108 ఫర్ నో లాస్

ca9hth22-copy.jpg

     ఓ శ్రీరామనవమినాడు భక్తులు పెట్టిన పెసరపప్పూ, పానకం బాగా ఆరగించిన శ్రీరాములవారికి అభివృద్ధి చెందిన నగరాలు ఎలా వుంటాయో చూడాలన్న ఓ సరదా ఆలోచనవచ్చింది. వెంటనే సీతమ్మవారితో,తన సోదరుడు లక్ష్మణుడుతో చర్చించాడు. అన్నమాట జవదాటని తమ్ముడు సరే అనటంతో  హిమాలయాల నుంచి పండక్కి వచ్చిన హనుమంతులవారిని తోడు తీసుకుని హైదరాబాద్ నగర విహారానికి బయలుదేరారు  ఆ నలుగురు .       
      
   అసలే హైదరాబాద్ అందులో సెలవు దినం కావటంతో ఎక్కడ చూసినా రద్దీ. ఐమాక్స్, హుస్సేన్సాగర్, గోల్కొండ,  హైటెక్ సిటీ ఒకటేమిటి?  సంభ్రమాశ్చర్యాలతో ప్రతీదాన్నీ తమ కనులారా వీక్షించారు. ఇక  చివరగా శిల్పారామంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి వెళ్దాము అనుకునేంతలో ఓ ఘోరం జరిగిపోయింది. ఆనందముతో ఆదమర్చి రోడ్డు దాటుతున్న మన లక్ష్మణస్వామిని వేగంగా వస్తున్న లారి ఒకటి కొట్టేసింది. అలా అచేతనంగా రక్తగాయాలతొ పడిపోయిన లక్ష్మణ స్వామిని చూచి సీతమ్మ వారు సృహ తప్పగా రాములవారు చేతనరహితులైపొయారు. ముందుగా తేరుకున్న  హనుమంతులవారు రామా! రఘురామా! మీరు భయపడకండి మన లక్ష్మణ స్వామికి ఏమీకాదు.నేనిప్పుడె పోయి సంజీవినీ పర్వతాన్ని తిరిగి తీసుకొనివస్తాను అంటూ  ఎదో చెప్పబోయాడు. వలదు..వలదు..అని వారించిన శ్రీరాముడు తన మెరిసే కళ్ళతో ఎదురుగా ఉన్న ఓ బొర్దు వైపు చూపించాడు. అది చూసి, తమ ఆజ్ణ ప్రభూ అంటూ   ఉత్సాహంగా గాలిలోకి ఒక్కుదుటున దూకి ఎగురుకుంటూ అలా  ఆకాశం లోకి దూసుకువెళ్ళిన మన రామభక్త హనుమంతుడు తిరిగి ఐదు నిమిషాలలో 108 అంబులెన్సుని అలనాటి సంజీవినీ పర్వతంలా మోసుకునిరావటం తో  ఆకాశం నుంచి ఆత్రుతగా చూస్తున్న ముక్కోటి  దేవతలు తృప్తిగా   పూలవర్షం  కురిపిస్తుండగా  లక్ష్మణుడికి పునర్జన్మనీయటానికి ఫస్టు ఎయిడ్ చేస్తూ తిరిగి వేగంగా తన గమ్యం వైపు   దూసుకునిపోయింది 108 ఎమర్జన్సీ సర్వీసు.ఇదంతా చూసి ఎదురుగా గొడమీదున్న 108 ప్రచార బోర్డు ఈరోజు ఇక్కడ ఒకర్ని కాపాడాననుకుంటూ తృప్తిగా నవ్వుకుంది.

20060807.jpg
(2005 నుంచి ఎన్నోవేలమందికి ప్రాణదానం చేసి రోజు రోజుకూ విస్తరిస్తున్న 108ఎమర్జన్సీ సర్వీసు కి మన:పూర్వక అభినందనలతో)                                                                                                                      
  

Advertisements
 1. హనుమంతులవారు కాబట్టి 108 ఆంబులెన్సుని గాల్లో ఎత్తుకొచ్చాడు. నేటి హైదరాబాదు ట్రాఫిక్కులో రోడ్డు మీద ఈ ఆంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటికి సమయం మించిపోయేలోగా చేరేదెలా?

  • sandhya
  • August 4th, 2007

  good

  • nuvvusetty
  • August 4th, 2007

  అంటే భవిష్యత్తు లో హెలికాఫ్టర్ లు
  వుపయోగించే స్థితి కి 108 చేరుతుంది
  అని ఆశిద్దాం నేస్తమా!

  • vinu
  • August 5th, 2007

  chaala baagumdamdi.

 2. కథనం డి.డి.-సప్తగిరిలో ప్రభుత్వ పథకాల ప్రకటనలకు వ్రాసినట్లుగా ఉన్నది. కాన్సెప్ట్ మాత్రం అదిరింది.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: