ఈగ ఆత్మ కథ

2365001160075568609fkzmws_th.jpg

మిఠాయి శెట్టి కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళటంతో, “ఇంతవరకు మెక్కింది చాల్లే” అనుకుని బయట పడ్డాను. కాస్సేపు పచ్చటి చెట్ల మధ్య చల్లటి గాలిని ఆస్వాదిస్తూ సేదదీర్చుకుందామని గార్డెన్ కి వెళ్ళాను. ఆహా… ప్రక్రుతి ఎంత రమణీయంగా ఉంది. ప్రతి చెట్టు క్రిందా, బెంచీల మీదా, పొదల నీడనా వాత్సాయనుడే స్వయంగా చెక్కాడా? అనిపించే శిల్పాల లాగా జంటలు జంటలు గా యువతీయువకులు “ప్రేమ” ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇక నాకు చోటెక్కడిది? ఇంకాసేపు ఇక్కడే ఉంటే మనసు పెడత్రోవ పెట్టడం ఖాయమని తలిచి ఎగురుకుంటూ బయటకు వచ్చేసాను.

              బయట ఓ మెరుపు తీగ వయ్యారం గా నడచుకుంటూ వెళ్ళి కారెక్కింది. ఆహా…ఎవరీ కుసుమ కోమల రమణీమణి? ఆ జిలేబీల్లాంటి..ఛీ..ఛీ..మిఠాయి వాసన ఇంకా పోలేదు. ఈమె పాలుగారే రోజా రంగు చెక్కిలి మీద వ్రాలని నా జన్మ కూడా ఒక జన్మేనా? అనుకుని సర్ర్..మని ఎగిరి ఎసి కారు లోకి దూరేలోపే, చిరునవ్వు నవ్వి ధన్ మని తలుపు వేసేసింది. ఓహో దైవమా! అనుకుని ఆ ట్రాఫిక్ పొగలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆ అంగణామణి ని ఇంటి వరకు ఫాలో అయ్యేసరికి నాకు స్ప్రుహ తప్పినంత పనయింది. ఆ..చెప్పటం   మరచాను సిగ్నల్ దగ్గర ఆగినప్పుడల్లా విండో గ్లాస్ మీద వ్రాలి ఆ రమణి అందాన్ని జుర్రుకున్నాను లే.

              కారెప్పుడు పార్క్ చేసిందో? ఎప్పుడు చెప్పులు టక టక మనిపించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిందో? నిజంగా మెరుపు తీగే. ఇంట్లోకి అడుగిడదామంటే ఇంటి నిండా కుక్కలే. ఆశ్చర్యమేమంటే? అవి ఆమె వచ్చిందని ఎగురుకుంటూ వెళ్ళలేదు, కేవలం తోక ఊపాయి అంతే. నన్ను గమనించి జాలిగా చూసాయి. ఎందుకోమరి? వాటికి గుటకాయస్వాహా అవటం ఇష్టం లేక కిటికి లోనుంచి లోనికి దూరాను. ఇంట్లో ఒక్క ఈగ కూడా లేదు, ఏమిటబ్బా?  వంటగది లో ఏదో శబ్ధమయింది. అక్కడికి దూసుకెళ్ళాను. అక్కడ ఇంకో బేల ఏదో సూపు తయారు చేస్తూ ఉంది. నా అందాల భామ కన్నా రంగు తక్కువ, చప్పిడి ముక్కు, ఎండుగడ్డి లా ఉన్న బుగ్గలు…ఓక్..ఎందుకులే వర్ణన.   సరేలే మనకెందుకు? ఇంతకీ నా సుందరేది? ఇల్లంతా వెతికాను. ఎక్కడా కనిపించదేం? పడక గది లో కెళ్ళాను. అక్కడ అద్దం ముందు కుప్పగా పోసి ఉన్నయి నా సుందరి ఇందాక వేసుకున్న డ్రస్సూ, ఇంకా మిగిలిన మేకప్పు సామాను. కొంపదీసి ఇందాకటి సూపు సుందరే నా సుందరి కాదు కదా? దేవుడా! కాపాడు. ఏమిటి కాపాడేది? ఆమే ఈమె..ఈమే ఆమె. అమ్మ సుందరీ! అంతా మేకప్పు మహిమా? ప్రాణం ఉసూరుమంది. హాల్లోకొచ్చాను. సోఫాలో కూర్చుని టివి చూస్తూ ఉంది. టీపాయ్ మీద సూపుంది. మరిక ఆమె మొహం వైపు చూడబుద్ది కాలేదు. తిన్నదంతా అరిగిపోయింది. కాస్త సూపయినా తాగి వెళదాం అని ఒక్క ఊపు తో ఎగిరి కప్పు మీద వాలి ఘాటు గా అఘ్రాణించేనంతే! మస్థిష్కం లో ఏదో విస్పోటం జరిగిన చప్పుడయింది. దిమ్మదిరిగి గిరగిరా తిరుగుతూ ఢామ్మని సూపు లో పడి పోయాను. ఆఖరి క్షణాల్లో మాత్రం ఆ కుక్కల జాలి చూపులు  గుర్తుకు వచ్చాయి.

ca5con4p.jpg

Advertisements
 1. తమాషాగా ఉంది మిత్రమా

  • rohith
  • August 4th, 2007

  chaala baagaavumdi

  • sandhya
  • August 4th, 2007

  funny. guys are always do like flies.

  • nuvvusetty
  • August 4th, 2007

  ధన్యవాదాలు. నేస్తమా!

 2. nijame mari. without makeup?

 3. funny stort

 4. funny story

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: