కస్తూరి మృగం-మందిరుడు.

పూర్వకాలం అడవి లో సుగంధ భరిత మైన కస్తూరి మృగాల సంచారం ఎక్కువగా ఉండేది. మందిరుడనే వేటగాడు వాటిని పగలనక రాత్రనక వేటాడి వాటి జాతి వినాశనానికి కారణభూతుడవసాగాడు. ఆ మృగాలన్నీ కలసి ఓ రోజు చర్చించుకుని తమ జాతిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో అదే అడవిలో నివాసముటున్న ఓ తపశ్శక్తి సంపన్నుడైన మునీశ్వరుడిని కలసి తమ వేదనను నివేదించుకున్నాయి. అంతా విన్న ఆ ముని పుంగవుడు సానుకూలంగా స్పందించి మందిరుడుని పిలిపించి తత్వభోదన చేశాడు. కాని ఆ ముని తత్వనీతి మందిరుడి కుహర నీతిముందు నిలబడలేదు. అందుకని ఆ మునివర్యుడు ఇరువైపులా న్యాయాన్యాయాలు పరిశీలించి మందిరుడి కుటుంబానికి ఓ వరం ప్రసాదించాడు. ఆ వరం ప్రకారం మందిరుడు కాని వారి కుటుంబసభ్యులకు గాని రోజుకు ఒక కస్త్తూరి మృగం మాత్రం తప్పక వలలో దొరుకుతుంది. ఆ తరువాత ముని ప్రభావముతో ప్రయత్నించినా దొరకవు. ఇరువర్గాలూ ఆ నిర్ణయానికి సంతసించి అంగీకరించి వెళ్ళిపోయారు. తరువాత రోజు మందిరుడు ఉదయాన్నే లేచి అడవిలోకి వెళ్ళి కస్తూరి మృగాలు ఎక్కువగా సంచారం చేసే ప్రదేశములో తన వల వేసి ఓ చెట్టు చాటునుండి నక్కి చూడసాగాడు. ముని వరం తో వెంటనే ఎక్కడినుండో పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ కస్త్తూరి మృగం వలలో చిక్కింది. ఆనందభరితుడైన మందిరుడు దాన్ని బంధించి ఇంటికి తీసుకుని వెళ్ళి విందారగించాడు. ఇలా ఓ నాలుగైదు రోజులు జరిగాక ఓ రోజు మందిరుడు అడవిలోకి పోను బద్దకించి అడవి మొదట్లోనే వలవేసి దాక్కున్నాడు. ఓ కస్తూరి మృగం అడవిలోనుంచి పరుగెత్తుకొచ్చి వలలో పడింది. మందిరుడు కి పూర్తిగా అర్దమైంది మునిశక్తి. తను ఎక్కడ వలవేసినా తనుకు దక్కాలిసింది దక్కితీరుతుందని. అడవిలోకి వెళ్ళి కష్టపడనవసరం లేదని. తరువాత రోజు తన ఇంటి ముందరే వేశాడు. అయినా వచ్చి పడింది. వండుకుని పండగ చేసుకున్నారు. మరుసటి రోజు బయట వలవేయడం బద్దకమై నట్టింట్లో వలవేసి తమాషా చూడసాగాడు. ముని వరం కదా పరుగెత్తుకుంటూ వచ్చి వలలో పడింది. ఇక ఇలాకాదని తరువాత రోజు ఇంటిమీద వలవేసి చూడసాగాడు. పాపం అక్కడిదాకా పరుగెత్తుకొచ్చిన కస్తూరి మృగం అక్కడ నుంచి అష్ట కష్టాలు పడి ఇల్లెక్కి వలలో పడింది. ఈ సారి మునిని ఎలాగైనా ఓడించాలని తాటి చెట్టు మీద వలవేసి చోద్యం చూడసాగాడు. ఇక్కడా మునే గెలిచాడు. పైకీ క్రిందకి ఎగజారుతూ చెట్టెక్కి వలలో పడింది. ఇక అప్పటి నుండి మందిరుడు ప్రయోగాలు ఆపేసి నేరుగా పొయ్యి మీదే వలవేసి ఆనందించసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఓ రోజు మునీశ్వరుడు తన చివరి దశలో మాట మన్నించిన మందిరుడిని చూచి సంతసించి వచ్చే జన్మలో కూడా తమ బంధం తో పాటు ఈ వర ప్రభావం కూడా ఉంటుందని చెప్పి తనువు చాలించాడు. తరువాత కొద్ది రోజులకే మందిరుడు కూడా మరణించాడు.

మరు జన్మలో మందిరుడు రాజకీయాలలో రాణించి మంత్రయ్యాడు. మంత్రయ్యాక గత జన్మలో మునీశ్వరుడిని గుర్తుపట్టి పలకరింపుగా నవ్వి వరం గురించి గుర్తుచేయబోయాడు. అతను తనకంతా తెలుసునని నవ్వి అభయహస్తం చూపి చేతికి ఓ వల ఇచ్చాడు. గత సృతులు మరచిపోలేని ఆ మంత్రిగారు వర ప్రభావాన్ని పరీక్షింపదలచి మొట్టమొదటి సారిగా రింగు రోడ్డు పైన తన వల వేసాడు. కస్తూరి మృగం కాదు కస్తూరి మృగాలు పడ్దాయి. ఆనందముతో ఈ సారి నీటి మీద పరిక్షించాడు. ప్రాజెక్ట్లు, దాటి వచ్చి జల యజ్ఞంలో పునీతమై వలలో పడ్డాయి. పంటపండింది.ఇలాకాదని ఫ్లై ఓవర్లమీద వేశాడు ఎక్కలేవోనని, అయినా కస్త్తూరి మృగాలు వచ్చి పడ్డాయి. ఇక్కడా అక్కడా అనికాకుండా సెజ్ ల మీద, బాక్సైట్ గనుల మీద, వోక్స్ వాగన్ కార్ల మీద ఇలా అన్నిదగ్గరలా వేసి ఇక పరీక్షకు పరాకాష్టగా వలని ఆకాశంలోకి విసిరివేశాడు చూద్దాం అని. వల పోయి మేఘాల మద్య చిక్కుకుంది. చిత్రం కొద్దిసేపు ఏమీ జరగలేదు తరువాత పైనుంచి జలజలా కస్తూరి మృగాల జల్లులు కురవసాగాయి చల్లగా చలచల్లగా…..అపుడర్ధమైంది మంత్రిగా మారిన మందిరుడికి పైన మేఘమధనానికి కొద్దిసేపు టైమ్ తీసుకుందని, మునీశ్వరుడు మాట తప్పని మనిషని. ఇది అంతా చూస్తున్న రాజుగా మారిన మునీశ్వరుడు చిద్విలాసం గా నవ్వాడు అడగని వారిది పాపం అన్నట్లుగా.

సర్వేజనా సుఖినోభవంతు.

Advertisements
 1. మీకు ఆ మునీశ్వరుడి ఆనుపానులు తెలిస్తే మాకు తెలియచెయ్యండి బాబూ…ఆయన దగ్గర ఒకటి తీసుకోవాలి …

  • రాజేంద్ర కుమార్ దేవరపల్లి
  • October 4th, 2008

  కధగా బాగుంది,conclusion తేలిపోయింది,మరో సారి ముక్తాయింపు ఇవ్వటానికి యత్నించండి.
  అవును చాలా రోజుల తర్వాత,పునఃస్వాగతం.

 2. Vamsi M Maganti గారు, ఆ మునివర్యులు మరెవరో కాదు మన రాజశేఖరుల వారే ప్రస్థుత కాలానికి.

  రాజేంద్ర గారు, మీరు చెప్పిన తరువాత కొద్ది మార్పులు చేశాం ఆఖరులో…ఇంకా మంచి ముక్తాయింపు కష్టంగా ఉంది 🙂 ధన్యవాదాలు.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: