నువ్వే నువ్వే

February 17, 2009 at 2:49 PM (భావాలమాల)

ph-11146

అందమంటే నీదే
ఎందుకంటే
నీవందని ఎత్తులో ఉన్నావు కాబట్టి.
స్వప్నమంటే నువ్వే
ఎందుకంటే
అది పిలిస్తే వచ్చేది కాదు కాబట్టి.
కాలమంటే నీవే
ఎందుకంటే
నీవు లేని క్షణం నాకు లేదు కాబట్టి.
బలమంటే నీదే
ఎందుకంటే
నీవు కొట్టిన దెబ్బ ఇంకా తగ్గలేదు కాబట్టి.


1 Comment

  1. padmarpita said,

    నచ్చింది మీ కవిత
    ఎందుకంటే
    నా ఆలోచనలుకూడా మీలాంటివే కాబట్టి.

Post a Comment