తెలుగు నాయకులూ కాస్త ఇటు చూడండి.

an.jpgనా పాటికి నేను వీధి దీపం క్రింద ఉన్న చెత్తలో ఏవన్నా నాలుగు ఎంగిలాకులు దొరుకుతాయేమోనని వెదుకుతూ ఉండగా, ఒక్కసారిగా పక్కనే ఉన్న మైదానం నుంచి మైకులో మాతెలుగు తల్లికి మల్లెపూవు దండ అంటూ కమ్మగా వినిపించటముతో ఆసక్తి గా అటు వైపు తల తిప్పి చూసాను. అక్కడ ఎదో మీటింగ్ జరుగుతున్నట్లుగా ఉంది. ఇక ఇక్కడ ఏమీ దొరకదని నిశ్ఛయించుకుని మెల్లగా అటువైపు నడిచాను వెతుకులాట ఆపి. అదో తెలుగు భాష ఉద్దరణ సభ. ఎక్కడ చూసినా తెలుగు గురించిన గొప్పదనంతో నిండిన బ్యానర్స్ కనులకింపుగా ఉన్నాయి. వేదిక మీద పెద్ద పెద్ద కుర్చీలలో ఆశీనులైన దిగ్గజాలు. ఏనుగులు, పులులు, సింహాలు ఒకటేమిటి అన్నీ వేదిక మీదే ఉన్నాయి. చూడటానికి కనులకు పండుగ్గా ఉంది. ఓ ప్రక్కన నిలబడి ఆలకించసాగాను. వక్తల ప్రసంగాలు వినసొంపుగా ఉన్నాయి. తెలుగులోనే అందరూ మాట్లాడాలనీ, అన్నిబోర్డులూ తెలుగు లోనే ఉండాలనీ, మమ్మీ డాడీ కల్చర్ పోవాలనీ, అన్నిఆఫీసుల్లో తెలుగును తప్పనిసరిగా వాడాలనీ … ఒకటేమిటి? తెలుగు బాగుపడటానికి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో అవి అన్నీ అమలు చేయాలని పెద్ద పెద్ద నాయకులు ఆవేశంగా మాట్లాడుతుంటే నిజంగా తెలుగు ఇక వెలుగులు విరజిమ్ముతుందనీ, ఇక వీరంతా తెలుగు కోసం తమ శాయశక్తులా పనిచేస్తారనీ , అక్కడ జరిగిన మీడియా కవరేజ్ సాక్షిగా నాకు గట్టిగా అనిపించింది. తృప్తిగా అక్కడినుంచి నెమ్మదిగా బయలుదేరాను. రోడ్డు పక్కన నోటికి దొరికింది తింటూ రాత్రికి కృష్ణకాంత్ పార్క్ లో సేద తీరుదామని నిదానంగా ఆ వైపు నడిచాను. అందులోకి గొర్రెలకు ప్రవేశం ఉందో లేదో మరి. ఎలాగో లోపలకి చేరాను. కాని అక్కడా అదే గోల. కొద్దిసేపటికి మాటలు వినిపించసాగాయి. మెల్లగా కాని స్పస్టంగా …దృఢంగా…మళ్ళీ తెలుగు గురించే….ఎవరా? అని ఓరగా చూశాను. కొన్ని చిట్టిచీమల నేల సమావేశం. కదలకుండా ఆలకించసాగాను ….అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి ఎలా చేయాలి? బ్లాగుల ద్వారా అందరికీ ఎలా దగ్గరవ్వాలి, ఉచితంగా అందరికీ సాంకేతిక సహాయం ఎలా చేయాలి? కూడలి, తేనెగూడు, జాబిల్లి, తెవికి, వికీపిడియా వ్యాసాలు, కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం వంటి వాటి విజయాలు, గమ్యాలు, మార్పులు చేర్పులు , యూనీ కోడులు, ఇలా అన్ని విషయాలమీద … నిస్వార్ధంగా … ఆచరణాత్మకంగా … తర్జన బర్జనలు.

అయ్యా! తెలుగునాయకులూ …ఇకనైనా కాస్త నేలమీద చూడండి. ఇప్పుడు మీరు పాటుపడాల్సింది పుస్తకాలలో తెలుగు ని బతికించడానికి కాదు. భవిష్యత్తు తరాలు పుస్తకాల కన్నా అంతర్జాలం మీదే ఎక్కువ ఆధారపడబోతున్నారు కాబట్టి, LKG బాల బాలికల LAPTOPS లో మన తెలుగు తల్లి ని ఎలా చొప్పించాలా అని? ఆ తల్లి నుడికారపు మమకారాన్నిఆ పసి మనసులకు ఎలా రుచి చూపించాలా? అని తపన పడుతూ దాని కోసం నేల మీద ఆరాటపడే ఈ చిట్టి చీమల నిశ్శబ్ధ యుద్దం గురించి తెలుసుకోండి, వారి పోరాటానికి కాస్త చేయూత నివ్వండి.

Advertisements
 1. పోలిక బాగుంది.

 2. మీ విన్నపం బాగుంది. కాకపోతే laptop ల లోకి తెలుగు చొప్పించే
  ప్రయత్నం చీమలకే వదిలెయ్యడం మంచిదేమో. నెజ్జనులలో, బ్లాగరులలో,
  పిల్లల కోసం తెలుగు గురించి ఆసక్తి ఉన్న వారందరూ
  ఒక జట్టుగా పని చేస్తే బాగుంటుందేమో? కనీసం brainstorming మొదలు పెట్టినా
  బావుంటుందేమో? ఇది మన చేతిలో పనే అని నేననుకుంటున్నాను.

  నేతలకు చెయ్యదల్చుకుంటే ఊపిరి సలపనన్ని పనులు, ఊతగా మనం చెయ్యి కూడా
  అందించలేనటువంటి పనులు బోలెడు ఉంటాయి.

  P.S అక్టోబరులో ఆరంభించిన ఒక ప్రయత్నం నాది ఈ మధ్యే పూర్తి అయ్యింది.
  దీపావళి కథ తార మాటల్లో ఇక్కడ వినవచ్చు.
  http://telugu4kids.com/Documents/Deepavali.wmv
  ప్రస్తుతానికి బొమ్మలు నేనే వేశాను.
  “గోదావరి” విశ్వనాథ్ గారిని సంప్రదించినప్పుడు ఆయన సమయాభావం ఉన్నా
  ఈ కథకు బొమ్మ ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికీ ఆయన కాని
  ఇంకెవరైనా మెరుగ్గా బొమ్మలు గీసి ఇవ్వ గలమనుకుంటే నన్ను తెలుగు4కిడ్స్ ద్వారా
  సంప్రదించగలరు. ఈ website ఇప్పటి వరకూ పూర్తిగా ఉచితంగానే అందించబడుతోంది.
  ఎవరరైనా contribute చేసినా, అనుమతి ఇచ్చినా వారికి credit ఇవ్వడం తప్పని
  సరిగా జరుగుతోంది.

  అలాగే మీ (తోటి బ్లాగరుల) సలహాల మేరకు BookBox వారు మొదటి బావి కథలో నుండి
  “సమురాయి” పదం తీసి వేశారు.
  ఇక్కడ చూడండి. http://bookbox.com/index.php?pid=145lng=Telugu

  • ramakrishna bysani
  • February 12th, 2008

  తెలుగు బ్రహ్మోత్సవాలు నిర్వహించి తెలుగు తల్లిని తిరుపతి వీధుల్లో వారు ఊరేగిస్తే, ఈ చీమలన్నీ కలిసి తెలుగు తల్లిని అంతర్జాల మహావీధుల్లో గజారోహణం చేయిస్తున్నాయి….ఈ తపన,ఆసక్తి ఆరంభసూరత్వం కాకుంటే…తెలుగు కి భవిష్యత్తులో మంచి రోజులు తప్పకుండా వస్తాయి…

 3. బావుంది. కాని ఆ నాయకులు తెలుగు పాట పాడేది ఓట్ల కోసం. వాళ్ళు చెప్పేది వినే మనం బుద్ధిలేనివాళ్ళం. ఐదేళ్ళ కోసారి వాళ్ళు చెప్పే వీర కోతలు నమ్మేస్తాము. మనను ఉద్ధరిస్తారని. ఇక తెలుగును వాళ్ళేంటి ఉద్ధరించేది. వాళ్ళ తెలుగు భాష అంతా ఒకరినొకరు తిట్టుకోవడం లోనే తెలుస్తుంది. ఈ పత్రిక విలేఖరులు కూడా ఆ నాయకుల సభలకే పరిగెత్తుకుంటూ వెళతారు. వాళ్ళ పేపర్ అమ్ముడుపోవాలిగా అలాంటి సంచలన వార్తలతో.

 4. లలితా, దీపావళి కథ బాగుంది. చివర్లో చెప్పిన శ్లోకం కూడా ఆచ్చులో చూపిస్తే బాగుంటూంది.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • February 13th, 2008

  #లలిత గారు దీపావళి కధ చాలా బాగుంది. బొమ్మలూ బాగున్నాయి. కొత్తపాళి గారి సూచనని పాటించితే ఇంకా బాగా ఉంటుంది.
  #కొత్తపాళీ గారు మీకు కొంతైనా నచ్చితే చాలు మాకు కొండంత ఆత్మ విశ్వాసం వచ్చి చేరుతుంది.
  #బైసాని రామకృష్ణ గారు మీ ఆవేదనలో అర్ధం ఉంది. అయితే ఇది ఆరంభ శూరత్వం మాత్రం కాదు. పది పదిహేనేళ్ళ క్రితం ఒక బొట్టు గా మొదలైనది నేడు కనీసం ఓ చెరువులాగైనా మారగలిగింది, నదిలా రూపుదిద్దుకోవాలన్న అందరి ప్రయత్నం సఫలం కావాలంటే మనమందరం తప్పక కృషి చేయవలసిన అవసరం ఉంది. అభివృద్ధి అనేది అంచలంచలు గా జరిగితేనే ఎక్కువకాలం నిలబడుతుంది.
  #జ్యోతి గారు ఒక సారి వాళ్ళని తెచ్చి మీ ముందుంచాలని ఉంది:)

 5. పైసా ఖర్చు కాని/ ఒక్క చెమట బొట్టు కూడా రాలని ప్రయత్నాలు తెలుగుని బ్రతికించజాలవు. ఏ త్యాగాలూ చెయ్యని జాతులు జాతీయతని సంపాదించుకోజాలవు.

  తెలుగుభాష యొక్క అసలు సమస్య వేఱు. అది-తెలుగుకు ఇతరభాషలకున్న చట్టబద్ధమైన రక్షణ పూర్తిగా కొఱవడడం. కనుక మనం ఈ విషయంలో నిజంగా సీరియస్ అయితే, మన ముందున్న కర్తవ్యాలు రెండు.

  1. (ఏ మీడియమైనా సరే) తెలుగు రాష్ట్రంలో ప్రతివాడి చదువులోను తెలుగుని కనీసం పదేళ్ళపాటు ఒక తప్పనిసరి బోధనాంశంగా చేసి నిర్బంధంగా చదివించడం.

  2. తెలుగు రాష్ట్రంలో అన్ని స్థాయిల్లోను ఇంగ్లీషుతో పాటు తెలుగుని కూడా అధికారభాషగా అమలుచెయ్యడం.

  ఎందుకంటే ఇంట గెలవలేని భాష రచ్చ గెలవడం అసంభవం, ఊహాజనితం.

 6. అందరికీ ధన్యవాదాలు.

  శ్లోకం కూడా వీలు చేసుకుని అచ్చులో ఉంచుతాను.

  శ్లోకం ఉంచవచ్చన్న ఆలోచన spontaneousగా మా చిన్న వాడు ఇచ్చాడు.
  అప్పటికీ నేను వాడు చెప్పదల్చుకున్నది సరిగా అర్థం చేసుకోలేదు.
  దీపావళికి నేను “అసతో మా సద్గమయ…” చదివి బ్లాగులో ఉంచాను.
  అది వాడు గుర్తు చేసుకున్నాడు. నాకు ఈ శ్లోకం గుర్తుకు వచ్చి వాడి చేత చెప్పించాను.

  తెలుగు4కిడ్స్ నీ, అంతర్జాలంలో పిల్లల కోసం తెలుగునీ popular చెయ్యడానికి
  నేను ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటాను, మీ అందరి ఆశీస్సులతో, మీ సహకారంతో.

 7. తాడేపల్లిగారు,
  అంత బలవంతంగా తెలుగు చెప్తే వస్తుందా?? ఐనా పసిపిల్లలకు అమ్మా ఆవు బదులు ఆపిల్, బాల్ అని నేర్పిస్తున్న తల్లితండ్రులది తప్పు. స్కూలులో ఎలాగూ ఇంగ్లీషు నేర్పిస్తారు. మరి ఇంట్లో తెలుగులో మాట్లాడటానికేంటంట? మాటలు కూడా సరిగా రాని పిల్లలతో తల్లితండ్రులు కూడా ఇంగ్లీషులోమాట్లాడతారు ఏంటంటే అలా ఐతేనే పిల్లలు ఇంగ్లీషులో బాగా మాట్లాడతారు అంటారు మహాతల్లులు. ఇక స్కూళ్ళలో తెలుగు కష్టంగా ఉందంటే స్పె షల్ ఇంగ్లీషు ఇప్పిస్తున్నారు. పదో తరగతి వరకు బలవంతంగా తెలుగు చదివిన పిల్లలు, సంస్కృతం లేదా ఫ్రెంచ్ తీసుకుంటున్నారు. అదీ ఎక్కువ మార్కుల కోసమే. ఇదంతా తెలుగు వచ్చిన తల్లితండ్రుల ప్రోత్సాహం లేకనే కదా.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: