బ్లాగులందు తెలుగు బ్లాగులు మేలయా?

pothana.jpg

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు –

అంతర్జాలంలో మన తెలుగు నంతా కాపీ చేస్తే ఒక డి.వి.డి కి సరిపోతుంది అని తేల్చేసారు కొత్తపాళీ గారు. ఇంతకన్నా దుర్గతి లేదు. ఒక బ్లాగుకి తోటి బ్లాగరే పాఠకుడయ్యాడని ఆయన ఎంత మొత్తుకున్నా, అంతర్జాలం లో తెలుగో అని వీవెను గారు, జ్యోతి గారు, చావా గారు, నల్లమోతు శ్రీధర్ గారు, రవి వైజాసత్య గారు , చదువరి గారు …. ఇలా అనేకమంది గగ్గోలు పెడుతున్నా కూడా మనం ఇంకా నిద్రపోతూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం బ్లాగర్లు ఏ నెలకో రెండు నెలలకో ఓ వ్యాసమో లేక మరేదో బ్లాగులో పెట్టేసి మరు రెండు రోజుల్లో వచ్చిన హిట్లకీ, వ్యాఖ్యలకీ మురిసిపోయి మళ్ళీ దుప్పటి కప్పుకుని నిద్రపోవటమే. అసలు కూడలి, తేనెగూడు, జల్లెడ వంటి సైట్లే ఏర్పాటు చేసి ఉండకపోతే, ఈ మన బ్లాగులకి ఒక్క హిట్ అయినా వచ్చునా?(మనది తప్ప). ఇంత మంది మహారధులు ఇంత కృషి చేస్తున్నప్పటికీ అంతర్జాలంలో తెలుగు ఇంకా ఆది స్థాయిలోనే ఉంది. అయితే తెలుగు బ్లాగర్ల సమావేశం అనో, తెవికీ అనో ఇలా విడి విడి గా సమావేశాలు జరిపేకన్నా అందరినీ ఒకే త్రాటి మీదకు తేగల ఓ ముఖ్యమైన సమావేశం జరగటం ఎంతైనా అవసరం. దీనికి పైన ఉటంకించిన తెలుగు సారధులు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము. “అన్ని బ్లాగులందు తెలుగు బ్లాగు మేలయా..” అన్నది నిజం కావాలంటే ఎంతో కృషి, దానికి తగ్గ ప్రణాళిక అవసరం. ప్రతి బ్లాగరు హిట్లు, వ్యాఖ్యల కోసం ఎదురుచూసే స్థాయి నుండి బయటపడి భవిష్య ప్రణాళిక గురించి ఒక నిర్ణయానికి రావాల్సిన తరుణం ఆసన్నమైనది. ఇప్పటికన్నా అలసత్వాన్ని వదిలించుకుని, బద్దకాన్ని విదిలించుకుని అంతర్జాలంలో తెలుగు వెలిగే విధంగా మన బ్లాగులలోనూ, తెవికి లోనూ వ్యాసాలు వ్రాసి మన భాష ఘనతిని మైక్రోసాఫ్ట్ వరకు తీసుకు వెళ్ళాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది. మనకు తెలసిన వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉండి ఉంటే, వాళ్ళ కంప్యూటర్ లో ఏదైనా తెలుగు మృదుజాలం స్థాపించి, సులభంగా వాడుకునే విధం చూపించి వారిని ప్రోత్సాహించవలసిన అవసరం ఉంది. విండోస్ లో తెలుగు సులభంగా వ్రాయగలిగేలా అంతర్లీనంగా ఏదైనా ఏర్పాటు చేసే విధంగా మైక్రోసాఫ్ట్ తో సంప్రదింపులు జరిపే దిశగా పావులు కదుపుతున్నారు శ్రీ సాలభంజికల నాగరాజు గారు (కొత్తపాళీ గారి బ్లాగ్వరులకి కొన్ని గమనికలు – చర్చా సారాంశం చూడండి). ఈ వాదనకి బలం చేకూర్చే విధంగా అంతర్జాలంలో తెలుగు వాడకాన్ని పెంచి దాన్నొక అవసరంగా మలచటానికి మనమందరం శాయశక్తులా కృషి చేయాలి. అప్పుడే అంతర్జాలంలో మన తెలుగు నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరి అంతటా తెలుగు వెలుగులు నింపి, దేశ బ్లాగులందు తెలుగు లెస్స అనే స్థితికి చేరుకుంటుంది. లేదంటే…
…నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరె.
-శ్రీశ్రీ

Advertisements
 1. ఈనాడు వంటి సైట్లు తెలుగులో రావాలండి (అంటే యూనీకోడు తెలుగులో)..
  తెలుగు ప్రజలు ఎక్కవగా అంతర్జాలంలో ఏమి కోరుకుంటున్నారు అన్నదాన్ని మనం యూనీకోడు తెలుగులో అందించగలగాలి. అంతేగాని మనం వ్రాసింది వచ్చి వారిని చదవమనడం గొంతెమ్మ కోర్కె అవుతుంది.
  అందరం మనవంతు మనం ఈనాడు వారిని యూనీకోడుకు మారమంటే , వారు మారితే…
  అలా అలా… అక్కడిక్కడ వున్న అంతర్జాల తెలుగు ఒక్క త్రాటిపైకి వస్తుంది.

 2. >> అంతర్జాలంలో మన తెలుగు నంతా కాపీ చేస్తే ఒక డి.వి.డి కి సరిపోతుంది
  డి.వి.డి చాలా ఎక్కువ
  >>ఈ వాదనకి బలం చేకూర్చే విధంగా అంతర్జాలంలో తెలుగు వాడకాన్ని పెంచి
  తెవికీ అందుకు చక్కని వేదిక. వీలైనన్ని ప్రముఖ సైట్లను యూనీకోడీకరిస్తే మన పని సులువౌతుంది

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: