“సమ్మె చేద్దాం రండి”

dog.jpg 

    ఒకానొక  తీరిక సమయములో ఓ కుడిచేయి,పక్కనే ఉన్న ఎడమచేయి మాటా మంతీ లాడుకుంటుంటే, మాటల మధ్యలో “ముఫై రెండు పళ్ళ  నోటి” గురించి  ప్రస్తాపన వచ్చి రెండిటి మధ్యా చర్చ మొదలైంది. మనిద్దరమూ రెండుచేతులా సంపాదిస్తుంటే ఆ నోరు మొత్తం  ఒక్కటే తినేసి  మన ముందు ఫొజులు కొడుతుంది. మనం “పంచభక్షపరమాన్నాలు” దానికిస్తున్నా అది మాత్రం మనకి  నాలుగు “ఎంగిలి” మెతుకులు మిగులుస్తుంది. చివరకు వాటిని కూడా ఆ వెధవ నాలుకొచ్చి నాకేసి వెళుతుంది. ఇక మనకు మిగిలేదేంటి? ఇంకానా ఈ అన్యాయం , ఇకపై సాగనీయరాదంటూ, రెండూ ఒకటే ఇదై ఆ క్షణాన్నేఇక నోటికి ఏమీ అందీయకుండా “పస్తు” పెట్టాలని ఓ గట్టి నిర్ణయం తీసుకుని తమ సమ్మెను అప్పటికప్పుడు  మొదలెట్టేశాయి..చివరకు ముక్కుకి జిలపుట్టినా గీరటం మానేశాయి.                          

                         కొద్ది గంటల తరువాత, అదీ..బాగా కడుపు కాలిన తరువాత కాని విషయ తీవ్రత పొట్టకీ,నోటికీ తెలియరాలేదు. తెలిసిన తరువాత వెంటనే  లౌక్యం బాగా తెలిసిన  నాలుకను ( ముఫై రెండు పళ్ళ మధ్య దెబ్బ తగలకుండా తప్పించుకుంటూ  తిరుగుతుంది కదా..మరీ !)  రంగంలోకి  దింపాయి.     
               
నాలుక తనకు తెలిసిన అన్నివిధ్యలూ  ప్రదర్శించి, రకరకాల విన్యాసాలూ చేసింది. అయినా లాభం లేకుండా పోయింది. చేతులు దాని మాటా వినలేదు. మెదడుకి చెప్పి నయానా,భయానా ఎన్ని సిగ్నల్సు పంపించినా చేతులు  ససేమిరా అనడంతో ,రాను రానూ లోపల పేగుల అరుపులు ఎక్కువవటంతో  ఇక లాభంలేదని చేతులుని చర్చలకు ఆహ్వానించాయి.   
రోజుల తరబడి జరిగిన చర్చలూ యధావిధిగా ఎవరి వాదనకు వారు  కట్టుబడటంతో చివరకు విఫలమై ఇరు వర్గాల మధ్యా మాటామాటా పెరిగింది.ఒకరినొకరు నిందించుకున్నారు. పరిస్థితి చేతలకూ మారింది. తన అధికారాన్ని ప్రశ్నించడంతో అదుపు తప్పి ఆగ్రహించిన నోరు ఎవరూ ఊహించని విధంగా తన వాడి పళ్ళతో క్షణ కాలంలో  కసుక్కున చేతిని కొరికేసి కింద ఉమ్మేసింది.కెమేరాలు క్లిక్కు మన్నాయి. పాపం!చేయి నొప్పితో  విలవిలలాడిపోయింది. అయినా అంత నొప్పిలోనూ చలించక దీన్ని తనకనుకూలంగా మార్చుకోవాలని భావించి, కెమెరాల ముందుకొచ్చి నానా గొడవా చేస్తూ పెద్ద పెద్దగా అరవాలని ప్రయత్నం  చేసింది. కాని ఎంతకీ శబ్ధం మాత్రం బయటకు రాలేదు. మూగసినిమాలా ఉంది తన ప్రదర్సన.ఎందుకంటే తెలివి గల నోరు గదా రాబోయే ప్రమాదం ముందుగా ఊహించి వెంటనే గట్టిగా తన నోరు మూసేసుకొని మౌనంగా ఉండిపొయి ముసిముసి నవ్వులు నవ్వుకోసాగింది. చేయి తనంత తానుగా అరవలేక  నిస్సహయంగా నొప్పితో విలవిలలాడుతూ నిలబడిపోయింది. జర్నలిస్టులు చకచకా ఫొటోలు తీసుకోసాగారు.

  అప్పటిదాకా అన్నీ చూస్తూ వున్న కళ్ళు మౌనంగా రోదించటం మొదలుపెట్టాయి.

  అనుకోని సంఘటనతో ఓ జర్నలిస్టు,ఫొటోలు తీయడం ఆపి , కళ్ళూ!కళ్ళూ! నొప్పి చేయికి కదా  మరి మీరెందుకేడుస్తున్నారు? అన్నాడు నోటు బుక్కు చేతిలోకి తీసుకుంటూ ఉత్సాహంగా, అందుకు ఆ కళ్ళు ‘విరక్తిగా’నవ్వి ఎక్కడ  దెబ్బ తగిలినా చివరకు ఏడవాల్సింది “మేమే” గదా! అందుకే  విధిలేక ఏడుస్తున్నామంటూ తన ఎదురుగా  గోడ మీద ఉన్న “భారతమాత” ఫొటోని తడి కళ్ళతో నిస్సహాయంగా చూస్తూవుండిపోయాయి .           
   

     
 
 

Advertisements
 1. ఈ కథ కాదు కాని, ఇలాంటిదే ఎక్కడో విన్న గుర్తు.

  అదేంటి? పాపం చేతులకి ఏదో శుభం కార్డు పెడతారేమో అనుకున్నాను. వాటిని అలానే వొదిలెయ్యటం అన్యాయమండి! ఇంతకీ ఇది మీ సొంతమా?

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • August 24th, 2007

  వికటకవి గారికి,
  మా ఫీలింగ్స్ ను సరిగా ప్రజెంట్ చెయలేకపొవటంవల్ల మీరు ఆ అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు.ఇది పూర్తిగా స్వంతమే.సేకరణలకు విధిగా వారిపేరు జతచేస్తున్నాము.గమనించగలరు.మీరు మరోవిధంగా భావింపకూదదని ఈ వివరణ.
  దీంట్లో చేతులను ప్రజలకు,నోటిని అధికారానికి,పళ్ళను పోలీసుకి,నాలుకను మధ్యవర్తిత్వానికి,మెదడుని అధిష్టానానికి,కళ్ళను అభివృద్ధికి అన్వయిస్తూ వ్రాసింది.కాబట్టి మరొక్కసారి పరిశీలించగలరని మనవి.
  మొన్న నందిగాములో,నిన్న ముదికొండలో స్థూపాలు వెలిశాయి కాని శుభాలు జరగలేదుగా మాస్టారూ.అందుకే చేతులను అలా వదిలేయాల్సివచ్చింది.

 2. మీరు ఇంతకుముందు కూడా ఈలాంటి అన్వయింపు రచన ఒకటి చేసినట్లు గుర్తు. మీరు ఆ అన్వయం చెప్పక మునుపు పెద్దగా బాగా అని పించనిది, పొడుపు కథ గుట్టు విప్పినట్లు మీ అన్వయాలు చుడగానే ఆ చమక్కు స్ఫురించి మంచి భావన కలిగింది.

  బావుంది. ఇలాంటివి ఇంకా వ్రాస్తూండండి.

 3. నాకు ఇది చదువుతున్నప్పుడు, అనిపించిన భావాలు:

  చేతులు: సి.పి.ఐ, సి.పి.యమ్

  నోరు: కాంగ్రెస్

  నాలుక: ప్రణబ్ ముఖర్జీ వంటి మధ్యవర్తులు..

  నోరు ఎవరూ ఊహించని విధంగా చేతులని కొరకడం: మన్మోహన్ సింగ్, వామపక్షాలని మద్దతు ఉపసంహరించుకుంటే ఉపసంహరించుకోండి అని అనడం

  చేతులు పెద్దగా అరవాలని ప్రయత్నించడం: వామపక్షాలు అటు మద్దతు ఉపసంహరించుకోలేక, ఇటు వాళ్ళకి సమర్ధించలేక, సీతారం యేచురి లాంటి వాళ్ళు, కరణ్ థాపర్ షో లో, నీళ్ళు నమలడం…

  కళ్ళు: ప్రజలు..

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • August 28th, 2007

  మీ వెర్షన్ కూడా సరిగ్గా సరిపోయింది.రెండు చేతులను CPI&CPM అని చూడగానే నవ్వు వచ్చింది ….కత అర్ధమై….. Thanks.

  • వికటకవి
  • August 29th, 2007

  నేను మొదటి సారి చదివినప్పుడు అసలు మామూలు కథే అనితప్ప అసలు అందులో రాజకీయ ఘటనల గురించి చెప్పారని అనుకోలేదు. అందుకే అది మీ సొంత కథా అని అడిగాను. మీ అన్వయం చెప్పాక, అబ్బో అనిపించింది. బాగా చెప్పారు, కథ మరియు వాస్తవం.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: