తాబేలు కథ

tot

సబర్మతి ఆశ్రమానికి ఎదురుగా ఉండే చిత్తడి పొలాల్లోనుండి రింగు రోడ్డు దాటుకుని దగ్గరలోనే ఉండే పెద్ద పొలాల్లోకి చేరుకోవటం అంత సులభమేమీ కాదు. అలాగని పెద్ద పనేమీ కాదు.పొలాల్లోనుండి ఎత్తుగా ఉండే రోడ్డుని చేరుకుని వచ్చేపోయే వాహనాలని తప్పించుకోవటం కష్టమే.ಆ రోడ్ దాటిన తరువాత మాత్రం ఇంక అంతా ప్రశాంతమే. ఇక అడిగేవాడే ఉండడు. జీవితాంతం హాయిగా గడపచ్చు. అయితే నా తలరాత ఇంకోలా ఉంది. చెప్తా వినండి.

నా వయస్సు నెలల్లోనే ఉంటుంది. మీ అరచెయ్యంత సైజుంటాను. ఓ రోజు  ముహూర్తం చూసుకుని రోడ్డు దాటదామని నేనుండే ప్రాంతం నుండి బయలు దేరి ఎత్తుగా ఉండే రోడ్ అధిరోహించి మధ్యలోవరకు వచ్చాను. అప్పటికే చాలా తాబేళ్ళు ఆ పొలాల్లోకి చేరుకుని ఉండటంతో నాకు చాలా తొందరగా ఉంది. పైగా ఏ బండి మీదనెక్కుతుందోనని భయం.  నేను చర చరా నడుచుకుంటూ వెళ్తుంటే పాపం ఎవరూ ఎక్కించెయ్యరు. సమస్య ఎక్కడొచ్చిందంటే అది ఓ మధ్యాహ్నం కావటంతో నేను కాకుల కళ్ళల్లో పడ్డాను. అవి నన్ను చుట్టుముట్టి ముక్కులతో నా కాళ్ళు తల పొడవటం ప్రారంభించాయి.కొన్ని గాలిలో ఎగురుతూ అదను కోసం చూస్తున్నాయి.అవి దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను అన్నీ ముడుచుకుని ఊరుకునేదాన్ని.ఎంతైనా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ కదా. ఇలా కొంచెం కొంచెం దూరం దాటుకుని దాదాపు  రోడ్ అంచుకు వచ్చేశాను. ఎదురుగా పొలాలు చెట్లు చూసి నా మనసు ఉప్పొంగిపోయింది. ఇక కొద్ది సేపట్లో లక్ష్యాన్ని చేరుకోబోతున్నాను కదా అనుకుని ఉత్సాహంగా ఉన్నాను. రోడ్ చివరకావటంతో వాహనాలు కూడా రావటంలేదు, కాని ఈ కాకులే చిరాకు పుట్టిస్తున్నాయి. పైగా కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంతలో ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ నన్నే చూస్తున్నాడు.  నేను కాళ్ళు చిప్పలో ముడుచుకుని, తల కాస్త బైట పెట్టి గమనిస్తూన్నాను.ముందు నన్ను ఏదో రాయి అనుకున్నట్టున్నాడు.కాని నన్ను దాటుకుని వెళ్ళిన తరువాత రాయి చుట్టూ కాకులెందుకున్నాయి? అనుకున్నాడేమో బైక్ వెనక్కు తిప్పి నా దగ్గరగా వచ్చాడు. “చచ్చానురా భగవంతుడా!!”  అని నేను అనుకుంటుండగానే కాకుల్ని తరిమేసి నన్ను చేతిలోకి తీసుకున్నాడు. ఎప్పటినుండో నా వంటిని పట్టుకుని రక్తం
తాగుతున్న కొన్ని లక్కపిడతల్ని పీకి పారేశాడు. మంచోడే అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళి నేనెళ్ళాల్సిన పొలాల్లో వదిలేస్తాడని ఆశ కూడా పడ్డాను. కుక్క ఆశ గుండ్రాయి తీర్చినట్టయింది. ఏమనుకున్నాడో ఏమో నన్ను తీసుకుని రోడ్ దాటి  నేనెక్కడినుండి బయలు దేరి వచ్చానో ఆ పొలాల్లోకి తీసుకెళ్ళాడు. నేను మనసులో గిలగిలలాడుతున్నాను. ఆ దరిద్రపు పొలాల్లోకి తీసుకెళ్ళి చివర్లో ఉండే చంద్రభాగ అని పిలవబడే కంపుగొట్టే కాలవ దగ్గరకు తీసుకెళ్ళాడు.చాలా బాగుంది. ఎప్పటినుండో ప్లాన్ చేసుకుని గంటలు గంటలు ప్రయాణించి  నానాతిప్పలు పడి ఇంత దూరం నడిస్తే, తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకొచ్చాడు.తెస్తే తెచ్చాడు ఆ డ్రైనేజ్ నీళ్ళలోగాని వదలడుగదా అనుకునే లోపు ఓ చేత్తో ముక్కు మూసుకుని ఆ నల్లటి నీళల్లో వదిలాడు. నాకు మాత్రం ఊపిరాడుతుందా ఆ నీళ్ళల్లో? నేను చరచరా నడుచుకుంటూ మళ్ళీ బయటకొచ్చేశాను. మళ్ళీ నన్ను చేతిలోకి తీసుకుని మళ్ళీ నీళల్లో వదిలాడు. మళ్ళీ నేను బయటికి.ఇలా మూడు నాలుగు సార్లు చేసి చూసి ఏమీ అర్ధం కాక ఆగిపోయాడు.

ఇంతలో ఒక ఆడ ఒక మొగ వచ్చారు. భార్యాభర్తల్లాగున్నారు. ఉడతలు పట్టుకునే వాళ్లలాగుండే వారి బట్టలూ, చేతిలో గడ్డపార చూసి నా ప్రాణాలు సగం గాలిలో కలిసిపోయాయి. “ఆ తాబేల్ని మాకివ్వవా!” అని అడిగారు. ఇస్తాడేమో అని భయపడ్డాను. వాళ్ళ దురుద్దేశాన్ని గ్రహించాడేమో వాళ్ళకి ఇవ్వనని చెప్పి మళ్ళీ ఆలోచించినట్టున్నాడు. ఇది నీటి తాబేలు కానట్టుంది, దీన్నిక్కడే వదిలేస్తే వాళ్ళు పట్టుకెళ్ళి చంపి తింటారని అర్ధం చేసుకుని నన్ను తీసుకుని మళ్ళీ తన బండి దగ్గరకి తెచ్చాడు.

అమ్మయ్య బతికిపోయాను లేకుండే ఇవాళ పులుసై పోయేదాన్ని ఆ జంట చేతిలో. సరే ఇకనన్నా నన్ను ఆ ఎదురు పొలాల్లో వదిలేస్తాడేమోనని గంపెడాశతో ఉన్న నన్ను తన సంచిలో పెట్టుకుని బైక్ మీద గాంధి ఆశ్రమానికి తీసుకొచ్చాడు.అంటే మరో అరకిలోమీటరు వెనక్కి తీసుకెళ్ళాడు. ఆ ఆశ్రమానికి రావటం నాకిష్టమేగాని, నాకక్కడేమి పని? నాపొలాలు నాకున్నాయి.  అక్కడే పెరిగి పెద్దయి గుడ్లుపెట్టి మా జాతిని పెంచాల. ఇదీ నా లక్ష్యం. సరే ఆశ్రమంలో ఉండే ఆఫీసర్ దగ్గరకి నన్ను తీసుకుని వెళ్ళాడు. “సార్ ఇది పాపం రోడ్ లో దిక్కు లేకుండా ఎండలో పడుంది. పైగా కాకులు చంపేసేట్టున్నాయి. ఇలాంటివాటిని సంరక్షించటానికి మీ ఆశ్రమంలో ఏమైనా ఏర్పాటుందా?” అని అడిగి నన్ను మరీ దిక్కు లేని దాన్ని చేశాడు. ఆ ఆఫీసరు “అలాంటి వ్యవస్థేమీ లేదు కాని, సబర్మతి నదిలో వదిలెయ్యచ్చు కదా” అన్నాడు తాపీగా.
“అబ్బే ఇది నీటి తాబేలు కాదు సర్. నీళ్ళల్లో వదిలితే బయటికి వచ్చేస్తా ఉంది…పోనీ ఈ ఆశ్రమంలో వదిలేస్తాను. ఇక్కడా చెట్లూ పుట్టలూ ఉన్నాయి కదా.” అని పెద్ద జంతు శాస్తజ్ఞుడిలా లా చెప్పాడు. అప్పుడు ఆ ఆఫీసరు “అమ్మో ఇక్కడా!! ఇక్కడ ఆశ్రమం నిండా కుక్కలే. అవి చంపేస్తాయి.” అన్నాడు. అయితే ఎవరైనా జంతు సంరక్షణ సంస్థ ఫోన్ నంబరివ్వండి అని అడిగితే, ఇంటర్నెట్ లో వెతికి ఓ నెంబరిచ్చాడు. వాళ్ళకి ఫోన్ చేస్తే  ” మీరు దాన్ని తీసుకుని వస్తే మేము దాన్ని తీసుకుంటాం కాని మేము మీ దగ్గరకు రాము.” అని చెప్పారు.

అసలు నాగురించి ఏమనుకుంటున్నాడు? నాదారిన నన్ను పోనివ్వక. ఇప్పటికే అరకిలోమీటరు వెనక్కు తెచ్చాడు. అని విసుక్కున్నాను. ఇక లాభం లేదనుకున్నాడు, నన్ను ఆశ్రమం బయటకి తెచ్చి మళ్ళీ బండెక్కించాడు. అమ్మయ్య విసిగిపోయాడు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే వదిలేస్తాడులే అనుకున్నాను. కాని నా ఖర్మ కాలిందని ఇందాకే చెప్పాను కదా.

బండి మీద మరో పది కిలోమీటర్లు ఇంకా  వెనక్కి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? మీరూహించగలరా? జూకి అంటే జైలుకి. బాబోయ్ ఇదెక్కడి పీడరా అనుకునేలోపు. అక్కడి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి నన్ను వాళ్ళ చేతుల్లో పెట్టాడు. ఆ క్షణం లో నాకు రెక్కలుంటే  ఎగిరిపోయేదాన్ని. పరిగెత్తే శక్తి ఉండి ఉంటే ఎలాగైనా గింజుకుని పరిగెత్తి పారిపోయే దాన్ని ఏం చేస్తాం నా టైమ్ బాగలేదు. ఎందుకంటే  జూలోకి తెచ్చినంత సులభం కాదు నన్ను బయటికి తీసుకెళ్ళటం. ఆ సెక్యూరిటీ వాళ్ళతో కలిసి వాళ్ళు నన్ను బోనులో వదిలేంత వరకు ఉన్నాడు. ఆ బోనులో ఇంకా నాలాంటి వాళ్ళు నలభై యాభై మంది ఉన్నారు. నేను నడుస్తూ నడుస్తూ వెనక్కి చూశాను. ఆశ్చర్యంగా.. నన్నక్కడికి తెచ్చిన వ్యక్తి కళ్ళలో ఏదో తప్పు చేసిన భావన. వదల్లేక వెళ్తున్నట్టు వెళ్ళాడు. ఆ… ఎంత బాధపడి ఏం లాభం? నా జీవితం బుగ్గిపాలు చేశాడు స్వేచ్ఛగా తిరిగాల్సిన జీవిని నిమిషాల్లో తలరాత మార్చేశాడు.పెద్ద ఎన్విరాన్మెంటలిస్టనుకున్నాడేమో?

ఇదండీ!కథ.
ఆ రోజు నా వంటి మీదున్న నాలుగు లక్కపిడతల్ని పీకి పారేశాడు కాని ఇక్కడ జూలో మా వంటి నిండా అవే. సరైన తిండి ఉండదు. ఒకరి మీద ఒకరం పాక్కుంటూ తిరగాల ఆ చిన్న స్థలంలో. ఈ బాధలన్నీ నాస్నేహితులకు చెప్పుకునేదాన్ని అప్పుడప్పుడూ. ఓ ఆర్నెల్ల తరువాత అనుకుంటాను ఆ వ్యక్తి మళ్ళీ వచ్చాడు జూకి. నేనుంటున్న బోను దగ్గరకి వచ్చి కమ్ములు పట్టుకుని నిలబడ్డాడు. దాదాపు ఒకటే సైజ్ వి నలభై యాభై ఉండటంతో నాకోసం కాబోలు కళ్ళతో వెతుకుతూ ఉన్నాడు. నేను నా స్నేహితులు నలుగురికి చూపించాను అదుగో అతనే నన్నిక్కడికి తెచ్చింది అని. అవి చిప్పలనుండి తలలెత్తి అతన్ని చూసి నిరసిస్తూ ఉంటే వాటిని ఊరుకోమన్నాను. ఆ వ్యక్తి నీళ్ళు నిండిన కళ్ళతో నిశ్చలంగా నిలబడి మమ్మల్నే చూస్తున్నాడు. ఆ కళ్ళలో పశ్చాప్తాపం చూసి నాకూ కళ్ళు చెమర్చాయి. ఇది మానవత్వమా?

Advertisements
 1. చాలా బాగుంది. భళీ బ్రదర్స్!

  • parimalam
  • March 2nd, 2009

  అదే మానవత్వం .ప్రతీ మనిషిలోనూ ఉంటుంది .కానీ స్పందించటంలో కాస్త వెనకా ,ముందూ అంతే .బావుందండీ .

 2. చక్కటి కథ..!!

 3. manchi katha..

 4. yup .. if only good intentions solved the world’s problems!! pch!!
  అనితర సాధ్యమైన మీ శైలిలో తాబేలుకి గొంతిచ్చారు.
  very nicely done.

 5. నాకిప్పటికీ బాగా గుర్తు, ఆ తాబేలుని జూలో నిస్సహాయంగా వదిలేసేటప్పుడు నేనెంతో బాధపడ్డాను. ఆ తప్పు నన్నిప్పటికీ వెంటాడుతూనే ఉంది. ప్రకృతి ఒడిలో హాయిగా జీవితం గడపాల్సినదాన్ని పెద్ద ఎన్విరాన్మెంటలిస్ట్ లాగా ఫీలయి జూలో వదిలాను. రెండో సారి జూలోకి వెళ్ళినప్పుడు ఆ తాబేళ్ళ గుంపు నుండి నాలుగు ఒకే వయసువి తమ సన్నటి తలలు ఎత్తి నావైపు చూశాయి. ఆహారం కోసమో లేక మనిషి అలికిడికో కావచ్చు. కాని నాకెప్పుడూ ఎలా అనిపించేదంటే అవి ఆ తాబేళ్ళ ఫ్రండ్స్ అన్నట్లు, నన్ను వాటికి చూపించినట్టు అవి నన్ను తిడుతున్నట్లు అనిపించింది. సత్యదూరమైనా, నాకు అలా అనిపించింది. అవే మీతో పంచుకున్నాను.

  • aditya
  • March 4th, 2009

  very good experience. nice narration.

 6. # బాబు గారు ధన్యవాదాలు.
  #పరిమళం గారు బాగుంది మీ స్పందన.
  # మధురవాణి గారు థాంక్స్. కాని ఇది కథ కాదు 🙂
  # బుజ్జి గారు ధాంక్స్. ఇది నా అనుభవం.
  #కొత్తపాళీ గారు. దానికి గొంతివ్వకపోతే అది నా గొంతు నొక్కేసేట్లుంది. ఇది చాలా రోజుల బాధ. దానికి గొంతివ్వమన్నది ఓ ఫ్రండ్ సలహా.
  # ఆదిత్య గారు! ధన్యవాదాలు.
  ఇంకా బ్లాగర్లందరికీ …. థ్యాంక్స్.

  • Kalyani
  • March 7th, 2009

  Nice reaction

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: