నే బతికే ఉన్నాను….

foot-prints

ఇక్కడ నలభై..
అక్కడ ఒకటి,
చేతికొస్తున్న పంటలు చీడపడుతూ,
మొన్న కిరణ్,
నిన్న అర్పణ
నేడు విశాల్.
మరి నేనెక్కడ?
నాకు నే కనపడుటలేదు.
ఆత్రుతగా వెదికాను గూగుల్ ఏర్తులో,
నేనెక్కడని?
జూము చేసి చూశాను నేనున్నానా ? అని.
అదుగో నా బంగ్లా, అల్లదిగో నా కారు..
మరినేను?
బలుపు నలుపు తుపాకీల గురిలో,
నట్ట నడిరోడ్డులో,కటిక చీకటిలో
ఓంటరిగా…. క్రింద డాలర్లు ఏరుకుంటూ,
నేనున్నాను.
బతికే ఉన్నాను.
అక్కడ నలభై,
ఇక్కడ ఒకటి,
నే బతికే ఉన్నాను….

 1. నువ్వుశెట్టి సోదరులకు బ్లాగు లోక పునరాగమనానికి స్వాగతం. మీదైన శైలిని ప్రదర్శించారు.

 2. super

 3. చాలా రోజుల తరువాత వచ్చి నేను బతికేవున్నాను అని జనాలకి గుర్తుచేస్తున్నారనుకున్నా.బావుంది కవిత.కానీ ఇంతకీ మీరెక్కడ వున్నట్టు.డాలర్లు ఏరుకొంటూ అన్నారు కాబట్టి ప్రవాశంలోనా లేక పత్తి పంటల గురించి చప్పారు కాబట్టి స్వదేశంలో వున్నట్టా?నా మట్టి బుర్రకి అర్ధం కాలేదండి.

  • Kalyani
  • January 22nd, 2009

  Nice peotry

 4. శ్రీధర్ గారు సంతోషం,మీ వ్యాఖ్య ఆనందదాయకం.
  మురళి గారికి మరియు కల్యాణి గారి కి కృతజ్ఞతలు.
  రాధికా గారు,లేదండీ పూర్తిగా పత్తి పంటలలోనే. అచ్చ తెనుగు రాజధానిలో రూపాయలు వెదుక్కుంటూ.
  ప్రవాశీయులని అంటే బాగుండదని నన్ను నేను వెదుకున్నాను. అంతే. కృతజ్ఞతలు.

 5. 🙂

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: