మృగరాజు నవ్వుతుంది…..

lin.jpg 

అనగనగా ఒక అడవిని ఓ మృగరాజు పాలించేది.తను చేసిన తప్పులును అదునుగా చేసుకొని అవకాశం కొసం పొంచివున్న మరో మృగరాజు సమయం చూసి చేసిన పాదయాత్రతొ ఆడవిలోని జంతువులు అన్నీ తృప్తిపడి  ఆ రాజుని కాదని పాదయాత్ర చెసిన రాజుని తమ నాయకునిగా ఎన్నుకున్నాయి.అధికారం లోకి రాగానె ఈ కొత్త రాజు తనకు కోపం నరం తెగిపోయిందని ప్రకటించి నవ్వడం మొదులుపెట్టాడు .మొదట్లో ఇది అందరికీ నచ్చినా రానూ రానూ దానికి అర్ధాలు వెతకటం మొదలయ్యింది..పాత రాజు తను  ఏమిచెప్పినా నవ్వుతున్న ఆ కొత్త రాజుని చూసి ఉడుక్కోసాగాడు.మీవాళ్ళందరూ మావాళ్ళని చంపేస్తున్నారన్నా నవ్వే,అడవిలో భూములు లేకుండా చేస్తున్నారన్నా నవ్వే ,కోట్లు కోట్లు అడవి సంపద దోచేస్తున్నారన్నా నవ్వే.పేదజంతువులను పొలీసులు పిట్టలులాగా కాల్చేస్తున్నారన్నా నవ్వే. ఈ నవ్వులు చూసి పాత రాజుకి అయితే  నిజంగా పిచ్చిపట్టసాగింది. పాపం అడివంతా తిరగసాగాడు తన ప్రశ్నకు జవాబు కోసం.దొరకలేదు.ఎంతో  మేధావులు అనుకున్నవారినీ అడిగాడు.పాత పుస్తకాలూ తిరగేశాడు.లాభం లేకపోయింది.అప్పుడు ఎవరో మహానుభావుడు చెప్పిని సలహాతో అన్నీ తాత్కలికంగా వదిలేసి  శివుడు గురించి తపస్సు   చేయసాగాడు.అతని కఠినమయిన తపస్సుకి మెచ్చ్చి ప్రత్యక్షం అయిన శివుడు కూడా ఆనవ్వుకి అర్ధం తెలుసుకోలేక నేను చెప్పలేను బాబూ  సారీ అని చేతులెత్తేశాడు. 

 కట్ చేస్తె ఓ వంద ఏళ్ళ తరువాత అలా ఆకాశంలొ  మేఘాలమధ్యన నవ్వుకుంటూ నడిచిపొతున్న ఆ  మృగరాజుని చూసి శివుడు బాబ్బాబూ ఇప్పుడైనా ఆనవ్వుకి అర్దం  చెపుతావా అని బతిమలాడసాగాడు.ఏనవ్వుకి అడిగాడు నవ్వటం ఆపి ఆ మృగరాజు సందేహంగా.అదే వివరించి చెప్పాడు శివుడు.అప్పుడు మళ్ళీ పగలబడి నవ్వసాగాడు ఆ  మృగరాజు.అలా నవ్వీ నవ్వీ కళ్ళల్లొ నీళ్ళు వచ్చాక ఆపి అటూ ఇటూ చూసి అప్పడు చెప్పాడు శివుడికి.నిజానికి  వాళ్ళు అడిగే మాటలకు నేను నవ్వేవాడినికాదు……కాని ఆ పాతరాజుని చూసినప్పుడల్ల పాదయాత్రలతొ  ప్రజలని ఏలా మోసం చెయ్యొచ్చొ గుర్తుకొచ్చి నవ్వేవాడిని అని గుట్టువిప్పాడు ఆ మృగరాజు.తల తిరిగిన శివుడు ఆపాత రాజుని వెతుకుతూ మేఘాలమధ్యన  మాయమాయ్యడు.మళ్ళీ మన మృగరాజు  నవ్వుకుంటూ మేఘాలమధ్య  సాగిపోయాడు. 
                             
            
                                                     
                                  
                               

Advertisements
  1. సందర్భోచిత కధనం. వై.ఎస్ నవ్వుకి మీరిచ్చిన అర్ధం చాలా నచ్చింది

    • శ్రవణ్
    • July 30th, 2007

    పుట్టుకలతో వచ్చినది అయితే పుడకలతోగానీపోదు. కొవ్వుతో వచ్చిన నవ్వు అది కరగ్గానేపోతుంది. కరిగించగలిగితే కరిగిద్దాం లేదా కరిగించేవాళ్ళకి సాయం చేద్దాం.

  2. ఈ పిచ్చి మారాజుకి తిడుతున్నా నవ్వే,విమర్శిస్తున్నా నవ్వే.ఇదంతా చూస్తుంటే నాకో సామెత గుర్తొస్తుంది.దేని మీదో ఏదో పడ్దట్టంట.

  3. ilanti picchimaraju chala mandunnaru ,,,,

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: