పెద్దలకు మాత్రమే

“బాబాయ్! షాలిమర్లో కొత్త సినిమా వచ్చింది, పోస్టర్ అదిరింది” అని సత్తిగాడు రూములోకి ఎంటరవుతూనే నవ్వతా అనటంతో నోరూరిపోయింది అందరికీ. (పదేళ్ళక్రితం బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు మేము ఒకరినొకరం బాబాయ్ అని పిలుచుకోవటం అలవాటు). బియ్యమేరుతున్న చారిగాడు, లెక్కలేసుకుంటున్న రమణగాడు నేనూ ఒకళ్ళ మొహాలొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నాం. షాలిమర్లో సినిమా అంటే అహ్మదాబాదులో అందరికీ తెలుసు. అందులో ఎక్కువగా పేరెప్పుడూ వినని ఇంగ్లీషు సినిమాలూ… కొన్ని సెలెక్టెడ్ హిందీ సినిమాలు మాత్రమే ఆడేవి. మా రూము నుండి నడిచి వెళితే మహా అయితే పదినిమిషాలు పడుతుంది ఆ సినిమా హాలుకి. “మీరు తినేసి మా రూము వైపు రండి మేమూ ఇంకా వండుకోలా” అనేసి సత్తిగాడు బయట చీకట్లో కలిసిపోయాడు. పుస్తకాలు పక్కన పడేసిన రవణ, నేను చారితో ఇలా అన్నాం “ఒరే ఏదన్నా పనుంటే చెప్పు…తొందరగా అయిపోద్ది గదా” అని. వాడెలాంటి వాడంటే, వాడి జీతాన్ని వేరే ఎవరన్నా తీసుకుని ఖర్చు పెట్టుకున్నా ఊరుకుంటాడేమో గాని, వాడు వంట చేస్తుంటే మాత్రం చచ్చినా వేరొకర్ని వేలు పెట్టనివ్వడు. ఇప్పుడూ అలాగే విసుక్కున్నాడు. “ఏందిబే…అంత తొందర? సినిమా ఏడికిబోద్ది? పదిగంట్ల సినిమాకి గింత జల్దీగెళ్ళి కూసోమంటావా?” అనేసి బియ్యంలో రాయిలా తీసిపారేసేడు. రవణకీ నాకూ ఏమీ తోచలా టైము చూస్తే ఎనిమిది గూడా కాలా. ఇక చారి గాడు వేసే తిరగమూత శబ్ధాలనీ, కుక్కరు విజిళ్ళనీ వింటా ఉండిపోయాము.

రాయలసీమకి చెందిన రవణ మా అందరిలోకీ వయసులోనే కాక పొడవులో కూడా చిన్నవాడు. నూనూగు మీసాలతో, గింగిరాల జుట్టుతో, మెరిసే బుగ్గలతో, నవ్వే కళ్ళతో అమాయకంగా (ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు) ఉండే వాడంటే మాకందరికీ ప్రత్యేకమైన అభిమానం. నువ్వు పిల్లోడివి లేరా అని ఎవరైనా అంటే, ఎంతో ఉక్రోషపడి ఆ వచ్చీరాని మీసాలనే మెలేసేవాడు. రమణ తల్లీదండ్రీ కూలికెళ్ళే వాళ్ళు. తమ్ముడికి పోలియో, అక్క క్షయ వ్యాధితో చనిపోయింది. ఇలా సినిమా కష్టాలతో వేగుతూనే B.Sc. Mathematics ఫస్ట్ క్లాస్ లో పాసైన రవణ ఏ లెక్కనైనా డీప్ గా అనలైజ్ చేసి దాని సూత్రాన్ని లాగి పీకి పాకాన పెట్టేదాకా వదిలిపెట్టడు. నా దృష్టిలో వాడో మేధావి. ఇక చారి తెలంగాణ వాడు. కాలేజి చదువులప్పుడు కార్పెంటరు పని చేసుకుని కష్టపడి చదివి ఒక దారికొచ్చిన వాడు. పొడుగ్గా కాస్త నల్లగా ఉండే వీడు వంటలు చాలా బాగా చేస్తాడు. (నేను కోస్తా వాడిని. మేము ముగ్గురం రూంమేట్స్ భలే ఉంది కదూ)

“వాడు వంటయిపోయిందిరో!” అని కేక పెట్టగానే, గబగబ గిన్నెలన్నీ తెచ్చి ఫాను కింద బెట్టి తినేసరికి తొమ్మిదిన్నరయింది. ఫాంట్లు తొడుక్కుని సత్తిగాడి రూము వైపు వెళ్ళి వాళ్ళనీ కలుపుకుని మొత్తం ఐదుగురుం సినిమా హాలుకి వెళ్ళాం. అక్కడ ఈగలు దోలుకుంటా ఉన్నారు. “ఏందిరా సత్తిగా! పోస్టరు మంచిగున్నదని చెప్పినావుగదబే…గీడేంది చూడబోతే ఎవర్లేరు…మంచిగలేకుంటే డబ్బులు నువ్వే ఇయ్యాల బిడ్డా!” అని బెదరగొట్టాడు చారిగాడు. సినిమా టికెట్లు ఎవరో ఒకరు తెచ్చి, తరువాత తీరిగ్గా ఎంతైందో చెబితే అందరూ డబ్బులు తీసిచ్చేది మాకలవాటు. బాగా హుషారు మీదున్నాడేమో రవణగాడు “నేను తెస్తా టికెట్లు!” అని కేకేసి డిక్లేర్ చేసేడు. సరే “తా” అన్నాం అందరం. అనేసి ఓ పక్కగా కూచుని మాటాడుకుంటా ఉన్నాం. ఇంతలో బిక్కమొహమేసుకుని చేతులూపుకుంటా తిరిగి వచ్చాడు రవణ. వాడిని చూసి అందరం బిత్తరబోయాం. ఈడ చూస్తే మనుషులే లేరు, అప్పుడే టికట్లు అయిపోయాయా అని ఆశ్చర్యబోయాం. “ఏందిరా సంగతి?” అనడిగాం వాడిని ఆత్రంగా. వాడు మా మొహాలవంక చూడటానికి ఇష్టపడక “ఆ నా కొడుకు టికట్లు ఈనన్నాడురా!” అన్నాడు. మాకేం అర్ధంగాలా. “ఈనన్నాడా? ఏందంట ఇంకా టైము గాలేదా ఏంది?” అనడిగాం వాడిని. వాడు “అదేం కాదు…. ఇది ఇంగ్లీషు సినిమా, పెద్దోళ్ళకు మాత్రమే టికట్లిస్తాం, పిలకాయలకీయం అని చెప్పేడు…. నేనుద్యోగం జేస్తున్నానురా, నా వయసు పాతికేళ్ళు అని చెప్పినా ఇనలా.” అని డిప్రెస్ అయిపోయాడు. మాకెవరికీ నవ్వాగలా. అయినా వాడు బాధపడతాడని ఒకరి మొహాలొకరం చూసుకోకుండా నవ్వాపుకుంటా తంటాలు పడతా ఉంటే సత్తిగాడెల్లి టికెట్లు తెచ్చాడు క్కిక్కిక్కీ మని నవ్వతా. ఇక ఆపుకోలేకపోయాం నవ్వులు. “ఈ సినిమాలో ఏముందో నవ్వుకోవటానికి?” అని చుట్టూతా వాళ్ళనుకుంటా ఉన్నా మేము కడుపులు పట్టుకుని నవ్వుకుంటూనే ఉన్నామా రాత్రి. “బియ్యెస్సీ మాథమేటిక్స్ చదివేసి, స్టాఫ్ సెలక్షన్ లో ఉద్యోగం సంపాదించిన నన్ను పట్టుకుని పిల్లోడ్నని, టిక్కట్లివ్వనంటాడా?” అని వాడు గొణగతానే ఉండినాడు సినిమా అంతా.

మిత్రుడు గుడిపాటి వెంకట రమణ (లేటెస్ట్ ఫోటో)

ముగింపు:

ముస్లిం ఏరియా మధ్యలో ఉన్న ఆ సినిమా హాలుకి, ఆ రోజుల్లో ఎంతో అమాయకంగా వెళ్ళే వాళ్ళం. కాని ఆ తరువాత ఆ ఏరియాలో లెక్కలేనన్ని కత్తిపోట్ల సంఘటనలు, హత్యలు, సజీవదహనాలు జరిగాయి. ఈ రోజు ఆ థియేటర్ కి వెళ్ళే ధైర్యం మాలో ఎవరికీ లేదు.

  • towheed
  • May 30th, 2008

  Ha ha haa…what a funny incident….enjoyed

 1. “వాడెలాంటి వాడంటే, వాడి జీతాన్ని వేరే ఎవరన్నా తీసుకుని ఖర్చు పెట్టుకున్నా ఊరుకుంటాడేమో గాని, వాడు వంట చేస్తుంటే మాత్రం చచ్చినా వేరొకర్ని వేలు పెట్టనివ్వడు”

  ఇలాంటోళ్ళు భలే మంచోళ్ళు.

  మీ టపా భలే నవ్వు తెప్పించింది.

  — విహారి

  • pandu
  • May 31st, 2008

  మీ ఫ్రెండ్ సినిమా కష్టాలు నిజంగా బాధనిపించినాయి. మొత్తానికి హాస్యం బాగుంది

   • Anonymous
   • May 9th, 2009

   its too nice

 2. chala baavunMdi, kaani koncham jalesindi mee friend ni taluchukuMTuMTE

 3. చాలా బాగుంది.
  బొల్లోజు బాబా

  • visveswar
  • July 30th, 2008

  ha ha ha. mee anubhavam chalaa baagumdi. bachalor life ante emto haayi kadaa.

  • Viju
  • August 6th, 2008

  గిరినాబట్టా,

  ఎంతో దగ్గరగున్డి, నమ్మబలికి, మనోళ్ళ మీద కథలు రాస్తావా నాబట్టా? ఆళ్ళ బతుకులు రోడ్డు మీద బెదతావా నువ్వు?

  రవణ్ణి జూసి ఎన్ని రోజులయిందో! ఆ బుడ్డోడు ఇంగా అట్టానే ఉన్నాడు. 🙂

  హమ్మ, నిజంగా పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఆ తీపిరోజులు మళ్ళీ రావు. 😦

  • కొత్తపాళీ
  • October 23rd, 2008

  Beautiful narration.

 4. భలే ఉంది! నేనూ అంతే….ఏదైనా త్యాగం చేస్తా గానీ నా వంటలో ఇంకోళ్ళు చెయ్యి పెడితే అరిచి, గీపెట్టి, తిట్టి, కొట్టి, గిచ్చి, కొరికి చంపేసినంత పని చేస్తా!

  • k.narahari
  • June 27th, 2009

  this joke are funny, i think this is sweet momoires for your friends think so.

  • S.Abdullateef
  • July 24th, 2009

  Mee Friendni Chostunte Naku Chaala Badhestondi. Kani Story Baagundi

  • sridhar alahari
  • August 28th, 2009

  story la raasina mee sweet memory chala bagundi.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: