సామెత – బ్లామెత


సామెత

“అవసరం తీరిందాకా ఆదినారాయణ, తీరిపోయాక బోడి నారాయణ”

బ్లామెత

వ్యాఖ్య రాసిందాకా బ్లాగు నారాయణ, రాసినతరువాత సోది నారాయణ

*** *** ***

సామెత

“మొదుల్లేదు మొగుడా అంటే, మీసాలకు సంపెంగనూనె అన్నాడంట”

బ్లామెత

హిట్టు లేదు రా మొగడా అంటే, వ్యాఖ్య కి బొమ్మ పెట్టమన్నాడంట

*** *** ***

సామెత

“పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం”

బ్లామెత

హిట్లు బెల్లం, తిట్లు అల్లం

*** *** ***

సామెత

“తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని”

బ్లామెత

బ్లాగు తెరచితిని, పోస్ట్ లు మరచితిని

*** *** ***

సామెత

“తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురునా”

బ్లామెత

అనానిమస్ తిట్లకు బ్లాగర్లు అదురునా

 1. బావున్నాయి బ్లామెతలు.

  మీరు బ్లాగుస్పాటుల్లో కామెంటాలంటే ఓపన్‌ ఐడి తయారు చేసుకోవచ్చు కదా. ఎందుకు మీకు ఇబ్బంది ఎదురవుతోంది? ఈ మధ్య చాలా మంది అనానిమాసురులకు గేట్లు మూసేశారు, గేట్లు తెరుచుంటే మాడరేషన్‌ పెట్టుకున్నారు. మాడ రేషన్‌ పెట్టని చోట ఓపన్‌ ఐడి ఉపయోగ పడదా? ఇబ్బందయితే చెప్పండి.

  — విహారి

 2. విహారి గారు! ధన్యవాదాలు.
  ఇబ్బందేమీ లేదు. బ్లాగుకి వ్యాఖ్య బ్లాగుతోనే ఇస్తే కాస్త తృప్తి కదా. అప్పటికీ కొన్నింటికి మీరు చెప్పినట్లుగానే ఓపెన్ ఐడితో ఇస్తున్నాము. కాని చప్పిడన్నం తిన్నట్టుంది. అయితే ఇది పెద్ద ఇబ్బందేమీ కాదు 🙂

  -నువ్వుశెట్టి బ్రదర్స్

  • suma
  • May 20th, 2008

  very nice idea

  • Viju
  • August 7th, 2008

  అంతా బాగానే ఉంది గాని నా ఫేవరేట్ స్టార్ ని మారఫుడ్ బొమ్మతో చూపించావు

  • Viju
  • August 7th, 2008
 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: