కాలానికి గాయం చేస్తూ….

కాలానికి గాయం చేస్తూ…
పగలూ, రేయి ఎర్ర చీరలు కడుతున్నాయి.
తెల్లవారు ఝామునే లేచిన కోళ్ళు పచ్చి నెత్తురు తాగమంటున్నాయి.
వద్దు వద్దన్నా మానవత్వపు ఘోరీల మీద మెదళ్ళు మొలుస్తున్నాయి.
రాను రాను మోకాళ్ళూ గోల చేస్తున్నాయి మాకేవి అరికాళ్లని.
నాంజేళ్ళు మొలచిన పారాణి చేతులు రిమోట్లు
నొక్కుతున్నాయి.
అన్నీ తెలిసిన అమాయకపు బాంబులు అద్భుతంగా
పేలుతున్నాయి.
తెగిపడిన కాళ్ళూ చేతులు నేలమీద రక్త కవితలు రాస్తున్నాయి.
అందమైన ఖద్దరు పెదాలు నవ్వుతూ రెండురెళ్ళు ఆరూ అంటున్నాయ్, మనల్ని నమ్మమంటున్నాయ్.
అన్నీ చూస్తూ కాలం పరుగెడుతోంది!
తన రక్త గాయాలు మానే కాలాని కోసం…

(జైపూర్ లో నిన్న (13-05-08 ) జరిగిన దారుణ మారణకాండకు స్పందనగా….)

Advertisements
 1. చాలా బాగుంది. ఈ రక్త శిక్త ప్రపంచం లో శాంతికై వెతుకులాట. రక్త గాయాలు మాంపె కాలం కోసం మీ ప్రయాణం.
  నాంజెళ్లు అంటె ముళ్ల పొదలనా?
  మానవత్వపు గోరీల మీద మెదళ్లు మొలవటం అనె వాక్యం ద్వారా మానవత్వం ఎన్నిసార్లు చచ్చిపోయినా, మళ్ళీ మళ్ళీ ఆలోచనల రూపంలో లేదా కవి రూపంలో చిగురిస్తుందని చెప్పటమేగా? అద్భుతం.

  చాలాబాగుంది.
  బొల్లోజు బాబా

 2. chala bavundandi … evi jaragalo avi jarigipothune vunnai manam matram vatiki sakshluga chusthune vunnam, prathi manishi manavathvam tho alochinche roju vasthundantara

  aruna

 3. sad but beautiful
  నాంజేళ్ళు = ???
  బొమ్మ చాలా బావుంది

 4. చదివితే బాధగానే ఉన్నా కవిత చాల బాగుందండి.నిజంగానే మనిషి మెదడు లోంచి తెల్ల పావురాలు ఎగిరిపోతున్నాయి.

 5. బొల్లోజు బాబా గారు! ధన్యవాదాలు. నాంజేళ్ళు అంటే cactus లో ఒక రకం. బలమైన ముళ్ళు కలిగి, పొడవుగా ఎదిగే వీటిని తోటలకి కంచెలుగా నాటి పెంచేవాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది. కావాలంటే ఇది చూడండి. http://img74.imageshack.us/img74/6269/guiacactus3mw2.jpg

  • kamalaprasadbolloju
  • May 15th, 2008

  చాలా బాగుంది. ము ఖ్యం గా నాంజేళ్ళు మొలిచిన పారాణి చేతులు ప్ర యోగం
  చాలా బాగుంది.
  అసాంఘిక శ క్తు ల అరాచ కాలకి కాలం
  అశ క్త్త తని చ క్కగా వ ర్ణించారు.

  • Ravi Kathi
  • May 15th, 2008

  Chala Baavundanadi, Sri Sri garu Gurthocharu

 6. # ARUNA గారు! ధన్యవాదాలు. మీరు సహృదయంతో కోరుకుంటున్న ఆ రోజు మూడవ ప్రపంచ యుద్దం తరువాతేమైనా వస్తుందేమో? (మనుషులు బతికి బట్ట కడితే) అప్పటి దాకా అయితే ఖచ్చితంగా రాదు.

  # కొత్తపాళీ గారు థ్యాంక్స్. నాంజే్డు మీకు తెలిసే ఉంటుంది. కాక్టస్ లో ఒక రకం. http://img74.imageshack.us/img74/6269/guiacactus3mw2.jpg

  # Venkat గారు! “నిజంగానే మనిషి మెదడు లోంచి తెల్ల పావురాలు ఎగిరిపోతున్నాయి.” అన్న మీ భావం, భాష చాలా బాగున్నాయి. థ్యాంక్స్

  # kamalaprasadbolloju గారు! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఆడా లేదు మగా లేదు ఎవరైనా నీచంగా తయారవటానికి జంకటం లేదు.

  # Ravi Kathi గారు! థ్యాంక్స్. 8)

 7. థ్యాంక్యూ! , ఆ అరికాళ్లను కోరే మోకాళ్లను కళ్లముందుంచారు,
  మార్పు కోసం చూసీ చూసీ కళ్లెరుపెక్కుతున్నాయే తప్ప
  ఆ కటికుల మనసు మారడం లేదు,
  ఇవన్నీ చూస్తుంటే మానవత్వం నేడు మనుషుల లక్షణం కాదేమో అనిపిస్తుంది,
  అయినా మీరన్నట్లు

  అన్నీ చూస్తూ కాలం పరుగెడుతోంది

 8. జీవి గారు! కోట్లకి విలువైన మాట అన్నారు 🙂

 9. కొత్తపాళీ గారు కవితలో కసి వుండాలి అంటే ఏమిటో అనుకున్నాను.కానీ మీ కవిత చదివాకా అర్ధం అయింది.చదువుతుంటే ఎంత ఆవేదన కలుగుతుందో,ఎంత ఆవేశం రగులుతుందో?తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు.

 10. రాధికాగారు, నిజం చెబుతున్నాం. దీనికి కవిత అని పేరు పెట్టే ధైర్యములేక ముందు “మనసులో మాట” గా పోస్ట్ చేశాం. తర్వాత మీ అందరి స్పందన తో ధైర్యము వచ్చింది. ముఖ్యముగా ఎక్కువగా సున్నితమైన మానవ సంబంధాలమీదా మరియు ప్రకృతి మీదా అద్భుతమైన కవితలు వ్రాసే మీరు దీన్ని మెచ్చుకోవటం ఇంకా ఆనందముగా ఉంది. ధన్యవాదాలు.

 11. మొదటి సారి చదివినపుడు నాకీ కవిత పూర్తిగా అర్థం కాలేదు. నాంజేళ్లేమిటో తెలియలేదు. తరువాత మీరు చెప్పాక అర్థమైంది నాంజెళ్లంటే నాగజెముళ్లని. మళ్లీ చదవాలనిపించింది.
  అప్పుడర్థమైంది భావం ఎంత గాఢంగా గూఢంగా ఉందో.

 12. రాఘవ గారు. So nice of you. ధన్యవాదాలు 🙂

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: