కాలానికి గాయం చేస్తూ….

May 14, 2008 at 7:23 AM (భావాలమాల)

కాలానికి గాయం చేస్తూ…
పగలూ, రేయి ఎర్ర చీరలు కడుతున్నాయి.
తెల్లవారు ఝామునే లేచిన కోళ్ళు పచ్చి నెత్తురు తాగమంటున్నాయి.
వద్దు వద్దన్నా మానవత్వపు ఘోరీల మీద మెదళ్ళు మొలుస్తున్నాయి.
రాను రాను మోకాళ్ళూ గోల చేస్తున్నాయి మాకేవి అరికాళ్లని.
నాంజేళ్ళు మొలచిన పారాణి చేతులు రిమోట్లు
నొక్కుతున్నాయి.
అన్నీ తెలిసిన అమాయకపు బాంబులు అద్భుతంగా
పేలుతున్నాయి.
తెగిపడిన కాళ్ళూ చేతులు నేలమీద రక్త కవితలు రాస్తున్నాయి.
అందమైన ఖద్దరు పెదాలు నవ్వుతూ రెండురెళ్ళు ఆరూ అంటున్నాయ్, మనల్ని నమ్మమంటున్నాయ్.
అన్నీ చూస్తూ కాలం పరుగెడుతోంది!
తన రక్త గాయాలు మానే కాలాని కోసం…

(జైపూర్ లో నిన్న (13-05-08 ) జరిగిన దారుణ మారణకాండకు స్పందనగా….)

Permalink 14 Comments

కృకీలు

May 13, 2008 at 7:05 AM (కృకీలు)

బాధ పడకు మరి,
అమ్మ చనిపోలేదు…
మమ్మీ అయిందంతే….

(Happy Mother’s Day)

Permalink 5 Comments

something fishy

May 10, 2008 at 5:35 PM (మనసులో మాట)

Permalink 4 Comments

« Previous page · Next page »