పచ్చనాకు సాక్షిగా నామినికో లేఖ…

bapu18.jpg

“కష్టి పడాల కూడు తినాలఅని మంచి మాట చెబితివి కదరా నా బట్టా! యాడికి పోయినావురా నామినోడా? దోవన బొయ్యే చీమని కూడా మంచీచెడ్డా అడిగేటోడివిగదరా, అసలు నీకు ఈడ మేమనేటోల్లం ఒకరం సావలేక బతకతావుండామని చీవ గుట్టినట్టన్నా వుందంటరా నా బట్టా? ఈడ వూర్లో కోడిపుంజులు తెగ బలిసి కొట్టుకుంటా వుండాయిరా, దొబ్బుకుపోయి కోసకతినడానికి నీ సావాసకోపులు యాడికి బోయినార్రా? బీకిది ఇంకా ఎండనకా వాననకా ఎనుములు మేపతానే వుండాదిరా సామీ. పండి రాలిపోయిన చింతకాయలు, ఎండి మట్టిలో కలిసిపోతా వుండాయి. మేమేరిస్తాములేగాని నువు రా సామీ.  ఎన్ను మీద గువ్వలు, ఏడి మీ నామిని సుబ్బరమన్నెం నాయడని? ఎక్కిరిస్తా వుండాయి. నువ్వు రాయేమిరా మిట్టూరోడా? “మీ ఇండల్లో జరిగే ఇషయాలనే కతలుగా రాయండబ్బాఅని అందరిని తట్టి లేపితివి గదరా సామీ! నువ్వు రాయవేమిరా నామినోడా? యాడ ఎలాంటి కష్టిం పడతన్నావో గదరా సామీ? లేక నీ పెళ్ళాం జెప్పినట్టు ట్రాక్టర్లు కొనేదానికి పెట్టుకున్నావంటరా నా బట్టా? అసలు మాకు తెలీక అడగతా వుండామురామేము కుచ్చుంటే కత లేస్తే కత చెప్పినోడివి కదా, ఇప్పుడు కతలు జెప్పేదానికి నీకు మనిషులే లేరంటరా సామీ? 

పచ్చనాకు సాచ్చిగా చెప్తా వుండామురా దచ్చిన తట్టు నారప్ప కొడకా, ఇంకా ఇక్కడ మేము దుక్కి దున్నేదానికి బూముల్లేక, దూకిచావడానికి బావుల్లేకుండానే వుండామురా. నువ్వు మా కతలు జెప్తావని ఆశగా వుండామురా మిట్టూరోడా. నువు ఇంకా ఇంకా కతలు రాయకపోతే మా యందరి మీద ఒట్టురా నా బట్టా 

ఇట్లు 

నీ నీలావతి, బక్కత్త, బీకత్త, బుధవారపాయన, ఎంకటలచ్మి, పెరుగు సాయిబు, కడుపత్త, రామస్తానంఇంకా ఎందరో…. ఒక్క నీ పెళ్ళాం ప్రెబావతి తప్ప. 

Advertisements
 1. మీ మాటిని ఆ మహన్నభావుడు మల్లా వచ్చే యింగేంగావాల!?

 2. మొగలాయీగా ఉంది మీ ఉత్తరం. నామిని దీన్ని చూస్తాడని ఆశిస్తాను.

 3. చూడకపోతే చూపిద్దాం చదువరి గారూ…

 4. కొద్దిపాటి గ్యాప్ తో ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తాయి నాయూడు గారి ‘కత ‘లు. బాగా అనుకరించారు నువ్వుశెట్టిగారూ..

  శ్రీ రమణ ఇలానే తెలుగు పీపుల్ డాట్ కాం లో అనేక మంది ప్రముఖ రచయిల అనుకరణలు వ్రాశారు. తప్పకుండా చదవతగ్గవి అవి. వీలైతే ఒక్కసారి చూడండి.

  కొత్త రవికిరణ్

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • October 18th, 2007

  చదువరి గారు, రానారె గారూ! అందరూ కోరితే, ఆయన తప్పక మళ్ళీ వ్రాస్తారు అన్న ఆశ వుంది. కాబట్టి మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేస్తే మరి కొన్ని అద్భుతమైన రచనలని మనం చూడచ్చు.
  రవన్నా మీరన్నది అక్షరాలా నిజం. నేనాయన కతలు చదివి రెండేళ్ళవుతుంది. కాని ఆ పాత్రలు, మాటలు, సన్నివేశాలు మనసులో ముద్ర పడిపోయాయి.

 5. ఈ డీమాండుకి నేను కూడా నా గొంతు కలుపుతున్నాను.

  • aswinisri
  • April 25th, 2009

  Longing to see naayudugaaru writing again! I used to follow his pachcha naaku saakshigaa regularly. After reading that i have learnt how to prepare raagi sankati and tasted it.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: