అర్ధరాత్రి స్వతంత్ర్యం…

నిజంగా అంధకారబంధురమే. ఆ సోనియా మహాతల్లి తానొక విక్టోరియా మహారాణి లా ఫీలయిపోయి అర్ధరాత్రి స్వతంత్ర్యం ప్రకటించేసింది. తెల్లతోలు కదా డివైడ్ అండ్ రూల్ బుద్ధి పోనిచ్చుకుందిగాదు. ట్వంటీ ట్వంటీ స్కోర్ లాగా రాజీనామాల లిస్టు పెరిగిపోతుండటంతో గాబోలు పార్లమెంటులో మాత్రం మొహంలో నెత్తుటి చుక్క లేకుండా బిక్కమొహమేసుకుని కనిపించింది. ఆ ఓ.యు యూనివెర్సిటీ విద్యార్ధులు చేసిన గొడవలు, జరిగిన హింసకు, ఎసి గదిలో సెలైన్లు తాగుతూ కె.సి.ఆర్ చేసిన త్యాగానికి ఇంతకన్నా ప్రతిఫలమేముంటుందని రోశయ్య గారి అధిష్టానం భావించి ఆంధ్ర ప్రదేశ్ ని చీకటి దెబ్బ కొట్టింది. ఓ రాష్ట్రన్ని సాధించడం ఇంత సింపులా అని దేశానికంతటికీ ఓ మంచి మెసేజినిచ్చారు ఈ క్వీన్ విక్టోరియా. ఏ ప్రాంతం ఎంతగా అభివృద్ధి చెందిందో ఎవరొచ్చి చూశారు? ఆంధ్రలో మా వూరికి కరంటు వచ్చి రెండేళ్ళు మాత్రమే అయింది. మొన్నటిదాకా తెలంగాణాలోకి బస్సులు నడపాలంటే భయపడిన వాళ్ళు, ఇప్పుడు తెలంగాణా దాటి నడపాలంటే వణుకుతున్నారు. ఇక్కడ నన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వు ఆంధ్రలోకి పోతావా? లేక తెలంగాణాలోకా? ఒకవేళ ఆంధ్ర లోకెళితే మీ రాజధాని ఏమవుతుంది? అని. అవును ఏమవుతుంది? ఒకవేళ కర్నూలుని రాజధానిగా చేస్తే ఆంధ్ర వాళ్ళంతా మళ్ళీ తమ పెట్టుబడులన్నీ తీసుకెళ్ళి కర్నూల్లో పెడతారు. మరో కొన్నాళ్ళ తరువాత ఏ గొట్టం గాడొ సెలైన్లు తాగి, విద్యార్ధులను ప్రేరేపించి మా రాష్ట్రం మాగ్గావాలి అని చెప్పి కర్నూల్ని లాక్కెళ్ళిపోతారు. లేదా ఒకవేళ ఏ విజయవాడో, విశాఖనో కాపిటల్ చేస్తే రాయలసీమోళ్ళంతా అక్కడ పెట్టుబడులు గుమ్మరించి తరవాత ఆంధ్ర సపరేటయిపోతే వాళ్ళ తిరపతికెళ్ళి గుండు గీకిచ్చుకోవాలి.

చావుదప్పి కన్నులొట్టపోయిన చందాన పార్లమెంటు సీటు గెలిచిని చిదంబరం ఢిల్లీ లో చేసిన ప్రకటన,  కందహార్ హైజాక్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తూ గుండె మండిస్తూంది. అందుకే ఏమీ చేయలేక మా ఆఫీసులో ఉన్న ఓ అయిదుగురి తెలుగోళ్ళమి నల్ల బ్యాడ్జీలు తగిలించుకోని గుజరాతోళ్ళకి మా నిరసన తెలిజేస్తున్నామీరోజు.

లింకు “తల్లీ భిక్షాందేహి…”

Advertisements
  • Phani
  • December 11th, 2009

  o.u vidyarthulu ekkada himsa chesaaru ……..himsa cheste okkadu kooda chaavalede mari..

  • Anonymous
  • December 11th, 2009

  anthakannaa emi cheyyagalavule

  • Rajanna
  • December 11th, 2009

  అర్ధ రాత్రి స్వతంత్రం …
  కాంగ్రెస్ , తెలుగు దేశం , ప్రజారాజ్యం పట్టపగలు “మేము తెలంగాణాకు అనుకూలం “అని తీర్మానాలు చేసినప్పుడు, “మేనిఫెస్తోల్లో” బాహాటంగా రాసుకున్నప్పుడు , “ఎన్నికల సభల్లో” ప్రచారాలు , వాగ్దానాలు చేసినప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడలేదు. ఎవరూ ఎందుకు అభ్యంతర పెట్టలేదు.
  తెలంగాణా వచ్చేదా చచ్చేదా అన్న భరోసా వల్లనా ?
  ఏమైనాయి ” జై ఆంద్ర “, “గ్రేటర్ రాయల సీమ” , “ప్రత్యెక కళింగాంధ్ర ” నినాదాలు. అన్ని నాటకాలేనా ?
  ఇంత నయ వంచనా?
  తెలంగాణా అంటే ఇంత చులకనా మీకు?
  మీతో కలసి ఉండలేము మా బతుకు మమ్మల్ని బతకనియ్యంద్రా అంటే ఈ సమైక్య అరుపులు .. దగుల్భాజీ వొన్ సైడ్ కన్నింగ్ లవ్వెంత్రా బాబో !

  • nani
  • December 12th, 2009

  amma sonia asalu nuvvu evaru, andhra vallanu ila endhku edipisthunnav, neeku emaina padavi unda, leka nuvvu emaina king maker va, memu otlu vesi gelipinchi musti M.L.A lu mee da daggara kallu mokkuthunnaru, valla valle nuvvu rajiv gandhi perucheppukuni bathukuthunnav. adi marchipoku, memu taluchukunte inira gandhi ra ninnu kuda road na pada vestham, neeku timekiintha mudda kuda dorakadhu… gurthu pettuko,, chettu peru cheppukunikayalu ammokovoddu. jai andhra…jai jai andhra

  • ram vinayak
  • December 15th, 2009

  అయ్యా రాజన్నా!
  మాకు మీ మీద అంత ప్రేమ కారిపోతుందని అనుకుంటే అది మీ పొరపాటే. మా ఇళ్ళల్లో వాళ్ళనే ప్రేమించడానికి మాకు జీవితాలు సరిపోతున్నాయి ఇక నువ్వెవరు నేనెవరు? ఏదైనా ఉంటే అది తెలుగు వారి ఆత్మ గౌరవం కాపాడాలన్న ఆశ, తెలుగు భాష మీద ఉన్న అభిమానం. ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం విడీపోయి ఉండి ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు ఈ కాంపిటిటివ్ రోజుల్లో మన చుట్టుపక్కల ఉన్న పెద్ద రాష్ట్రాల కన్నింగ్ నెస్ వల్ల విడిపోయామంటే తెలుగువాళ్ళని చెప్పుకింద వేసి తేలుని నలిపినట్టు నలిపేస్తారు. కాస్త విశాల ధ్రుక్ఫధంతో ఆలోచించండి. తెలుగు వాడి గొంతు పెగలదు, పెగిలినా వినేవాడుండడు చివరికి చత్తీస్ఘఢ్, జార్ఖండ్ ల లాగ మన గతి అధోగతి అయి సోదిలోకి కూడా లేకుండా పోతాం.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: