కాలమే దేవుడా…..? ఏమో?

question mark

                ఎప్పుడూ అనిపిస్తూఉంటుంది, నిజానికి (కొంతవరకు) కాలమే దేవుడని. ఎందుకంటే  దేవుడు చూడలేని ప్రదేశాలు ఉండవచ్చునేమో కాని, కాలం కాలుపెట్టని ప్రదేశం లేదు. తను స్పర్శించని వస్తువుకాని, తను ప్రయాణించలేని దూరము కాని లేవు. రాయి,రప్ప,నువ్వు, నేను,మంచి చెడు, ఇలా మనల్ని తను పలకరించని క్షణం లేదు. అలాంటి క్షణం ఉంటే మనం లేము. 

నిజానికి రాముడు,కృష్ణుడు,మిగతా దేవుళ్ళు ఎవరైనా సృష్టి చేసిన దేవుళ్ళుకాదు, ఎందుకంటే వాళ్ళకి తల్లి తండ్రులున్నారు, వారికి ముందు కావలిసినంత సృష్టి జరిగింది కాబట్టి వారిని అవతార పురుషులుగానే కీర్తిద్దాం. అలా అయితే మరి అసలు సృష్టి కర్త ఎవరు? ఈ గ్రహాలని, నక్షత్రాలని, అంతులేని పాలపుంతలకి పద్దతులు,నడకలు నేర్పిన ఘనుడెవరు? నేను దేవుడిని, సర్వశక్తి సంపన్నడునని, నేను ఈ సృష్టి చేయాలి అన్న భావన తనకు పుట్టకముందు తనెక్కడ? తనెవరు?  మొట్టమొదటిసారిగా తన శక్తి గురించి తనకు ఎప్పుడు తెలిసింది? ఒకవేళ తనే ఈ సృష్టి ని చేసివుంటే ఎందుకు ఒకేసారి అభివృద్దితో కూడిన సృష్టి చేయలేదు? ఎందుకు ఒకేసారి నాగరికుడిని, అన్నీ తెలిసిన ఆధునిక మానవుడిని ఈ ప్రపంచంలోకి  సృష్టించి వదలలేదు? ఎవరన్నా ఓ మంచి చిత్రకారుడు తన తృప్తి తీరా ఓ బొమ్మ వేసి అది పూర్తయిన తరువాతే ప్రపంచంమీదకి వదులుతారు, మరి మనం తన బొమ్మలమైతే మరి అంచలంచలుగా ఏకకణ జీవులనుంచి ఇన్ని కోట్ల సంవత్సరాలకు ఈ ప్రస్తుత రూపానికి ఎందుకు తీసుకుని వచ్చాడు? ఒకేసారి ఈ రూపం సృష్టించ వచ్చుగదా? వినోదమా? మరి ఈ ప్రస్తుత రూపమైనా పరిపూర్ణమా లేక అసంపూర్ణమా? కొన్ని కోట్ల  సంవత్సరాల తరువాత మనమూ ఆదిమ మానవులమేనా? అప్పటి తరం మైక్రోగా మారి మన గురించి వాళ్ళు ఇళ్ళల్లో ఉండేవారంట, ప్రయాణాలు చేసేవారంట, చేతులతో పనిచేసే వారంట అని చెప్పుకుంటారా?  మనము ప్రస్తుతము అనుకుంటున్నట్లుగా ఆదిమ మానవుడు కూడా తనని తాను ఆధునికమానవుడిగానే పరిగణించుకున్నాడా? ఏమో?

                                          అసలు ఆదినుంచి మనతోపాటు ప్రయాణిస్తూ మన అవసరాలని గమనిస్తూ, పరిస్తితులని దానికి అణుగుణంగా మారుస్తూ, (న్యూటన్ ముందు ఆపిల్ పడేసినట్లు), మనల్ని అభివృద్దితో కూడిన కాలానికి తీసుకపోతున్నదెవరు? తనతోపాటు మనల్నితీసుకుని పోతూ, అన్నీ గమనిస్తూ  కాలమే ఆ భాద్యతలని మోస్తోందా? అయినా కాలం కూడా భూప్రదక్షిణలతోనే మొదలైందికదా? అసలు ఆ భూమి సృష్టి ఎవరిది? ఒకవేళ భూమి తన వేగం తగ్గించుకుని తన చుట్టూ తను తిరగటానికి ఇరవై నాలుగు గంటలు కాకుండా నలభై ఎనిమిది గంటలు తీసుకుంటే మన జీవితకాలం రెట్టింపు అవుతుందా? లేక కాలం అనేది కేవలం ఓ కొలమానమేనా?  తను కాకపోతే ఎవరిది ఆ శక్తి?  హిందూ ధర్మశాస్ర ప్రకారం మనల్ని సృష్టించిన చతుర్ముఖ బ్రంహ్మదా?  అయితే తనను నమ్మని అమెరికా అగ్రరాజ్యం గా ఎందుకుంది? తనని నమ్మే మనమెందుకు వెనుకబడ్డాం?

                            ఏమో? ” అన్నిటి కి కాలమే జవాబు చెప్పాలి” అన్న మాటలలో సత్యం ప్రతి నిత్యం ఋజువు చేసుకుంటూ తన కనుగుణంగా, రహస్యాలని ఒక్కొక్కటిగా విప్పుతూ  పరిస్తితులని మారుస్తూ, శక్తి వంతులమని భ్రమలు కలిపిస్తూ, మనల్ని మనం గమనించలేని విధంగా అందలాలెక్కిస్తూ, మనల్ని గమనిస్తూ, ప్రమాదాలు సృష్టిస్తూ, నల్లమల అడవులలో తోసేస్తూ, తను చేసిన కర్మలలో కాలీ కాలని చితులను గుర్తు తెస్తూ మనతో పాటు ప్రయాణిస్తున్నదెవరు? అసలు మనలను గమనిస్తున్నదెవరు? కాలమా? మరేదైనా? ఏమో కాలమే జవాబుచెప్పాలి. మీరైనా సరే.

 

 1. ఇవన్నీ మనిషిని యుగయుగాలుగా వేధిస్తున్న ప్రశ్నలే, సమాధానం దొరకని ప్రశ్నలే. కాలం తన గుప్పిడని మూసి అందులో ఏముందో చెప్పుకో చూద్దాము అని కవ్విస్తూనే ఉంటుంది. రేపటి రోజున (నిజం చెప్పాలి అంటే రాబోయే క్షణంలో) ఏమవుతామో తెలుసుకోలేని అజ్ఞానులము మరి కాలం గుప్పిటని తెరిచి చూడగలమా? నేనెవరిని, ఈ శరీరంలోకి రాక ముందు నేను ఎక్కడ ఉన్నా, ఈ శరీరం తగలబడిపోయాక ఎక్కడికి వెళ్తా వీటికి సమాధానాలు తెలిసినవారెవరో చెప్పండి. కాలం చేతిలో కీలు బొమ్మలము మనం, ఎవరో రాసిన స్క్రిప్ట్ ని అభినయిస్తున్న తోలు బొమ్మలం మనం. ఏమంటారు?

   • asdf
   • September 10th, 2009

   అసలు ఇలా జీవులతో ఆడుకోవడం వల్ల దేవునికి వచ్చేది ఏమిటి.

 2. వేద శాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టి విధానం… ఇక మనమెంత?

  • durgeswara
  • September 10th, 2009

  అందుకే భగవంతున్ని కాలపురుషుడన్నారు .మహా కాలుడన్నారు .

  • కొత్త రవికిరణ్
  • September 11th, 2009

  కాలం ఎంత చిత్రమైనదో చూశావా? నీతో తనపైన ఒక టపా వ్రాయించుకుని, దానికి నాతో ఒక వ్యాఖ్య చేయించింది, -బుజ్జి

  • rajiv
  • October 1st, 2009

  ravi kiran gari comment chaala baagundi.

  • Ravi kothapalli
  • November 24th, 2014

  hi sir u r good writer

  • Ravi kothapalli
  • November 24th, 2014

  hi sir u r good writer

  • Anonymous
  • November 24th, 2014

  పరబ్రహ్మానికి కాలం అనే మరోపేరుకూడా ఉంది. హిందూమతంలో దైవాన్ని ప్రస్తుతించే విష్ణుసహస్రనామంవంటి అన్ని స్తోత్రాలలోనూ కాలం అనే పేరుకూడా ఉంటుంది. కాలమే దైవం అనికూడా అనొచ్చని మహర్షులు, ద్రష్టలు మన scripturesలో చెప్పారు. మనిషి చనిపోతే కాలధర్మం అని అనటంకూడా తెలిసిందే కదా!

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: