ఈగా,ఈగా, నీ పేరేమిటమ్మా?

2014 జనరల్ ఎన్నికల్లో, ఓటెయ్యాలని బయలుదేరిన ఈగ ఓటరు ఉన్నట్లుండి తనెవరో ,తనేమిటో , తన పార్టీ ఏదో, మర్చిపోయి అయోమయంలో పడింది.  తనెవరికి ఓటెయ్యాలో, చివరకు తన పేరు ఏమిటొ మరచిఫోయిందికొద్దిగా ఆలోచిస్తే, తనెవరో తనకు లీలగా తెలుస్తుంది, కాని పూర్తిగా గుర్తుకి రావడములేదు, ఏమిచెయ్యాలో తెలియక ప్రతి పోలింగ్ బూతు తిరిగింది.  ప్రతి జండా మీదా వాలి వాసన చూసింది, అయినా తనెవరో గుర్తుకు రాలేదు.

ఇక దాని వాదన విందాం.

నా వెనుకే చాలా ఈగలు, నేనెక్కడికి పోయినా ఫాలో అవుతున్నాయిదాన్నిబట్టి ఆలోచిస్తే నేనో మామూలు ఓటరీగను కాదనినేనో లీడరీగనని అర్డ్దమయిందికాని నా పార్టీనేనెవరో తెలిసేదెలా? ఎవరిని అడగాలి? వెనకవున్నవారిని ఎవరినన్నా అడిగితే సరి అనుకుంటూ అందరివంకా చూసా, ఎవరూ నమ్మకంగా అనిపించటంలేదు, ఎప్పుడైనా ఎగిరిపోయే ఈగలులాగా అనిపించాయి.

తల విదిలించి పక్కన చేతిలో కాగితాలతో హడావుడి చేస్తున్న పిఏ ఈగ సాయం తీసుకుందామా అనుకునిమళ్ళీ ఇదెప్పుడయినా బయటకు పోయితను, తన పార్టీ పేరే మరచిపోయిందని, తనేం లీడరని, బ్యాడ్ చేసేస్తుందేమోనని భయపడి గమ్ముగయిపోయాను.

ఎలాగైనా ఎవరినీ అడగకుండా నా పేరు ఏమిటో నేనే కనుక్కోవాలని గట్టిగా నిర్ణయించుకుని ఏమిచెయ్యాలా? అని ఆలోచిస్తుంటే కొద్ది దూరములో ఎవరికీ తెలియకుండా ఈగ నావంకే చూస్తూ ఏవో అర్ధం కాని సైగలు చేస్తుందిదాన్ని చూస్తుంటే కొద్దిగా నమ్మకమైనదిగానే ఉందికాని అలా దూరం నుంచి సైగలు ఎందుకు చేస్తుందో తెలియక ఇంకా నా అయోమయం పెరిగిపోయి అటు వైపే చూడడం మానివేసాను.

కనీసం నా వెనుక ఉన్నవారెవరైనా నా పేరుతో కానినా పార్టీ పేరుతో కాని జిందాబాదులు కొడుతారేమోనని చూస్తే, వెధవ ఎలక్షను కోడు వల్ల వారిందరి నోళ్ళు మూతలు పడి మౌనంగా వున్నాయిఇక నా పేరు తెలిసేదెట్లా? ఆంజనేయా! ఇక నీవే నాకు దిక్కు, చుట్టూరూ గొట్టాలెత్తుకుని మీడియావాళ్ళు వచ్చేస్తున్నారు, పోలింగుబూతు వచ్చేస్తుందిఓటువెయ్యాలి, ఏలా నాయనా అనుకుంటుంటే పక్కన్న పిఏ చేతిలో ఫోను మ్రోగింది, తను ముందుగా మాట్లాడి నా చేతి కిచ్చాడు, ఢిల్లి నుంచి మేడంగారు అంటూ,……..ఫొను తీసి నా చెవిదగ్గర పెట్టుకున్నాను  ఏం మట్లాడాలోనని భయపడుతూ .

అటువైపు నుంచి శ్రావ్యమైన గొంతుధన్యవాదాలుచిరంజీవిగారుమీరుమీ ప్రజారాజ్యం పార్టీ మాకు మద్దతిచ్చినందుకు బహుత్ సుక్రియా, మన ప్రయాణం ఇలాగే దీర్ఘకాలం సాగాలి బహుత్ ధన్యవాద్.

అప్పుడర్ధమైంది నాకు నా పేరు చిరంజీవి అని, నా పార్టీ ప్రజారాజ్యమనినేను దానికి అధ్యక్షుడినని, అలా దూరంగావుండి సైగలు చేస్తునంది మా బావమరిది అల్లు అరవిందని.

మనసు మౌనంగా రోదిస్తుంటే ధన్యవాదాలు మాడాం బహుత్ ధన్యవాద్. నాపార్టి పేరు, నాపేరు గుర్తు చేసారు సుక్రియా!  అంటూ   పైకి నవ్వుతూ, జవాబిచ్చాను.

Advertisements
  • dayalan
  • June 6th, 2010

  చాలా బాగా vrasaru,
  keep it up

  • anuradha
  • June 6th, 2010

  Nice

 1. Baagundi

 2. చప్పట్లు!
  ఒక సందేహం.. 2014 దాకా ఆ పార్టీ అసలుంటుందా అని!

  • madhuri krishna
  • June 8th, 2010

  fuunny post

 3. అందరికీ ధన్యవాదాలు.

  • krishna
  • July 13th, 2010

  eega ki gurthu vacchindhemo kani chiranjeevi ki inka gurthu raanatlundhi

  • pious
  • February 28th, 2011

  hai
  i read eega eega.
  its very funny and near to fact.

  • pious
  • March 1st, 2011

  inka eemi guruthu untundhi. sleshmam loe padindhi eega.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: