పొటాటో ప్రేమ.
మాంచి మసాలా కూర చేద్దామని, బుట్టలోనుండి బంగాళాదుంపలు బయటికి తీసాను.
కూనిరాగం తీస్తూ వాటిని కడిగి, తీరా తరుగుదామని కత్తి దూస్తే, ఇంకేముంది దాని
దుంపదెగ బంగాళాదుంప కాస్తా ప్రేమరాగాలు పాడింది. అంటే అర్ధం కాలేదా?
పైన ఫోటోలో చూడండి. ప్రేమ గుర్తులో ఎంత ముద్దుగా ఉందో. దాని ప్రేమ సందేశం
ఎర్రగా బుర్రగా ఉండే టమేటాకో మరి దేనికో మరి. అలా తరగటానికి మనసు రాక.
ప్లాస్టిక్ కవర్ లో మడచి ఫ్రిజ్ లో ఉంచాను ఇప్పటికి.
అయ్యలారా! అమ్మలారా! దాన్ని ఏం చేస్తే బాగుంటుందో కాస్త చెప్పండి.




సుజాత said,
March 9, 2009 at 2:29 PM
మీరనుకున్నట్టు మంచి మసాలా కూర చేసి లాగించండి. ఇలాంటి ప్రేమ గుర్తు బంగాళాదుంప మళ్ళీ మళ్ళీ దొరుకుతూనే ఉంటుంది లెండి.
misha said,
March 9, 2009 at 2:44 PM
nice one. preserve it in chemicals. I think its rare.
dnchari said,
March 9, 2009 at 8:07 PM
కసక్కన…పొడిసేసి (with knife), పొడిచేసి (mash) , లాగించండి
Mahi said,
March 9, 2009 at 10:54 PM
koora chesi meeku nachchinavallaki pettandi
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
March 12, 2009 at 5:26 PM
#సుజాత గారు అలాగే కాని మనసొప్పటం లేదు.
#మిష గారు థ్యాంక్స్.
#dnchari గారు అబ్బ ఎంత బాగ చెప్పేరు. నోరూరిపోతూంది.
#mahi గారు. చాలా బాగుంది మీ రొమాంటిక్ సలహా