ఎవరు వీరు?

helpinghand_0thumbnail.jpg

పూర్వకాలంలో సిద్ధులు కాళ్ళకు అంజనం పూసుకుని చిటిక వేసినంతలోనే మరో ప్రదేశానికి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించేవారంట. మహర్షులు తమ దివ్యదృష్టితో జరిగిన సంగతీ, జరుగుతున్న సంగతీ మరియు జరగబోయే సంగతులూ తెలిపేవారంట. అయితే ఇవన్నీ “అంట”, “ట” ల తోనే ముగిసిపోతాయి. కాని, నేడు అలాంటి మహర్షులు కూడా మన మధ్య ఉన్నారు. అలాంటి ఓ ముగ్గురి గురించి ఇప్పుడు ప్రస్థావించదలిచాను. గత ఆరు నెలలనుండి ఒక క్లిష్టమైన సమస్య నా కంప్యూటర్లోనూ, మరియు ఆఫీసులో నా బాధ్యతలో భాగమైన ఇతర కంప్యూటర్ లలోనూ ఏర్పడి సవాలు గా నిలిచింది. దీని పరిష్కారంకోసం నేను చేయని ప్రయత్నమంటూ లేదు. గూగులమ్మని అడుగుతూనే ఉన్నాను. అందరూ అలా చేయి, ఇలా చేయి అని మొండి చేయి చూపించిన వాళ్ళే. అలాంటిది ఈ మధ్య ఒక రోజు ఊసుబోక అంతర్జాలంలో ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఒక లింకు దొరికింది. ఏమిటా ఇది? అని తెరచి చూస్తే, అది సాంకేతిక సహాయాన్నందించే ఓ తెలుగు సైట్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. అందులో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులకీ నా సమస్యని క్లుప్తంగా వివరించాను. వివరించిందే తడవుగా రంగంలోకి దూకారు వాళ్ళు. అందులో ఒకరు నన్ను http://www.teamviewer.com/index.aspx నుండి మృదుజాలాన్ని దిగుమతి చేసుకోమని చెప్పి, దాని ద్వారా వారికి వేల మైళ్ళ దూరంలో ఉన్న నా కంప్యూటర్ లోకి దూరి అరగంట కష్టపడి, ఆరు నెలలుగా కొరకరాని కొయ్యగా ఉండిన నా సమస్యని పరిష్కరించేసారు. మరి ఒకరు నేను తెలుగులో నేరుగా వ్రాయటానికి కష్టపడుతున్నానని అర్ధం చేసుకుని http://baraha.com/BarahaIME.htm నుండి మృదుజాలాన్ని దిగుమతి చేయించి మరో ప్రధాన సమస్యని కూడా నిమిషాల్లో తీర్చేసారు.

అయితే అప్పటినుండే నా అసలు సమస్య మొదలైంది. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు నాలాంటి వాళ్ళ సమస్యలను, వారి విలువైన సమయాన్ని వెచ్చించి తీరుస్తున్నారు? దీని వల్ల వాళ్ళకేమైనా లాభం ఉందా? అంటే అదీ లేదు. వాళ్ళని నేనెన్నడూ చూడలేదు, వాళ్ళూ నన్ను చూడలేదు. కనీసం వాళ్ళు నా వివరాలు కూడా అడగలేదు. గంటల తరబడి తమ సమయాన్ని వెచ్చించి ఇతరులకు సహాయం చేస్తూ తద్వారా సమాజానికి తమ చేతనైనంత సేవని అందించాలన్న తపనతో వీళ్ళెంచుకున్న రంగం అతి క్లిష్టమైనది, అది “సాంకేతిక రంగం”. అలనాటి మహర్షులు తమ దివ్యశక్తులను ఎలా ఉపయోగించారో నాకు తెలియదు గాని, వీళ్ళు మాత్రం తమ మేధస్సుని, టెక్నాలజి ని మంచి కార్యాలకోసం వినియోగిస్తున్నారు. తమ జ్ఞానాన్ని నలుగురికి పంచాలన్న అంకితభావం కలిగిన ఈ ముగ్గురు మహానుభావులు మీ అందరికి కూడా చిరపరిచితులే.

వీరు, తెలుగు నేలని “కంప్యూటర్ లిటరసీ స్టేట్” గా మార్చాలన్న లక్ష్యం మరియు ధృఢమైన సంకల్పం కలిగిన కంప్యూటర్ ఎరా ఎడిటర్ నల్లమోతుల శ్రీధర్ గారు, అంతర్జాలంలో మన తెలుగుని సులభంగా వ్రాయటానికి కంకణం కట్టుకుని “లేఖిని” అనే అద్భుతమైన మృదుజాలాన్నీ, “కూడలి” లాంటి అసామాన్యమైన వెబ్ సైట్ లని మనకందించిన వీవెన్ గారు, మరియు తెలుగు బ్లాగంటే చాలు ఎందరికో స్పూర్తినిచ్చి, అందరికీ కొండంత అండగా నిలిచే మరియు కొత్తపాళీ గారి మాటల్లో చెప్పాలంటే “ఐదు బ్లాగుల్ని పంచకళ్యాణి గుర్రాల్లా నడిపిస్తున్న” జ్యోతి గారు. సాంకేతిక సహాయంకోసం వీళ్ళు ఏర్పాటు చేసిన మరియు నేనారోజు వీళ్ళని కలిసిన లింకు http://computerera.koodali.org/.

వీరి నిస్వార్ధ సేవానిరతిని పొగిడి వదిలివేయకుండా, వీరిని స్పూర్తిగా తీసుకుని మనమూ మన తోటి సమాజానికీ, తెలుగు తల్లికీ సేవలందించటానికి ముందుకు అడుగువేయాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాము.

Advertisements
  • kk
  • January 3rd, 2008

  నేటి మన సాంకేతిక మహర్షుల సేవా నిరతికి వందన నీరాజనాలు.అందరితో పంచుకున్నందుకు మీకూ అభినందనలు.

 1. గిరి,, నీది ఏవూరు? ఏవాడ? ప్రభాస్ లా ఉంటావా లేక పద్మనాభంలా ఉంటావా??

  హహహహహ్….

  నీవు, నీ స్నేహితులు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటే ఇంకా సంతోషం..

 2. ఈ అభినవ సాంకేతిక పార్థసారధులకు అభినందనలు

 3. గిరిచంద్ గారూ.. మీ ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు. నిజంగా అందరూ చిత్తశుద్దితో కలిసి రావాలే కానీ చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. ఎంత గొప్ప టెక్నాలజీ మనకు ప్రస్తుతం అందుబాటులో ఉంది? లాభనష్టాల బేరీజు వేసుకోకుండా బద్దకించకుండా మనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్నైనా ఇతరులకు సాయపడడానికి వినియోగిస్తే అసలు మన సమాజం ఎంత ఉన్నత స్థానంలో ఉంటుంది? అదే విజన్ అందరినీ నడిపిస్తోంది.. వీవెన్ గారు, జ్యోతి గారూ, నేనే కాదు.. ఇందులో మీ కృషి, శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, మౌర్య, అభిరామ్, సుధాకర్ గారు, చావా గారు, సిబిరావు గారు, దాట్ల శ్రీనివాసరాజు గారు, వెంకట రమణ, కొత్తపాళీ గారు, ఇలా ప్రతీ ఒక్కరూ ఏమి ఆశించి ఇంత జ్ఞానాన్ని సమాజానికి పంచిపెడుతున్నారు? అలాంటి వాళ్లని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.

  – నల్లమోతు శ్రీధర్

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • January 3rd, 2008

  జ్యోతి గారు, రాజబాబుకీ రజనీకాంత్ కీ మధ్యలో ….

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • January 4th, 2008

  శ్రీధర్ గారు, మీరన్నది అక్షరాలా నిజం. వాళ్ళందరి సహాయ సహకారాలు లేకుంటే ఈ బృహత్కర కార్యం ఇంత ముందుకు వెళ్ళి ఉండేది కాదు. మీరు ఉదహరించిన చిత్తశుద్ధి తో పని చేసే వారి లిస్టు ఇంకా పెరగాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • నక్కా భరత్ కుమార్
  • January 5th, 2008

  గిరి చంద్ గారూ నేను మీ అభిమానిని! చాలా బాగా నడిపిస్తున్నారండీ మీ బ్లాగుని! చాలా బాగా ఉంది !మరి నువ్వుశెట్టి కిషోర్ గారు కూడా రాస్తుంటారా రచనలు ఈ బ్లాగు లో?

  • nakka krishna
  • January 5th, 2008

  ఈ కాంక్రీట్ జనార్ణ్యంలొ కొన్ని పిచ్హి మొక్కలు,ఎవరికీ పనికి రావు.కొన్ని కలుపు మొక్కలు,ఇవి పరాన్న బుక్కులు.ఇంకా కొన్ని విషపు మొక్కలు.నమ్మకంగానే కనిపిస్తాయి.నమ్మితె చంపుతాయి.అయితె చాలా,చాలా మొక్కలు మాత్రం ఆహారాన్ని, ఆవాసల్నే కాక ,తాము ఎండినా మనకు నీడనిస్తాయి.అవి తడిచినా మనల్ని తడవనివ్వవు ,మరి కొన్ని చనిపొయి మనల్ని బ్రతికిస్తాయి . ఇది పకృ తి సహజమేమో.నిస్వార్ద ఇ సేవ కి నమస్సుమాంజిలి.

  నక్కా బ్రదర్స్

 4. My rating for this article.

  ***** 5 Star

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • January 6th, 2008

  నక్కా కృష్ణ గారు, మృదుమధురమైన పదజాలంతో, అద్భుతమైన భావంతో మీరు ఆవిష్కరించిన వ్యాఖ్య అందరినీ అలరించింది, నిస్వార్ధ సేవకులకు ఇది మరింత ప్రోత్సాహాన్నిస్తుందనటంలో సందేహంలేదు. మీ వ్యాఖ్యని ఈ రోజు ఇ-తెలుగు సమావేశాల సందర్భంగా ప్రధాన పుటలో ప్రచురించాము. ధన్యవాదాలు.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • January 6th, 2008

  సి.బి.రావు గారు మీ ప్రోత్సాహానికి నోచుకోవటం మా అదృష్టమే. నిస్వార్ధ సేవకులకు అన్నివిధాలా మరింత మంది సహాయపడాలని కోరుకుందాం.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • January 6th, 2008

  భరత్ గారు. ఎవరు వ్రాసినా పరస్పరం సంప్రదించుకుని ప్రచురిస్తాం. మీకు ధన్యవాదాలు

 5. గిరిచండ్ గారూ, చాలా ఆలస్యంగా మీరు వ్రాసిన ఎవరు వీరు చూశాను. మీలాగా, నాలాగా చాలా మంది మీరుదహరించిన మహోన్నత వ్యక్తులు ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, తెలుగు పై అభిమానం, బ్లాగ్ ల సృష్టి అనే అంశాలపై ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. అందరూ కలిస్తే సాధించలేనిది ఏదీ లేదు అని ఆ మహోన్నత వ్యక్తులు నిరూపిస్తున్నారు. అలాంటి వారి పరిచయం కలగటం నిజంగా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమే. అలాంటి వారి పై ఈ సందేశం మీరు నలుగురికి వ్వటం ఆనంద దాయకం!

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • January 20th, 2008

  అవునండీ ప్రసాదు గారు మీరు అన్నది నిజం.అందరి ప్రశంసలకు వారు నిజం గా అర్హులు.వారికి మరొసారి మీతరుపున కృతజ్ణతలతొ……

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: