నే బతికే ఉన్నాను….

ఇక్కడ నలభై..
అక్కడ ఒకటి,
చేతికొస్తున్న పంటలు చీడపడుతూ,
మొన్న కిరణ్,
నిన్న అర్పణ
నేడు విశాల్.
మరి నేనెక్కడ?
నాకు నే కనపడుటలేదు.
ఆత్రుతగా వెదికాను గూగుల్ ఏర్తులో,
నేనెక్కడని?
జూము చేసి చూశాను నేనున్నానా ? అని.
అదుగో నా బంగ్లా, అల్లదిగో నా కారు..
మరినేను?
బలుపు నలుపు తుపాకీల గురిలో,
నట్ట నడిరోడ్డులో,కటిక చీకటిలో
ఓంటరిగా…. క్రింద డాలర్లు ఏరుకుంటూ,
నేనున్నాను.
బతికే ఉన్నాను.
అక్కడ నలభై,
ఇక్కడ ఒకటి,
నే బతికే ఉన్నాను….



నల్లమోతు శ్రీధర్ said,
January 21, 2009 at 5:14 PM
నువ్వుశెట్టి సోదరులకు బ్లాగు లోక పునరాగమనానికి స్వాగతం. మీదైన శైలిని ప్రదర్శించారు.
NNMuralidhar said,
January 21, 2009 at 5:53 PM
super
radhika said,
January 21, 2009 at 6:18 PM
చాలా రోజుల తరువాత వచ్చి నేను బతికేవున్నాను అని జనాలకి గుర్తుచేస్తున్నారనుకున్నా.బావుంది కవిత.కానీ ఇంతకీ మీరెక్కడ వున్నట్టు.డాలర్లు ఏరుకొంటూ అన్నారు కాబట్టి ప్రవాశంలోనా లేక పత్తి పంటల గురించి చప్పారు కాబట్టి స్వదేశంలో వున్నట్టా?నా మట్టి బుర్రకి అర్ధం కాలేదండి.
Kalyani said,
January 22, 2009 at 9:39 PM
Nice peotry
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
January 23, 2009 at 6:50 AM
శ్రీధర్ గారు సంతోషం,మీ వ్యాఖ్య ఆనందదాయకం.
మురళి గారికి మరియు కల్యాణి గారి కి కృతజ్ఞతలు.
రాధికా గారు,లేదండీ పూర్తిగా పత్తి పంటలలోనే. అచ్చ తెనుగు రాజధానిలో రూపాయలు వెదుక్కుంటూ.
ప్రవాశీయులని అంటే బాగుండదని నన్ను నేను వెదుకున్నాను. అంతే. కృతజ్ఞతలు.
bollojubaba said,
January 23, 2009 at 8:53 AM