సామెత – బ్లామెత

March 9, 2008 at 4:55 AM (బోసి నవ్వులు)

సామెత

“దానము అయితే ఇవ్వలేను, దండము అయితే పెట్టగలను.”

బ్లామెత

వ్యాఖ్య అయితే వ్రాయలేను, హిట్టయితే కొట్టగలను.

సామెత

“మొగుడ్ని కొట్టి మొగసాలెక్కినట్లు”

బ్లామెత

బ్లాగుని తిట్టి కూడలికెక్కినట్టు.

సామెత

“తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్టు.”

బ్లామెత

వ్యాఖ్య ముదిరి టపా అయినట్టు.

సామెత

“యధా రాజా తధా ప్రజ”

బ్లామెత

యధా బ్లాగు తధా హిట్లు

సామెత

“అడుసు తొక్కనేల? కాలు కడగనేల?”

బ్లామెత

అనామక వ్యాఖ్య రాయనేల? అనవసరంగా తిట్లు తిననేల?

(ఈ బ్లామెతని జ్యోతిగారు, ఈ బ్లాగులో వ్యాఖ్యగా ఇచ్చారు.)

సామెత

“ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి.”

బ్లామెత

ఎగిరెగిరి రాసినా అన్నే హిట్లు, ఎగరకుండా రాసినా అన్నే హిట్లు

Permalink 13 Comments

కృకీలు

March 7, 2008 at 5:21 PM (కృకీలు)

వృద్ధాశ్రమాల నిండా ఆశతో గీసిన చిత్రాలు,
అన్నీ… తప్పిపోయిన కొడుకులవే.

Permalink 6 Comments

ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి.

March 6, 2008 at 9:54 PM (చిత్రం చిత్రం)

ఈ చిత్రంలో తెల్ల గీతలుగా కనిపించేవి మాత్రమే ఒంటెలు. నల్లటివి వాటి నీడలు మాత్రమే. ఇది 2005 సంవత్సరానికి గాను, అత్యుత్తమ ఛాయా చిత్రాలలో ఒకటి గా ఎన్నికైందట. చిత్రంగా ఉంది కదూ ఈ చిత్రం.

Permalink 2 Comments

« Previous page · Next page »