చైనీయులను తరిమికొట్టిన తెలుగు సైనికులు

“మన దేశానికి అసలు శత్రువు పాకిస్థాన్ కాదు, పొరుగునే ఉన్న మరో పెద్ద దేశం.” అని కొన్నాళ్ళ క్రితం చైనా ని ఉద్దేశించి మన పూర్వ రక్షణమంత్రి శ్రీ జార్జ్ ఫెర్నాండజ్ చెప్పినప్పుడు ఎవరూ దానికి పెద్దగా స్పందించలేదు. అణు బాంబులను నింపుకున్న రెండు అత్యున్నత శ్రేణి సబ్ మెరైన్లు మనకు దగ్గరలోనే సముద్రంలో మొహరించినట్లు ఈ మధ్య శాటిలైట్ చిత్రాలు వెల్లడించటంతో ఉలిక్కిపడింది మన రక్షణ యంత్రాంగం. చైనా అమ్ములపొదిలో ఉన్న అస్త్రశస్త్రాలకీ మన దగ్గర ఉన్న వాటికీ పోలిస్తే మనం ఎంతో వెనుకబడి ఉన్నామన్న సంగతి వెల్లడవుతుంది. మనం నిన్న 3500 km రేంజ్ గల అగ్ని-III ని విజయవంతంగా ప్రయోగించాము. ఇదే మనకి అత్యున్నత రేంజ్. కాని చైనా 1999 లోనే 11,200 km రేంజ్ కలిగిన మిస్సైల్స్ ని ప్రయోగించి, నియోగించింది. సరే అవన్నీ పక్కన బెడితే చాపక్రింద నీరులా మన దేశ యంత్రాంగాన్ని మరో రంగంలో కూడా విజయవంతంగా దొంగ దెబ్బ తీస్తూ ఉంది, అదే సైబర్ అటాక్స్.

IT రంగంలో దిగ్గజాలన్న పేరున్న మనం దీన్ని నిశ్శబ్ధంగా భరించాల్సి వచ్చిన దుర్భర పరిస్థితిలో ఉన్నాం. కనీసం రెండేళ్ళ నుండి దాదాపు ప్రతిరోజూ ఈ సైబర్ అటాక్స్ మన ప్రభుత్వ మరియు ప్రయివేట్ కంప్యూటర్ నెట్ వర్క్ ల మీద సమర్ధవంతంగా దాడి చేస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నత అధికారులు ఇలా అంటున్నారు “ఈ దాడులు ఏవో పిల్ల చేష్టలు కావు. వీటిని సింపుల్ గా “Hackings” అని పిలవలేము. ఇవి ఒక పద్దతి ప్రకారం, కావాలని మన దేశం మీద జరుపుతున్న దాడులు”. వీటివల్ల చైనీయులు భారత నెట్ వర్క్ లను స్కానింగ్ మరియు మ్యాపింగ్ సులభంగా చేయగలుగుతున్నారు. వారు మన సైట్ ల లోని వివరాలతో పాటు, నెట్వర్క్ ని ఎలా డిజేబుల్ చేయవచ్చో కూడా తెలుసుకోగలుగుతున్నారు. కొన్ని నెలల క్రితం NIC (National Informatics Centre), National Security Council, MEA ల మీద కూడా ఇలాగే దాడి జరిగింది. వీటిని ఎదుర్కోవటం సులభమే అని ప్రభుత్వం అంటున్నా, దానికి కావలిసిన టెక్నాలజీని సమకూర్చుకోవటానికి తీసుకోవలసిన చర్యలు మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో అప్రమత్తతతో వ్యవహరిస్తూ డెడికేటెడ్ గా పని చేస్తూ మన ప్రభుత్వ నెట్ వర్క్ లను కాపాడుకుంటూ వస్తున్నారు ఇంతవరకు.

చైనీయులు చేస్తున్న ఈ అటాక్ లు ముఖ్యంగా మూడు రకాలు.

1. BOTS , 2. key loggers, 3. Mapping of Networks.

ఇందులో BOTS ఎంతో ప్రమాదకారి. ఇవి నెట్ వర్క్ లో చేరి నిద్రాణంగా ఉంటాయి. ఒక నిర్ధిష్ట సమయంలో BOTNETS నిద్ర లేచి నెట్ వర్క్ మీద పూర్తి నియంత్రణ సాధిస్తాయి. నిపుణుల అంచనా ప్రకారం చైనీయులు ఈ BOTS టెక్నాలజీలో ఆరితేరి ఉన్నారు. తెలిసిన లెక్కల ప్రకారం ఇలాంటి BOTS దాదాపు 50,000 దాగి ఉన్నాయి మన దేశపు ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్ వర్క్ లలో. వీటన్నింటినీ తొలగించలేక పోతే ఏదో ఒకనాడు దేశం పూర్తిగా షట్ డౌన్ అయ్యే స్థితి తలెత్తుతుంది.

అయితే ఇదంతా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే….

కంప్యూటర్ ఎరా గురించి అందరికీ తెలుసు. నిస్వార్ధంతో తెలుగు వాళ్ళకి కంప్యూటర్ నాలడ్జ్ ని ఉచితంగా మరియు సులభ రీతిలో అందించాలన్న తపనతో శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు కంప్యూటర్ ఎరా అనే ఫోరంని ఏర్పరిచారు. ఇందులో ఇప్పటికి సభ్యుల సంఖ్య 2342, మొత్తం పోస్టుల సంఖ్య 3256. ఫోరం అంటే మామూలు ఫోరం కాదు. స్వలాభాపేక్ష లేని డెడికేటెడ్ సభ్యులు నిరంతరం దాన్ని విజ్ఞాన ఖని గా నింపే పనిలో ఉంటారు. ఇందులో కొన్ని వేల ప్రశ్నలకు తెలుగులో సమాధానాలు దొరుకుతాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇందులో వదిలేస్తే, తెలిసిన వాళ్ళు సమాధానం ఇచ్చే వెసలుబాటు కూడా ఉంది. ఈ ఫోరం కాకుండా, సాంకేతిక సహాయం అనే చాట్ ని కూడా వీవెన్ గారి సహాయంతో మొదలు పెట్టారు. ఇందులో ప్రత్యక్షంగా ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అడగచ్చు, అంకిత భావం కలిగిన అనేక మంది సభ్యులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి పరిష్కారం చూపటానికి తమవంతు కృషి చేస్తారు. సమాధానం అందుకున్న వాళ్ళు కూడా అందులో పాల్గొనటానికి ఎంతో ప్రోత్సహిస్తారు. తెలుగులో వ్రాయటాని ఎంతో ప్రాధాన్యతనిస్తూ వచ్చిన వాళ్ళందరినీ తెలుగులో వ్రాయమని ప్రోత్సహించి దానికి అవసరమైన సహాయం అందిస్తారు…ఎలాంటి లాభాపేక్ష లేకుండా.

అంతటి అమూల్యమైన మన ఈ తెలుగు సైట్ ల మీద ఈ మధ్య ఆ చైనీయులు దాడి చేశారు. నిద్రాణంగా ఉన్న BOTS వళ్ళు విరుచుకుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు వాటిలోని కోడ్ ని డామేజ్ చేసి, దేన్ని క్లిక్ చేసినా అది ఓ చైనా వెబ్ సైట్ కి రిడైరెక్ట్ చేసేట్లు కోడ్ ని మార్చేసింది. అది ఈ పని పూర్తిచేసి ఫోరం మరియు చాట్ లలోని డేటా బేస్ మీద దాడి చేసే లోపు ఇద్దరు సైనికులు తేరుకుని చైనీయులను చుట్టు ముట్టి ఊపిరాడకుండా చేసి అమూల్యమైన డేటాని కాపాడారు. రాత్రి 10.30 కి మొదలైన దాడిని అత్యంత చాక చక్యంతో ఎదుర్కొని సకాలంలో స్పందించి ఆ కుత్సిత బుద్దిగల డ్రాగన్ నుండి అనుక్షణం కాపలా కాసి, కంటి మీద కునుకు రానీయకుండా మరునాడు సాయంత్రానికల్లా పాడయిపోయిన ఫైళ్ళని పునఃనిర్మించి కొన్ని వందల మంది కష్టపడి సేకరించి పొందుపరిచిన డేటాని ఉన్నదున్నట్టుగా మళ్ళీ అందరికీ అందించారు. సమిష్టి కృషి తో చైనీయుల దుర్మార్గాన్ని సకాలంలో అడ్డుకున్న ఆ వీరసైనికులు జీవి (గోపాల్ వీరనాల) గారు మరియు నల్లమోతు శ్రీధర్ గారు. సామాన్యులు సాధించిన ఈ అసామాన్య విజయం డ్రాగన్ ని తోక ముడిచేలా చేసింది.

****ఇంకా అయిపోలేదు … క్రింది లేఖ చదవండి****

చైనా హ్యాకర్లకు జ్యోతక్క లేఖ

అరే దొంగ సచ్చినోడా!..నీకేమి పోయేకాలమొచ్చింది? నీ పిల్లి కళ్ళకు కళ్ళ కలక రాను. మా పని మేము చేసుకుంటుంటే అనవసరంగా వచ్చి హ్యాక్ చేశావ్. ఐనా దానిని మేము చాలా ఫాస్ట్ గా రికవర్ చేసుకున్నాం. ఐనా తెలుగు నీకు ఏమర్ధమవుతుందని హ్యాక్ చేశావు రా? మళ్ళీ గాని ఇలా ప్రయత్నించావంటే, మా దేశం లోని అన్ని భాషల బూతులతోటీ నిన్ను తిట్టేలా చెయ్యగలను. అది అర్ధం కాక మీ గ్రేట్ వాల్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకోవాలి. ఏమనుకున్నావో జాగ్రత్త!!!

Advertisements
 1. మన సైనికులందరికీ హార్ధిక శుభాకాంక్షలు,అభినందనలు

  • sujata
  • May 8th, 2008

  నిజమా ?! చాలా అన్యాయం. జ్యోతక్క పట్టుదల సంగతీ వాళ్ళకు తెలియదు. భారతీయ భాషల సంగతి తో పాటు, మాండరిన్ నేర్చుకునీ మరీ పట్టుకుని వాయించగలరు. కంగ్రాట్స్ టు అవర్ హీరోస్.

 2. ఆపరేషన్ కార్గిల్‍లా, ఆపరేషన్ ’చైనా పోరా’ ని దిగ్విజయం చేసిన వీరులందరికీ ఇదే నా అభినందనలు. నా రాజ్యం లోని పద్దతుల ప్రకారం ఈ ఇద్దరు వీరాధి వీరులను నా సైన్యంలోని అత్యున్నత పదవులు ఇద్దామనే నిర్ణయాన్ని మా మంత్రుల సమక్షంలో సభలో ప్రతి పాదిస్తాం. వీరిరువురికి ఉత్తర దక్షిణ దిశల అధికారులుగా నిర్ణయానికై మేము ఆశిస్తున్నాం.
  ఇట్లు,
  చక్రవర్తి
  ——————————————————– లైట్ తీసుకోండి

  ఏది ఏమైనా, సమర్దంగా ఎదుర్కోనడం అనేది మెచ్చుకో తగ్గ విషయం. అంతే కాకుండా, చైనా వారి కన్నా మనమేం తక్కువ తినలేదని తెలిసేటట్టు తరిమి తరిమి కొట్టిన మీ శ్రమ నిజంగా వెల కట్టలేనిది.

  వీటన్నింటికీ మించి నిస్వార్దంగా ప్రతి ఫలాపేక్ష లేకుండా మీరు చేసే ఈ కార్యక్రమానికి ఇక ముందు ఎటువంటి ఆపదా రాకూడదని ఆశిస్తునాం.

  కుళ్ళు సార్.. చైనా వారికి మనం అంటే కుళ్ళు. పోతార్రారేయ్.. కళ్ళు పోతాయ్.. తాడిని తన్నే వాడుంటే, వాడి తలని తన్నే వాడుంటాడన్నట్లు.. ఎప్పుడో ఒక నాడు.. వస్తాడు.. మిమ్మల్ని మట్టి కరిపించే వాడు … వస్తాడు.. అప్పుడు చెబ్తా మీపని. ఎదో అహింసా పరమోధర్మః అనుకుంటూంటే, లైట్‍గా తీసుకుంటారే.. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని మర్చి పోతున్నారు. ఇక ఆతరువాత మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు.
  Finally, guess that you have learned
  1) How to identify that you have been hacked
  2) How to get rid of these hacking techniques
  3) (probably) the actual code that made us to suffer

  Learning is always good, and i request you to share that knowledge that you gain during this entire fight.

  Thanks,
  Chakravarthy

 3. hey..its wonderful.. My hearty congrats to Sridhar n G.V.. & finally jyotakka too..Really they did a gr8 job..yi potti vedhavala ki, chippa mohala vedhavala ki, okkasarri mana jamdyala gaari telugu titlu vinipiste gaani, maata vinaremoo..hahaha..

  • ravindra
  • May 9th, 2008

  అద్భుత విజయాన్ని సాధించిన మన సైనికులకు అభినందనలు.

 4. ఎప్పుడూ మన పని డిఫెన్సేనా ? అఫెన్సు కూడా ఏమైనా ఉందా ? ఎవడో ఎప్పుడూ మనల్ని ఈడ్చి తన్నడం, మనం కుయ్యో మొఱ్ఱోమని ఏడుస్తూండడం – ఈ అంతులేని కథకు ముగింపెప్పుడు ?

  దీన్ని నేను చైనా యొక్క బలంగా చూడను. వాళ్ళ బలహీనతగానే చూస్తాను. సాఫ్టువేరు రంగంలో మనకు దరిదాపుల్లో కూడా లేని దేశం చైనా. అందుకే మనల్ని ఎలా అధిగమించాలో ఏం చెయ్యాలో అర్హంకాక మన సాలెగూళ్ళ మీద పడ్డారు. ఒకసారి దెబ్బదింటాం. ఒకరోజు దెబ్బదింటాం. ప్రతిసారీ తినం. ప్రతిరోజూ తినం. ఎదుటివాడు కొట్టిన ప్రతిదెబ్బకూ ఇతోధికంగా బలపడుతూ పోవాలి. ఆ నైపుణ్యం మన భారతీయులకు పుష్కలంగా ఉంది.

  వాళ్ళ బలాన్ని ఊరికే అతిగా అంచనా వెయ్యొద్దు. బలవంతులు దొరదెబ్బలే తప్ప దొంగదెబ్బలు తియ్యరు. చైనా ఏ క్షణానైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పేకమేడ. ఆ సంగతి ప్రపంచంలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

 5. తాడేపల్లి గారు,
  బాగా చెప్పారు.

  జ్యోతి గారు,
  బాగా తిట్టారు.

 6. కంప్యూటర్ ఎరా మీద దాడి దురదృష్టకరం. కాపాడిన వీరులకు జేజేలు.
  ఇవాళ ఉదయాన్నే NPRలోనూ చైనా పేట్రియాట్స్ అనే సంఘం వివిధ టిబెట్ సానుభూతిపరుల వెబ్‌సైట్ల మీద చేస్తున్న దాడులని గూర్చి చెబుతుంటే విన్నా. ఇప్పుడేమో ఏకంగా మన తెలుగోడి సైట్ మీద దాడి.

  కానీ నాదో సందేహం! ఇచ్చిన క్లిక్కిన ప్రతి లంకె చైనా సైటుకు వెళుతుందన్న కారణం మీదే దాన్ని చైనీయులు హాక్ చేశారనుకుంటున్నామా లేక చైనీయులు హాక్ చేశారన్న దానికి సాంకేతిక ఆధారాలున్నాయా?

  ఒకవేళ ఆధారాలున్నా గుంపగుత్తగా మొత్తం చైనీయులని తిట్టడం మన నాగరికతకు, సంస్కృతికి విరుద్దమేమొ!

  –ప్రసాద్
  http://blog.charasala.com

  • MouryA PranaY
  • May 9th, 2008

  ఈ విషయాన్ని సవిరంగా చెప్పి మన సైనికుల గొప్పదనాన్ని బ్లాగర్లందరికీ తెలియచేసిన నువ్వుశెట్టి సోదరులకు అభినందనలు

 7. వీర సైనికులకు అభినందనలు.

  ప్రసాద్ పైన గిరిచంద్ చెప్పిన వ్యాసం నాలుగైదురోజుల క్రింద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. వాళ్ళు ఏ ఆధారం లేకుండానే అలా రాసారంటారా? తప్పు చేసినవాడికే తిట్లు తగులుతాయి. తప్పు చేయనివాడు నన్ను కాదు అనుకుంటాడు.

  తాడేపల్లిగారు,
  మీరు చెప్పింది నిజమే.. వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడల్లా ఎదుర్కోవడం తప్ప వేరే చేయలేమా. అనుకుంటే చేయగలరు మన సాంకేతిక నిపుణులు. మన భాషలన్నింటిని వాళ్ళ నెట్ వర్క్ లోకి పంఫిస్తే సరి. వెదవలు చచ్చూరుకుంటారు.

  గిరిచంద్.

  హ్యాట్సాఫ్. మంచి టపా. నిజంగా ఈ వీరులిద్దరి కష్టం చూసినవాళ్ళకే ఇది అర్ధమవుతుంది ఈ వ్యాసం యొక్క విలువ. ఎంత మంది కష్టపడి రాసిన విలువైన సమాచారం తిరిగి రాబట్టుకోవడం అంటే మాటలా?

  ఇక మన బ్లాగులను గురించి కూడా ఆలోచించాలేమో? అసలే ఈ మధ్య వైరస్ లింకులు ఎక్కువయ్యాయి. అందరు జాగ్రత్తగా ఉండండి.

 8. I s this for real?

  hacking జరిగిందని తెలుసింది గానీ ఇంత దారుణమని తెలీదు. శ్రీధర్ , జీవీ బృందానికి అభినందనలు. వెలికి తెచ్చిన నువ్వుశెట్టి సోదరులకి కూడా

 9. రాజేంద్ర గారు, సుజాత గారు, చక్రవర్తిగారు, Dr. Ram$ గారు, రవీంద్ర గారు, జ్యోతి గారు, తాడేపల్లి గారు, ప్రసాద్ గారు, మౌర్య గారు, కొత్తపాళీ గారు మీ అందరికీ ధన్యవాదాలు.

  # చక్రవర్తి గారు! మీ సలహాలు ఎంతో విలువైనవి. ఆచరించదగ్గవి.

  # తాడేపల్లి గారు! నిజమే మీరన్నది. ఇది దొంగదెబ్బే. చైనా కూలిపోవటం నిజమే అయితే , ఎంతో మందిని ముంచే అది మునుగుతుంది. దాని చరిత్ర, స్వభావం అలాంటిది.

  # ప్రసాద్ గారు! తప్పదు. యుద్దమే వస్తే చైనా వాళ్ళు కేవలం మన సైనికుల మీదే బాంబులేస్తారా? అమాయకులూ బలవక తప్పదు, దేశం అన్నతరువాత. చైనాకి మనకి ప్రచ్ఛన్న యుద్దం జరుగుతూఉందన్నది జగమెరిగిన సత్యం. అయితే మనం సంప్రదాయం, సంస్కారం ముసుగులో చేతులు ముడుచుకు కూర్చుంటుంటాం సాధ్యమైనంత వరకు. కాని వాళ్ళు ఒక పరిధి దాటి ఎప్పుడూ మనకి నష్టం కలుగజేయాలనే చూస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ని ఇంకా వాళ్ళు తమదేనంటున్నారు. చైనా స్వభావమే నీచమైనది. దానికి వేరే రుజువులెందుకు?

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: