మౌనం మరణిస్తోంది.

indianflag

గాంధి తాత నవ్వుతోటి, నెహ్రూ మామ పువ్వుతోటి
మువ్వన్నెల నేను మునిగి, స్వేచ్చా గీత మాలపించి,
ఎర్రకోట నెగిరాను, ఎదురులేదని వీగాను. ఇది ఆనాటి నా స్దితి.
అరవై ఏళ్ళు గడిచాయి, నా రంగులన్ని వెలిసాయి.
అటు చూస్తే టెర్రరి స్టులు, ఇటుచూస్తే నక్సలైట్లు,
నడుమనేమో నాయకుల ఎగపట్లూ ,సిగపట్లూ,
నాకు తప్పలేదు మరి ఈ నాటికి ఇక్కట్లు. 
ఇది ఈనాటి దుస్థితి.
గత సృతులే గతులుగా, ఉద్యోగమే మత్తుగా నాటినుండి సాగుతుంది నేటివరకు యువతరం.
ఇక నా గోడు వినేదెవరు? కన్నీరు తుడిచేదెవరు?
                    నిజమే తన మూడురంగుల సమర్ధతని మన రాజకీయరంగం ఇంత నిస్సహాయంగా,నగ్నంగా ప్రపంచంముందు నిలబెడితే తనతో పాటు మనమూ ఇలాగే రోదించవలసిందే.గతంలో పార్లమెంటు పైన దాడి జరిగినప్పటి నుంచి చూస్తునే ఉన్నాం, వింటూనే ఉన్నాం మన నాయకమన్యుల, ఉక్కు పాదాల తుప్పు శబ్దాల పనికిరాని ఘోషలు..కాని కంటికి మాత్రం ఏవీ కానరావు. నిజంగా ఓ సారి ఆలోచిద్దాం ఈ నా నాయకులకి మనమెందుకు ఓట్లు వేయాలి. అసలు వీరిగొప్ప ఏమిటి?ఎందులో ఉత్తములు?వీరి జీవిత విలువలేవి?
    ప్రజా సేవలో వీరు నిజంగా కోల్పోయిందెంత? చేసిన త్యాగాలేంటి. వీరిలో చదువుకున్న జ్ఞానులు ఎంతమంది? అజ్ఞానులు ఎంతమంది? వీరిలో ఎవరిని మనం ఎన్నుకుంటున్నాం? వీరుచేసిన ,అభివృద్ది పరచిన రంగాలెన్ని? ఆటలా ,సాంకేతికతా? మన ఆత్మపరిశీలనలో అందలమెక్కే రంగమేది?నిజాని కి శూన్యం. సొంత కష్టం తో ఎవరన్నా పైకి వచ్చి విజయాలు సాధిస్తే ,వారి విజయాల్లో పాలుపంచుకుంటూ వారికి సన్మానాలు చేసి,వారి ఓటు బ్యాంకు అంచనా వేసి దాని ప్రకారం నజరానాలు ప్రకటించి, వారికి ఓ కులమో, రాష్ట్ర్ర ముద్రో వేసి తమ వాడిగా చేసుకోవడం, మీడియాలో మునిగి తేలడం తప్ప ఏముంది.నిజంగా అడుగున పడి ఉన్న ఆణి ముత్యాలలో ఎంతమందికి  చేయూతలిచ్చారు. ఎంతమందిని మన జండాకి ముద్దు బిడ్దలుగా చేశారు. ఓ కోనేరు హంపి తన తండ్రి ద్వారా విజయాలు సాధిస్తే ఓ తెలుగుతేజం అని హెడ్దింగులు, సన్మానాలు. కలసి ఫొటోలు. పేరు తెచ్చుకున్నతరువాత, సెలబ్రిటీలుగా మారిన తరువాత ప్రోత్సహాలు ఇవ్వడం కూడా ఓ గొప్పేనా? సిగ్గుపడాలి.
నిజంగా కొన్ని రంగాలలో ఎదిగామూ అంటే ఈ పరిస్థితులని సమర్ధవంతంగా, ఈ నాయకులని లౌక్యంగా ఎదుర్కుంటూ, తమ ఎదుగుదలతో పాటు, దేశాభివృద్దికి పాటుపడిన టాటాల వల్లో, బిర్లాలవల్లో, ఓ అంబానీ, ఓ ప్రేమ్ జీనో, ఓ సత్యమో(క్షమించాలి తప్పులేదు.) వల్లో తప్పితే ఈ అవనీతి, నీతిలేని నాయకులవల్ల కాదు. ఒక్క ఇస్రోలో మనవాళ్ళు చేతులెందుకు పెట్టలేదంటే అది పూర్తిగా మేధావి వర్గానికి సంభంధించిన రంగం కావడమేనేమో. అక్కడ వేలు పెట్టి తమ అజ్నానాన్ని బయట పెట్టుకుని తిరగడం ఎందుకని మాత్రమే. లేకపోతే ఏ మంత్రి గారో వానా కాలం మేఘ మధనం చేస్తున్నట్లు దానికి కూడా టెండరు వేసి, దాన్ని చంద్రమండలం మీదకు బదులు ఏ హిమాలయాల్లోదింపి , అది హిమాలయాల ఫోటొలు తీస్తే, అవే చందమామ అందాలని సాక్షితో,సాక్ష్యాలతో  నమ్మించివుండేవారు. ధన్యులం.
చంద్రయాన్ విజయవంతమైతే దానిని అందరూ తెలుగోళ్ళే చేసినట్లు మోకాలికి, బోడిగుండుకి ముడిపెడుతూ తెలుగునేలనుంచి పంపించడం మన అదృష్టం అని ఓ పెద్దాయన ఉవాచ. అసలు జాతియ కార్యక్రమానికి తెలుగునేలకి సంభందమేమిటో ఆయనకే తెలియాలి. అంత పెద్ద దేశప్రయోజనాన్ని, ఓ చిన్న ప్రాంతీయ భాషతో ముడిపెట్టి జనం అజ్ఞానంతో ఆడుకుంటూ  తనిచ్చిన ఆ తెలుగుతనం గొప్పేమిటో. నిజానికి ఈ సంగతి ఆయనకూ తెలుసు. దానితోపాటు మన అజ్ఞానమూ ఇంకా బాగా తెలుసు మరి.
                  వెన్నెముకలు లేకుండా వారసత్వపు భజనలు చేస్తున్న ఈ నాయకులు కాదేమో సిగ్గుపడాలిసింది, వారసత్వాన్నే నాయకత్వం గా భావిస్తూ వారి సమర్ధతకు కాకుండా వారి ఆకర్షణకి లొంగి సమయాని కి వారికి కావలిసిన వోట్లు వేస్తూ మీరు కూడా నాయకులే అని వారికి ఆత్మవిస్వాసంతోపాటు సంపాదించుకోడానికి అందలమిచ్చి అణిగిమణిగి ఉంటన్న మనలాంటివారందరూ సిగ్గుపడాలి.
     ఎక్కడోపుట్టి మరెక్కడో పెరిగి ఇక్కడకు వచ్చిన వారిని నాయకురాలుగా చేసిన ఘనమైన నాయకులున్న గతము మనది. ఇప్పుడు ఓ మేధావి బొమ్మని కుర్చిలో ఉంచి ,తన కోటరి తో పరిపాలన సాగిస్తూ నాయకురాలిగా మారి శక్తిమంతమైన మహిళగా నీరాజనాలందుకుంటున్నందుకు తన జన్మభూమితో పాటు మనమూ ధన్యులమే.
నిజానికి తన ఇంటికి రోజుకు ఒకరిని కాపలగా ఉండమన్నా నిస్సిగ్గుగా ఉండి తమ అనుభవాలను ఎన్నికల ప్రచారములో గొప్పగా చెప్పి ఓట్లు అడుక్కొనేవారే మన వారు. మనమూ వారి అదృష్టానికి మురిసిపోయి అదే నాయకత్వంగా భావించి ఎన్నుకుంటాం.  చివరకు వీరు మోయమంటే ఏమన్నా మోయగలరు. అలా మోయలేకే పాపం అపర చాణుక్యుడి ఆత్మ రాజధానిలో సమాధి లేక ఇంకా అలా గాలిలో తిరుగుతుంది.
      మతం మత్తులో పార్లమెంటు కిరీటాన్ని కాలుతోతన్ని ఇంకా సజీవుడై మైనారిటీల ఓట్ల ముసుగు కప్పుకొని అదే పార్లమెంటులో తనమీద జరుగుతున్న తమాషా చూస్తూ ఉరిశిక్ష కు దూరంగా బతుకుతున్న ఓ మత మేధావీ నీకు  నీ తెలివితేటలకు నమస్కారం, ముందుగానే మా నాయకుల ఓట్ల పిచ్చిని అధ్బుతంగా ఊహించి విజయుడు వైనందుకు.
ఓట్లకోసం పోటా లాంటి చట్టాలని లని మింగి ఊగ్రవాదులకి భారత దేశ అమాయక జనాభా నెత్తుటితో ఎర్ర తివాచీలు పరుస్తున్న నాయకులూ మీకూ వందనాలు.
         స్వార్ధం,స్వార్ధం,ప్రతిఖద్దరు చొక్కా ఆలొచనా ఓటరే కాని వ్యక్తి కాదు,అతని హితం కాదు. ఓ మంచి చేసినా చివరకు ఓటు లక్ష్యమే. ప్రతి పధకానికి లోగుట్టులెన్నో. ఆన్నీ తెలియని అమాయకులం.
వీళ్ళందరి స్వార్ధానికి సంస్థలతో పాటు, వ్యవస్థలు, వ్యక్తులు కూడా నిర్విర్యం అయిపోతున్నారు ముష్కరుల దాడులకి అన్యాయంగా బలైపోతున్నారు.         

       మనం నిజంగా వోటు వేయాలనుకుంటే ఇలాంటి నిజమైన మగాళ్ళకేద్దాం ఓ అశ్రునయనంతోనో,  కనీసం ఓ భారమైన నిట్టూర్పుతోనో అంతే కాని ఈ మాటవన్నె పులులకు కాదు. ఈ అవనీతి ఊగ్రరూపాలకి కాదు..

ఓ ప్రియతమా,
ఇప్పటిదాక నా మాట దాటక, కంటి గడప దాటని నిన్ను,
ఒకానొక అసహాయ స్థితిలో, కంటి కొలుకుల నుంచి నా చెక్కిలి మీదకు జార్చాను.
ఇక కొద్ది క్షణాలలొ అదృశ్యం కాబోతున్న ఓ త్యాగమూర్తీ!
స్వార్ధంతో కూడిన మా మౌనాన్ని క్షమించు.

                 చివరగా ముంబై దాడులలో ప్రాణాలు కోల్పోయిన వీర జవానులకు, అమాయక జనాలకు, ప్రాణాలొడ్డి పోరాడిన కమెండోలకు, కదిలిన ప్రతి మంచి మనసుకు  గణతంత్ర దినోత్సవ సందర్భంగా వందనాలు…….అరవై ఏళ్ళు గడిచాయి, మా రంగులన్ని వెలిసాయి.  సర్వే జనా సుఖినోభవంతు.

Advertisements
  1. Bravo.
    Very appropriate on the eve of Republic day.
    ప్రియమిత్రమా, మీరిలా ఇన్నేసి నెల్లు మొహం చాటెయ్యడం ఏవ్హీ బాగోలేదు!! 😦

  2. Nice post.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: