్పటికీ మీ అకౌంట్ లో డెబిటే చూపిస్తుంది మరి అహ్మదాబాద్.

Post a Comment