అమ్మ…కోర్ కమిటీ…ఓ సూపర్ కంప్యూటర్.

              అప్పటికే  పీకేసుకున్నజుట్టువంక దిగులుగా చూస్తూ కూర్చున్న అమ్మను చూసి, అమ్మా ఏంటి అ పిచ్చిచూపులు ,ఆ జుట్టు పీక్కోవటాలు, నాకేమీ  అర్ధం కాలా అంటూ అమాయకంగా అడిగాడు ఆ పుత్ర రత్నం. ఉబికి వస్తున్నఏడుపుని దిగమింగుకుంటూ “ఏం చెప్పేదిరా కడుపు చించుకుంటే కాళ్ళమీదపడుతుంది, అయినా ఇదంతా మీ మామయ్య వల్ల వచ్చింది, అర్దరాత్రి ప్రకటన చేసి తను చేతులు దులుపుకున్నాడు, ఇప్పుడది నా తలమీద కొచ్చింది.” అంటూ క్రిందపడి ఉన్న జుట్టు వంక మళ్ళీ దిగులుగా చూసింది. “అవునమ్మా నిజమే తప్పు జరిగింది కాని అసలు తప్పు ఎందుకు జరిగిందో తెలియడంలేదు అన్నాడు.” పుత్ర రత్నం ఏదో ఆలోచిస్తూ.”ఆ… అందరూ మద్దతు పలుకుతాం, మద్దతు పలుకుతాం అంటూ ఉంటే నిజమే అనుకుని పుట్టిన రోజు కానుకగా ఉంటుందని ఇచ్చేశాం. ఇప్పుడది చిరిగి చాటంత అయింది అంటూ నిట్టూర్చింది.” అమ్మ పరిస్తితి చూచి జాలి పడి ఒక్క క్షణం ఆలోచించి, “అమ్మా నువ్వేం బాధ పడకు, అధిష్టానానివి, నువ్వే ఇలా డీలా పడితే ఏలా? నా దగ్గర ఓ సూపర్ కంప్యూటర్ ఉంది దానికి డాటా అంతా ఫీడ్ చేస్తాను, అది ఏమన్నా పరిష్కారం చూపిస్తుందేమో చూద్దాం.” అన్నాడు ఒకింత ఉత్సాహంగా..

“అవునా అయితే అదేదో త్వరగా చూడు , ఈ సారి అర్ద రాత్రి కాకుండా  ఉదయాన్నే ప్రకటిద్దాం, అని  అంతలోనే వద్దు వద్దు, మన మిత్రపక్షాల సహకరించరు … రేపు ఉదయాన్నే కోర్ కమిటి ముందు మిత్రపక్షాల ముందు ఫీడ్ చెయ్, అప్పుడు అయితే ఎవరూ మనల్ని ఏమీ అనరు లేకపోతే మొట్టికాయలు వేస్తారు.” అంది తల తడుముకుంటూ.

     తెల్లారింది, విషయం బయటకి పొక్కింది అంతా ఉత్కంఠ సూపర్ కంప్యూటర్ ఎవరినీ నొప్పించకుండా ఏమి పరిష్కారం చూపుతుందో అని..మీడియా సూపర్ కంప్యూటర్ని లైవ్ లో చూపించసాగింది. దాని ఎదురుగా చకచకా వంద సంవత్సరాల చరిత్రను ఫీడ్ చేస్తున్న  యువ నాయకుడు.  కోర్ కమిటి లోని వృద్ద నాయకులంతా  ముచ్చటగా చూడ సాగారు తమ భావి నాయకుడి వంక. తను చేస్తున్న పని పూర్తిచేసి అందరి వంకా చూశాడు తన చెరగని చిరునవ్వుతో. ఆందోళన పడవద్దు అని తల్లికి కళ్ళతోనే చెప్పి . . “ఆన్సర్ టు తెలంగాణా ఇష్యూ” అన్న బటన్ సున్నితంగా నొక్కాడు. బయటా,లోపలా అందరిలో ఉత్కంఠ, అంతా నిశ్శబ్దం.

ఆ నిశ్శబ్దాన్ని పారదోలుతూ సూపర్ కంప్యూటర్ లో మొదలైన శబ్దాలు  ప్రాసెస్ జరుగుతున్నట్లుగా…. కొద్ది సెకన్ల తరువాత మానిటర్ మీద ప్రత్యక్షం అయ్యాయి అందమైన అక్షరాలు ముత్యాల్లా “ముందు తెలంగాణా ఇచ్చివేయండి, హైదరా బాద్ తో సహా….” అని.

దాన్ని లైవ్ లో చూచిన తెలంగాణాలో మిన్నంటిన కేరింతలు, రాయలసీమ,కోస్తా ఆంద్రాలలో, ఆగ్రహావేశాలు, హా హా కారాలు.

తలలు పట్టుకున్నారు కోర్ టీం సభ్యులు పరిస్తితి మళ్ళీ మొదటికి వచ్చిందని. అంతా నిరాశతో కూడిన నిశ్శబ్దం తల్లి కొడుకులతో సహా.

ఆ నిశ్శబ్దాన్ని పారదోలుతూ సూపర్ కంప్యూటర్ లో మళ్ళీ శబ్దాలు మొదలయ్యాయి.

 మళ్ళీ అందరిలో ఉత్కంట ఈసారి ఏమొస్తుందా!!??? అని ఏమి జరుగుతుందా అని.

కొద్ది సెకన్ల తరువాత మానిటర్ మీద ప్రత్యక్షం అయ్యాయి అందమైన అక్షరాలు ముత్యాల సరాల్లా తెలుగు తల్లి మూడు పాయల జడ గంటల్లా “….తరువాత రాయలసీమ,కోస్తా ఆంద్రాలని పోరాటాల గడ్డ తెలంగాణాలోకలిపివేయండి  “.  ఇక రాష్ట్రం మొత్తం తెలంగాణే, ….నో రాయలసీమ,నో కోస్తా, నో ఆంధ్ర.అంతా తెలంగాణా రాష్ట్రమే. జై తెలంగాణా. కోర్ కమిటీ హా హా కారాలలొ బయటకి ఏమీ వినిపించలేదు.

జై సమైఖ్యాంధ్రా, జై తెలుగుతల్లి.

 

Advertisements
 1. :))

  • virajaaji
  • December 17th, 2009

  fabulous 🙂

 2. 🙂

  • pedaraydu
  • December 17th, 2009

  good idea!

 3. Good idea. 😛 😛 😛

  • rajkumar
  • December 17th, 2009

  adhbhutammm……..ha ha…..

  • Bhai
  • December 17th, 2009

  Master kummessaru andi

 4. ఇదంతా సోనియా ఆడిస్తున్న డ్రామా. రాష్ట్రం లో జగన్ వర్గానికి చెక్ పెట్టడానికి,అందరిని తన కంట్రోల్ లో పెట్టుకోవడానికి ఇలా ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు. పనిలో పనిగా ఇప్పుడిప్పుడే బలపడుతున్న తే.దే.పా. ను చీల్చడానికి పన్నిన ప్లాను ఇది. దీనివల్ల పాపం ప్రజలలో ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు.జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సొంత పార్టీ లో MLAలు ఎంత గోల చేసినా అందరిని అణచివేసిన సోనియా కే.సి.యార్. కు లొంగుతుందా. అయితే ఈ ఎత్తు కు చంద్రబాబు షాక్ తిన్నాడు.పార్టీ వాళ్లు రెండుగా విడిపోతున్నారు.తెలంగాణ పై వెనక్కు తగ్గితే మేము కూడా రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో ఆలస్యంగానైనా తేరుకున్న బాబు కోస్తా,సీమ ఎం.ఎల్.ఎ. లను రాజీనామాలు ఆమోదించాలంటూ స్పీకరుని డిమాండ్ చేయిస్తున్నాడు, తెలంగాణా ఏం.ఎల్.ఎ లను కూడా ఉద్యమాలు చేయాలని చెప్తున్నాడు.ఈ విదంగా ముందుకు పోవడం వల్ల కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ లను డిఫెన్స్ లో పదేయ్యోచ్చునని బాబు గారి ఆలోచన కాబోలు. ఏది ఏమైనా ఏది ఒక సస్పెన్స్ సినిమా క్లైమాక్సు చూస్తున్నట్టుగా ఉంది. మరి ముగిపు ఎలా,ఎప్పుడు ఉండబోతుందో నాకు అర్ధం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

 5. hello hello,

  malli rayalaseema, kosthaa lalo godavalu modalu. memu vallalo kalavadam enti vaallane maalo kalavamanandi ani. (ori devudaa malli modatikosthundi)

  iti telangaanaa vaallu anthe ippatike mammalni chaalaa dochesaaru aa andhra, seema vaallu inka maalo kalisthe memem gaavaale? ani godava

  ee saari juttu peekkune vanthu super computer di, mana kurra, bulli, yuva naayakudideenu.

  • రహంతుల్లా
  • December 17th, 2009

  ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

 6. In truth, immediately i didn’t understand the essence. But after re-reading all at once became clear.

 7. BRILLIANT!!!

  • రవి చంద్ర
  • December 17th, 2009

  what an idea sirjeeee

  • bonagiri
  • December 17th, 2009

  ఐడియా బాగుంది కాని ఇంత గుండ్రంగా తిరిగే బదులు రాష్ట్రం పేరు తెలంగాణా అని మార్చేసి, కె సి ఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన కోరిక తీరుతుంది కదా!

 8. వండర్ ఫుల్ ఐడియా ! ఇంత ఉద్వేగ వాతావరణం లోనూ నవ్వించింది. ధన్యవాదాలు.
  అయితే చివరన జై తెలంగాణా నినాదం కూడా చేర్చాల్సింది
  జై తెలంగాణా !

  • pannaga
  • December 17th, 2009

  ఎవరు వద్దనుకొన్నా లేక కావాలనుకొన్నా, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఒక్కో అడుగు ముందుకు పడుతూ, కార్యాచరణ సాగిపోతూనే ఉంది. ముఖ్యంగా ఈ రోజు పరిణామాలు ఈ విషయాన్ని విశదీకరిస్తున్నాయి. సమైక్యాంధ్ర కోసం కేంద్రం నుండి స్పష్టమైన హామీని తీసుకొస్తామని ఢిల్లీకి బయలుదేరిన J.C. దివాకర రెడ్డి, T.G. వెంకటేశ్, సాయంత్రానికల్లా మొహాలు వేళ్ళాడదీసుకొని, MLAలంతా రాజినామాలు వెనుకకు తీసుకోవాలని, విద్యార్థులు ఉద్యమాలు ఆపేయాలని కోరారు. ప్రక్రియ ప్రారంభమైందని, బిల్లు రాష్ట్రపతి వద్దకు త్వరలో వెళుతుందని, ఆయన దానిని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి పంపిస్తారని వారి మాటల ద్వారా స్పష్టంగా అర్థమయింది. వారు ఆంధ్రా ప్రజలకు ఏం చెప్పుకోవాలో తోచక, ” అధిష్ఠానం ఆ తీర్మానాన్ని ఆత్మప్రబోధానుసారం ఓటు వేసి ఓడించే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆందోళన చెందనక్కర లేదని చెప్పింది.” అని చిలుక పలుకులు పలికారు. కాని వారు అదంతా లాంఛనమేనని తెలియని అమాయకులేం కారు. లోగడ ’మద్రాసు’ రాష్ట్రం నుండి ’ఆంధ్ర’ రాష్ట్రం ఏర్పర్చినప్పుడు, మద్రాసు అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా, పార్లమెంటులో బిల్లు పెట్టి, రాష్ట్రాన్ని ఏర్పర్చిన విషయం ఈ వృద్ధ జంబుకాలకు తెలియనిది కాదు. ఇటీవల ’బీహార్’ నుండి ’జార్ఖండ్’ రాష్ట్రం ఏర్పడింది కూడా ఇలాగేనని మనందరికీ తెలుసు. ఏమీ తెలియక, మోసపోతున్నది ’ఆంధ్రా’ ప్రాంతపు అమాయక ప్రజలే. నాకు బాగా ఆశ్చర్యం కలిగించే విషయం – ఆ ప్రాంతంలో ’యూనివర్సిటీ’ స్థాయి విద్యార్థులకు ఈ మాత్రం అవగాహన, లోకజ్ఞానం లేకపోవడమే.

  • తెలంగాణ పౌరుడు
  • December 19th, 2009

  జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
  ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||
  తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||
  పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
  జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||

  పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
  గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
  కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
  గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్ || జై…||

  జానపదా జనజీవన జావళీలు జాలువార
  కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
  జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
  అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం || జై…||

  సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
  అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
  సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
  సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద || జై…||

  గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
  పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
  సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
  స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి || జై…||

  • తెలుగుపౌరుడు
  • December 21st, 2009

  చూడబోతే మీదీ మంచి తెలుగులాగే ఉంది, ఇంకో రాష్ట్రమెందుకు తెలంగాణా పౌరుడా? క్రిష్ణమ్మ గొదారమ్మల్ని మళ్ళించటానికి ఎవ్వరూ నిరాహార దీక్షలు చెయ్యరేం. నీళ్ళు తప్ప పదవులు రావని కాబోలు.

 9. టపా భీభత్సం! తిరుగులేని పరిష్కారం!

 10. ఈ కంప్యూటరు పరిష్కారం బావుంది! 🙂

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: