తిట్టు కొందాం రండి

images.jpgమన మీద ఎవరన్నా రాళ్ళు విసిరేస్తే చలించకుండా ఆ రాళ్ళతోటే శత్రుదుర్భేధ్యమైన ఓ దుర్గం కట్టుకోమన్నాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఈ మధ్య ఏ పేపరు చూసినా, చానల్ మార్చినా వినిపించేవి మన నాయకులు తిట్టుకునే నీచమైన తిట్లే.

మన ఆదర్శ నాయకుల నోటిలో అలవోకగా నానుతూ, బయటకు వచ్చి ప్రసారం అవుతూ మన ప్రసార మాధ్యమాలన్నీ కంపు కొడుతున్నాయి. సరే వీటన్నింటినీ ఆ తత్వవేత్త చెప్పినట్లు ఓ దుర్గంలా మలచాలంటే ఏంచేయాలనేది ఆలోచిస్తే సరదాగా ఇలా చేయచ్చు అనిపించింది.

1) ముందుగా ఈ తిట్లన్నింటినీ లిస్ట్ అవుట్ చేసి మన పేరు మీద పేటెంట్ తీసుకోవాలి.
2 )మొదట మన దగ్గర అంత డబ్బు ఉండదు కాబట్టి ఒక అద్దె వాహనం పై ప్రజాప్రతినధుల వద్దకు వెళ్ళి మన దగ్గర ఉన్న మొత్తం తిట్ల లిస్టు వాళ్ళకు ఇవ్వటం, దాంట్లో నుంచి వాళ్ళకు కావల్సిన తిట్లని పికప్ చేసి ఇవ్వటం.
3) ప్రతి ప్రెస్ మీట్ ఎవరినన్నా తిట్టటానికే కాబట్టి ప్రెస్ మీట్ స్పెషల్ అని ఓ చిన్న బాక్స్ కలర్ ఫుల్ గా ప్యాక్ చేసి అందులొ తిట్టాల్సిన తిట్లు లిస్టు పెట్టి ప్రెస్ మీట్ కి ఓ అరగంట ముందు ఆ నాయకునికి అందచేయటం.
4 ) ఛోటా మోటా నాయకులకు, వారికి వీలైన టైం లో తిట్లవిలువ, ఎలా తిట్టాలి? ఎప్ఫుడు తిట్టాలి? ఏ తిట్టుని ఎలా తిప్పి కొట్టాలి? ఇలా కొత్త పాత తిట్లు మేలు కలయికలతో కూడిన ఓ డెమో క్లాసు కండక్ట్ చేయాలి.
5 ) నిదానంగా ఆదాయం పెరిగిన తర్వత మెయిన్ బ్రాంచి అసెంబ్లి ఎదురుగా పెట్టాలి. అక్కడక్కడా సబ్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి.
6) తిట్ల డవున్ లోడ్ కు ఆన్ లైన్ ఫెసిలిటి కలగజేయాలి. క్రెడిట్ కార్డ్ ఫెసిలిటి ఇవ్వాలి. క్యాష బ్యాక్ ఆఫర్ కూడా అప్పడప్పుడు ఇస్తుండాలి.
7) ముఖ్యంగా తిట్లుకు బ్రాండ్ నేమ్ వాల్యు పెంచుకోవాలి.
8 )ఎవరన్నా తిట్టినా ఎదురుతిట్లు తిట్టలేక మీనమేషాలు లెక్కపెట్టే వారికి కొంత ఫ్రొత్సాహం ఇవ్వాలి.
ఉదా:-తమిళనాడు నుంచి వచ్చిన హీరొ గారు ఇక్కడి మెగాస్టార్ ని ప్రజాస్వామ్య, వ్వక్తిగత స్వేచ్ఛ పేరుతో అల్లరి చేస్తున్నప్ఫుడు, “అయ్యా మీది తమిళనాడు కదా!అక్కడ సూపర్ స్టార్ కూడా పార్టీ పెడతాడని ప్రచారంలో ఉంది కదా…. మీరు చేరుతారా?” అంటే ఏమి చెబుతాడు? ఇదే విధంగా మాట్లాడుతాడా?

ఇలాంటివి అడగాలని మనం ఇవతల బృందానికి నేర్ఫించగలగాలి.

9) నిదానంగా మన కంపెనీని కార్పొరెట్ స్టాయి కి పెంచి టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాని కనుగుణంగా పనిచేయాలి.
10) పది మందికి మనమూ తిట్ల ద్వారా తిండి పెట్టి సమాజానికి మన వంతు సహాయం మనమూ చేయాలి.

చివరిగా ఓ చిన్న ప్రశ్న,

నేనొక ప్రముఖ నిర్మాతని అనుకుందాం, కొత్త సినిమా తీసే ఊద్దేశ్యంతొ పెట్టిన ప్రెస్ మీట్ లొ మాట్లాడుతున్నాను. అంతలో నన్ను ఓ విలేకరి, “అయ్యా మీరు ఈ హీరొ తో సినిమా తీస్తున్నారు, మరి రాజశేఖర్ గారి తో ఎందుకు తీయరు?” అని అడిగారు.

నా జవాబు : “నేను తీయ్యను.”
విలేఖరి (గుచ్చి గుచ్చి) : “ఎందుకు తియ్యరు?”

నా జవాబు : “ఎందుకంటే ఆయనికి డాన్సు లు రావు, స్వంతంగా డైలాగులు కూడా చెప్పలేడు.”

నేను మాట్లాడింది ప్రజాస్వామ్యమా? రాజశేఖర్ అభిమానులు స్పందిస్తారా!స్పందించరా?

Advertisements
 1. ఆలాగే ఎవరైనా తిట్టుకోవాలనుకుంటె మీదగ్గెర permission తీసుకోవాలని కూడా చెప్పండి. తిట్టు “కొనాలి” ఎందుకంటే వాటిమీద మీకు పేటెంట్ వుంది కదా.

 2. Please correct my blog as
  http://vipula-chatura.blogspot.com/

  • తెలుగు అభిమాని
  • February 7th, 2008

  చివరి ప్రశ్న ఫంటాస్టిక్ గా ఉంది.:-)

 3. మీరు “ప్రజాస్వామ” దేశంలొ మాట్లాడారు. ఆ దేశం మీకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. కాబట్టి మీరు మీ అభిప్రాయాన్ని నిర్భీతిగా వెల్లడించారు.
  అలాగే అభిమానులకు కూడా ఆ దేశ పౌరులు. వారికి కూడా మీకున్న హాక్కులే ఉన్నవి.
  స్పందిచే హృదయం ఉంది కాబట్టీ తప్పకుండా సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన నిర్ణయం తీసుకుని స్పందిస్తారు.

  వారు కూడా తమ, తమ అభిప్రాయాన్న నిర్భయంగా, నిర్భీతితో ప్రకటించుకోవచ్చు.
  అందులో భాగంగా, మీమీద, ఉమ్మి పడేవిధంగా మాటాడవచ్చు. మీకు తెలియని, తిట్లని మీమీద ప్రయోగించవచ్చు. రాళ్ళు విసరవచ్చు. ఏమైనా చేయవచ్చు. కాకపోతే మీరు ప్రసార మాధ్యమాలకి వెంటనే కబురందేలాగా చూడాలి. లేకపోతే రేపు ఇలాంటి ప్రశ్నలు మీరు అడిగినప్పుడు, బ్లాగర్లు “స్పందన” ఉండకపోవచ్చు. ఆలోచించుకోండి!

  • Viju
  • August 6th, 2008

  గిరీ,

  అది ‘విలేఖరి’ అనుకుంటా. ‘విలేకరి’ కాదు.

  Everybody is doing that mistake in Telugu press.
  హైదరాబాదు తెలుగు కదా మరి!

  Pl check.

 4. విజ్జిగా మన్నించు విలేకరిని విలేఖరి చేస్తున్నా ఇప్పుడే. ఈ తప్పు అందరిమీదా రుద్దకు.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: