కొత్త వంటకం “షేర్ మసాలా బేర్బుల్”

share.jpg

సంపూర్ణ శాఖాహారమైన ఈ వంటకాన్ని పడమట భారతదేశం లో అంటే గుజరాతీయులు, మహరాష్ట్రీయులు ఎక్కువగాను, మిగిలిన ప్రాంతాల్లో కొన్నిచోట్ల దీన్ని ఇష్టంగా వండుకుని తింటారు. జ్ఙాపకం(memory) తక్కువగా వుండటం వల్ల కావల్సిన పదార్ధాలను, తయారుచేయు విధానాన్ని కలిపి చెప్పేస్తాను.

ఉదయం తొమ్మిది గంటల ముఫై నిమిషాలకు స్టవ్ వెలిగించి సిం లో పెట్టి దానిపై పెనాన్ని వుంచాలి. అంటే సరిగ్గా 15 ని|| తరువాత పెనం వేడిక్కి తయారుగా వుండాలన్నమాట. ఇప్పుడు పిడికెడు పాత ఎండిపోయిన షేర్లను తీసుకుని బాగా నలిపి నీళ్ళలో నానబెట్టాలి.నాలుగు అప్పర్ సర్క్యూట్ షేర్లను శుభ్రంగా కడిగి లావుగాను, ఐదు లోయర్ సర్క్యూట్ షేర్లను పొడిగానే సన్నగా తరిగి వేరువేరుగా వుంచుకోవాలి. కనీసం 5 BTST షేర్లను కూడా కడిగి తయారుగా వుంచుకోవాలి. పిడికెడు ప్రీమియం తక్కువున్న షేర్లను తొక్క తీసి తగినంత వుప్పు కారం బాగా దట్టించవలెను. నిన్న క్లోజింగు మైనస్ లో వున్న ఓ డజను స్క్రిప్లను జల్లెడ పట్టి అన్నింటికీ మైదా పూయవలెను. సమయం ఇంకా 9.55 అవటానికి సమయం కేవలం 5 ని|| వున్నందున, వేడి పెనం మీద inflation ని బట్టి నూనె పోయవలెను. త్వరత్వరగా చేతికందినన్ని ప్రీమియం ఎక్కువున్న షేర్లను ఏరి మిక్సీలో వేసి బాగా పేస్ట్ అయ్యేవరకు క్రష్ చెయ్యాలి. ఇక సమయం ఒకే ఒక్క నిమిషం మిగిలి వున్నందున మనస్సులో 60, 59, 58, …. అనుకుంటూ ఒక చేతిలో అప్పర్ సర్క్యూట్ ముక్కలు, మరో చేతిలో తొక్క తీసిన ప్రీమియం షేర్లను పట్టుకొని తయారుగా వుండవలెను. అదే చేతిలో లోయర్ సర్క్యూట్  ముక్కలు కూడా ఇరికించి పట్టుకొనవలెను. 35, 34, .. అంటూ 30 వచ్చినప్పుడు ఎలాగయినా కష్టపడి (కాలితోనయినా సరే) ఫ్లేం ని హైలో పెట్టండి. 10,9,8,.. అనుకుంటూ చేతుల్ని సరిగ్గా పొగలు కక్కే పెనం మీద దగ్గరగా చేర్చండి. ..1,0 అనేసి ముందు అప్పర్ సర్క్యూట్ ముక్కలు వదిలి, అరక్షణం లోపలే రెండో చేతిలోనివి కూడా వదిలేసెయ్యాలి. ఫెద్ద చప్పుడు చేస్తూ ముక్కలు కాలిపోకముందే BTST షేర్లనుకూడా పెనం మీద చల్లాలి. ఇప్పుడు రెండు గరిటలు రెండు చేతుల్లో పట్టుకుని రెండుక్షణాలు వీటిని కలపాలి. వెంటనే మైదా పూసిన స్క్రిప్లను పెనం మధ్యలోవేసి తిప్పితిప్పి మూడు క్షణాలు వేపాలి. ఇప్పుడు నీళ్ళలో నానబెట్టిన ఎండు షేర్లను తీసి పెనం అంచున చుట్టూ పేర్చాలి. PIE ని బట్టి స్పూనుడు నెయ్యి వేసి కలిపి, చిటికెడు వుప్పు, మిరియాలపొడి చల్లి మధ్యలో వున్న పదార్ధాలను గరిటతో కలిపి, మరుక్షణంలోనే, దీని మీద మిక్సీలో పేస్ట్ చేసిన షేర్లను పోసి మూత పెట్టి, గ్రే మర్కెట్ రంగు వచ్చే వరకు వేగనివ్వాలి. అంతే షేర్ మసాలా బేర్బుల్ తయార్. దీనిమీద ఫ్రెష్ గా వున్న రెండుమూడు ఐ.పి.ఒ లను అందంగా పొదిగి సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా వుంటుంది.
నోరూరిపోతూంది కదూ!!!.

Advertisements
 1. బాగుంది మీ వంటకం :).

 2. నోరూరడం సంగతేమో గానీ చేతులు కాలేట్టుగా ఉంది 🙂

  అదిరింది మీ షేరు సెటరిఉ.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • September 19th, 2007

  Thanks kotta paalee & ramanaa gaaruu..

  • solarflare
  • September 20th, 2007

  అబ్బే ఓ నాలుగైదు చేతులు కావాలి – ఈ సారికి వీడియో తీసిపెట్టారంటే…

 3. అర్ధం కాకున్నా విధానం బాగుంది. అదేదో కాస్త తినే పదార్థాలతొ ప్రయత్నించండి.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • September 20th, 2007

  జ్యోతి గారికి,మా బ్లాగు లో మీరు ఇచ్చిన మొట్ట మొదటి కామెంట్ కి స్వాగతం.ఇలాగే మీ అందరి ప్రోత్సాహం మాకు అన్నివేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ..

 4. వెనకమైదానం ( అనగా Background) లో ‘అయ్యాయో జేబులు డబ్బులు పోయెనే’.. పాట విపిస్తోండి, ఐనా బెదరద్దంటారా?

  కొత్తాపాళీ గారు, రెండర్ధాలమాట “చేతులుకాలటం “, బాగా అతికింది. 🙂

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • September 22nd, 2007

  solarflare gaariki,vookadampudu gaariki amdarikee thanks amdee.

  • visveswar
  • November 4th, 2008

  వావ్!!! వెరైటీగా ఉంది కొత్త వంటకం “షేర్ మసాలా బేర్బుల్”. గుడ్ ఐడియా. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదే మరి.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: