విభజనతంత్రం

kk

విష్ణుశర్మ తన” పంచతంత్ర “కధల సమాహారంలో భాగముగా చివరిరోజున తన శిష్యులకు, నాయనలార!  మీ తండ్రి సుదర్సన రాజు కోరిక ప్రకారము మీకు ఇప్పటిదాక మిత్రలాభం, మిత్ర భేదం, విగ్రహం, సంధిల గురించి విపులంగా చిన్నచిన్న కధల రూపం లో వివరించాను, ఈ చివరి రోజున అన్నిటిని గుర్తుకుతెస్తూ మీకు మరో కధ…..

పూర్వం తోనియా అనే ఓ సింహం అర్భకుడిగా ఉన్న తన కుమారుడిని  అడివికి ఎలా రాజును చేయ ప్రయత్నించిందో  ఈ తంత్రాలనన్నిటిని ఎలా సమయానుకూలంగా ఉపయోగించుకుని తన ఉత్తరకుమారుడికి రాజబాట  వేయాలని ఎలా ప్రయత్నించిందో  ఈ రోజున మీకు ఓసారి చెబుతాను సావధానంగా వినండి.

దక్షిణ దేశంలో అక్షపతి నే పట్టణంలో వర్ధమానుడు అనే వర్తకుడు ఉండేవాడు, విదేశి వర్తకం చేసి ధనం సంపాదించుకోవాలని తలచి ఓ మంచిరోజున తన పరివారంతో బయలుదేరాడు.  సుదుర్గమనే పర్వతానికి సమీపంలో తోనియా అనే మృగరాణి పరిపాలిస్తున్న అడవి దారిలో వెళుతుండగా ఇంద్రబాబు అనే ఎద్దు బండి లాగలేక కాలుజారి కిందపడిపోయింది.  వర్ధమానుడు దానిపై జాలిపడి దానిని ఆ అడవిలోనే వదిలి తన ప్రయాణాన్ని కొనసాగించాడు.  తన మిత్రుడైన ఇంద్రబాబుని వదలలేక తప్పని సరై వాజశేఖరుడు అనే మరో ఎద్దు చెసేదేమిలేక తన యజమనితో సాగిపోయింది. అలా అడవిలోనే ఉండిపోయిన ఇంద్రబాబు నిదానంగా కోలుకుని, అడవిలో దొరికే పచ్చిక తింటూ, చల్లని నీళ్ళు తాగుతూ, కొద్ది రోజులలోనే బాగా బలిష్టంగా తయారై క్రమంగా ఆ అడవిలో మిగతా జంతువుల మీద పట్టు సంపాదించి ఆ ప్రాంతాన్ని తన కనుసన్నలలో ఉంచుకోగలిగింది.

ఆలా ఓ రోజున బాగా తిని ఇంద్రబాబు ఆనందముతో పెద్దాగా రంకె వేయగా. ఆ రంకె విన్న తోనియా నిర్ఘాంతపోయి తనకన్నా ఎవరో బలశాలి తనమీదకి యుద్దాని కొస్తున్నాడని బ్రమపడి, ఇతని వలన తన కుమారుడు కి రావలసిన జంతు మద్దతు ఆగిపోతుందేమోనని భయపడి తన అనుంగు బంటులైన దిగ్విజయుడు,ఆజాదులనే నక్కలను సంధికి పంపగా కుతంత్రాలలో పండిపోయిన ఆ నక్కలు రెండూ బలిష్టంగా ఉన్న ఇంద్రబాబుని  చూసి భయపడి వచ్చి తోనియాకి విషయం చెప్పాయి.  అంతగా ఆలోచించలేని తోనియా తన ఆప్తుడైన గిహమదు పటేలుడు అనే పావురాన్ని పిలచి సలహా అడుగగా,  విషయము తెలిసిన గిహమదు పటేలుడు, ఇంద్రబాబు ని  ఎదిరించ ఇప్పుడు సాధ్యము కాదని, తనకి ఆ ప్రాంత జంతువుల బలం చాలా వుందని తను అక్కడ నాయకుడిగా మారి దేశ విదేశాలలో అందరి మన్ననలు పొందుతున్నాడని, తనతో ఇప్పుడు శత్రుత్వము వద్దని అయినా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, నిదానంగా తనకి సరైన నాయకుడిని అక్కడకు పంపి  పోటీ నాయకుడిని తయారు చేయడమె అసలైన రాజనీతంటూ నచ్చచెప్పగా, రాజతంత్రంలో భాగంగా చేసేదేమిలేక ఇంద్రబాబుని ఆ ప్రాంత మంత్రిగా గుర్తించింది తోనియా.

తోనియాకి నచ్చచెప్పి తీవ్రంగా ఆలోచించిన గిహమదు పటేలుడు ఇంద్రబాబుకి సరియైన పోటి ఒకప్పటి మిత్రుడు ,జోడెద్దు, సమకాలికుడు అయిన  వాజశేఖరుడే అని తలచి తనని ఆ ప్రాంతానికి రాజుగా చేస్తానని నచ్చచెప్పి రంగప్రవేశం చేపించాడు.. స్వతహాగా నాయకత్వ లక్షణాలుగల వాజశేఖరుడు అనతికాలములోనే జంతు మన్నన పొంది  ఇంద్రబాబు సుదీర్గ పరిపాలనలొ వస్తున్న జంతు వ్యతిరేకతను అందుకుంటూ అడవంతా పాదయాత్ర చేసి ఇంద్రబాబుని ఎదిరించి  అ ప్రాంతంలో ఓ బలమైన నాయకుడిగా నిరూపించుకుని విజయగర్వముతో  ఓ రోజు ఇంద్రబాబుకన్నా పెద్దగా రంకె వేశాడు. నదిలో నీళ్ళు తాగడానికి వెళుతూ ఆ రంకె విని తనకు స్వతహగా ఉన్న భయంతో వణుకుతున్న తోనియాని చూసి మహారాణి భయ పడకండి ఇది మన గిహమదు పటేలుడు ప్రవేశపెట్టిన వాజశేఖరుడు అరుపు తను ఇంద్రబాబుని ఓడించి ఆప్రాంతంలో పట్టు తెచ్చుకుని విజయ గర్వముతో అరచిన అరుపులా ఉంది అదే నిజమయితే అతనిని తీసుకునివచ్చి మీకు పరిచయం చేస్తాము ,అంటూ వాజశేఖరుడు దగ్గరకు బయలు దేరాయి దిగ్విజయ,ఆజాదులు . వారి ద్వరా  విషయం తెలుసుకుని మిక్కిలి సంతసించిన వాజశేఖరుడు వెంటనే బయలుదేరి తోనియాని దర్శించుకుని తన విశ్వాసాన్ని ప్రదర్శించుకున్నాడు. అతని వినయాన్ని మెచ్చిన తోనియా  అతని వలన తన కుమారుని మద్దతు పెరుగుతుందని భావించి గిహమదు పటేలుడు సలహా తో వెంటనే తనని ఆ ప్రాంతపు మంత్రిగా ప్రకటించి మిత్రుడి స్థానమిచ్చింది తోనియా.

క్రమంగా వారిద్దరి స్నేహం పెరిగి దినదినాభివృద్ది కాసాగింది. సహజంగానే దాన్ని సహించలేని దిగ్విజయ,ఆజాదులు ఎలాగైనా వీరిద్దరి స్నేహాన్ని విడదీయాలని తలచి అదును కోసం చూడసాగాయి.  ఒ రోజు దిగ్విజయుడు ఆజాదుతో మనము ఇప్పుడు ఎమిచేయాలి?  తోనియా దగ్గర, మన ప్రాధాన్యత తగ్గిపోయింది, ప్రతిదానికి ఆ వాజశేఖరుడు మీదే మన రాణి అధారపడుతున్నారు, ఇలాగైతే మనకిక్కడ కొద్దిరొజులలో తిండే దొరకదు అని విచారముతో అనగా దిగ్విజయా!  పూర్వం తోనియాని సేవించిన కాటక, పాటకులనే రెండు నక్కలను కోపం వచ్చితోనియా, బయటకు పంపించింది, అవి ఇప్పుడు వాజశేఖరుడుని అనుసరిస్తున్నాయి, దానిని అదునుగా తీసుకుని ఎలాగైన, తోనియాని, వాజశేఖరుడుని విడగొడుతాను అన్నాడు స్థిరంగా  ఆజాదు.  ఆ మాటలు విని మిక్కిలి సంతసించిన దిగ్విజయుడు మంచిది జాగ్రత్తగా పని చేసుకునిరా అంటూ సాగనంపాడు ఆజాదుని.. ఆజాదుడు వెంటనే తోనియా దగ్గరకు వెళ్ళి సమయము చూచి మహారాణి మీ మిత్రుడైన వాజశేఖరుడు మునిపటిలా లేడు,, కాటక, పాటకులతో కలిసి మిమ్మలిని చంపి తను ఈ అడవికి మహరాజు కావాలని కుట్రలు పన్నుతున్నాడు అని చెప్పగా  తోనియా ముందు  నమ్మక, ఆ తరువాత నక్కలరాజుని పిలచి విచారించింది, నక్కల రాజు మహారాణీ , నా నోటితో ఏమని చెప్పను అనగా నిజమే  అని నమ్మి ఆజాదుడితో  సరే నీవు  పోయి తనని రమ్మని మా మాటగా చెప్పు అని ఆజ్ఞాపించింది తోనియా.

ఇదే అదునుగా ఆజాదు వాజశేఖరుడు దగ్గరకు వెళ్ళి,  నువ్వు మంత్రి వైనప్పటి నుండి మన తోనియా నిన్ను చంపి తినాలని  ఉంది అని ఉన్నవి లేనివి కల్పించి చెప్పగా ఆగ్రహించిన వాజశేఖరుడు కోపముతో రంకెలేస్తూ వెళుతుండగా ఊహించని విధముగా  మార్గమద్యములో అడవిలో రేగిన కార్చిచ్చుతొ అకాల మరణం పొందాడు.

ఇక తన వారిలో  బలహీనుడైన దోశయ్య ని మంత్రిగా పెట్టి పరిపాలనచేయాలని తలచిన తోనియా  ఊహించని విధముగా వాజశేఖరుడు కుమారుడైన గగనుడి రూపంలో మళ్ళి సవాలు ఎదురైంది. తనో గొప్ప నాయకుడి గా ఊహించుకుని మంత్రిపదవి ఆశించి భంగపడిన  గగనుడు తన తండ్రి అకాల మరణం తో వచ్చిన సానుభూతిని వాడుకుని ఎలాగైనా గద్దెనెక్కి తన ఆస్తులను కాపాడుకోవాలని మంత్రాంగం నడుపుతూ అటు ఇంద్రబాబుకి, ఇటు తోనియాకి సవాలు విసరసాగాడు.

ఈ తలనెప్పిని భరించలేని తోనియా గిహమదు పటేలుడు సలహా కోరగా మహారాణీ, పూర్వం నా సలహా వినకుండా మాతోటి పావురాలు నూకలకు ఆశపడి  వెళ్ళి వలలో చిక్కుకుని చావు తప్పి కన్ను లొట్టపొయినట్లుగా చివరకు  మిత్రుడైన ఎలుక సహాయంతో  బయటపడ్డాయి. మీ మనసు తెలిసి ఈ  గగనుడు  పై ఓ కన్ను వేసి ఉంచాను, అత్యాశ పరుడైన  ఇతను ఇప్పటికే మన నూకలుతిని వలలో చిక్కుకుని గిజ గిజా కొట్టుకుంటున్నాడు. మీరు  ఇక  మన యువరాజుకి అతని మద్దతు కోసం పెద్దగా ఆలోచించనవసరములేదు తను ఎప్పుడైనా మనవైపు వస్తాడు అంటూ మహారాణి వైపు తలెత్తి చూశాడు .  అయినా తన వంక అపనమ్మకంగా చూస్తున్న మహారాణి తో గిహమదు పటేలుడు మహారాణీ ఇందాక చెప్పినట్లు ఆశకు అంతులేదు, పూర్వం ఓ పులి తనదగ్గర ఓ బంగారు కంకణం పెట్టుకుని ఎంతో మంది బాటసారులని ఆకర్షించించి తన ఆకలి తీర్చుకుంది, తనకి అవసరమైన అలాంటి  కంకణాలు మన దగ్గర చాలా ఉన్నాయి, ఇప్పటికే అటు పక్కనుంచి రాయబేరాలు మొదలైనాయి కాబట్టి దిగులులేదు, ఎటొచ్చి ఇంద్రబాబు మళ్ళి బలపడుతున్నాడని మన హంసవేగుల సమాచారం అని గిహమదు పటేలుడు చెప్పగా, మరి ఇప్పుడెలా అని తోనియా  విచారపడుతుండగా  మీరు భయపడకండి మహారాణీ, అడవి పెద్దది కాబట్టి ఇన్ని సమస్యలు  మనము  ఇంతకుముందు పెట్టి ఉన్న ప్రాంతియ చిచ్చు  ఇప్పుడు మంటలుగామారి అడవిని దహిస్తుంది ఇదే సరైన సమయము అడవిని రెండుగా చీల్చి మీ జన్మదిన కానుకగా రెండు వైపులవారికి బహుకరిద్దాం, అందరూ ఆనందముతో మన యువరాజు పట్టభిషెకానికి సహకరిస్తారు. ఇక అడవి రెండు ప్రాంతాలైతే రెండు ప్రాంతాలకు చెందిన ఇంద్రబాబు ఎవరికి వంతు పాడలేక తను కనుమరుగవుతాడు అని  గిహమదు పటేలుడు  అనగా మరి తరువాత ఆ కార్చిచ్చును మనము ఆపగలమా అని తోనియా అనుమానంగా పలుకగా  ,మహారాణీ మీ అనుమానం నివృత్తి చేయటానికి ఓ చిన్న కథ చెబుతాను  పూర్వం వింధ్యారణ్యం లో ఓ చెట్టు వుండేది , దాని తొర్రలో ఓ పిట్ట నివశిస్తుండేది, ఓ రోజు వర్షం కురవడముతో సకాలంలో తన గూటికి చేరలేకపోయిందాపిట్ట.  ఆ రాత్రి ఆ తొర్రలో ఓ కుందేలు కునుకుతీసింది, చీకటిలో ఎలాగో అలశ్యంగా వచ్చిన ఆ పిట్ట ఆ కుందేలుతో తగువేసుకుని న్యాయం కోసం ఓ పిల్లి దగ్గరకు వెళ్ళాయి అమయకంగా. పిల్లి వాటికి మర్యాదలు చేసి వచ్చిన పని అడుగగా పక్షి, కుందేలు తమ సమస్యను వివరించాయి, అప్పుడా పిల్లి నాయనా నేను ముసలి వాడినైపోయాను దగ్గరగా వచ్చి నా చెవులో చెప్పండి,  అనగా అవి దానిని గ్రుడ్డిగా నమ్మి దగ్గరకు పోగా పిల్లి  రెంటిని పట్టుకుని  తినేసింది. అలాగే మనమూ ఇద్దరిని నమ్మిద్దాం తరువాత మన యువరాజుని మహరాజుని చేద్దాము అని  గిహమదు పటేలుడు  పలుకగా తోనియా  త్రుప్తిగా తలాడించింది తన కనులముందు తన కుమారుడి పట్టభిషేకము కనిపిస్తుండగా…

అంతలో తోనియా ఆనందపు ఆలోచనలను భంగపరుస్తూ ఇంటిలోనుంచి  ఏడుపు వినిపించింది పెద్దగా…..  ,  ఎవరదని  తోనియా  గద్దించగా పక్కనుంచి దిగ్విజయ,ఆజాదులు బయటకు వచ్చి మహారాణీ! మన యువరాజ వారు బడికి పోనని పెద్దగా ఎడుస్తూ మారాం చేస్తున్నాడు , ఆడుకోడానికి  బొమ్మలు కావాలంట.

అది విన్న తోనియా హతవిధి అంటూ  తన పంజాతో తల బాదుకుంది, ఇదంతా ఎవరికోసం?  అనుకుంటూ.

సహజీవనపు లింకు పోస్టులు

“తల్లీ! భిక్షాందేహీ!”          అమ్మ…కోర్ కమిటీ…ఓ సూపర్ కంప్యూటర్.   

Advertisements
  • sreerama
  • August 25th, 2013

  brahmanadam. great. very nice. good nartion. keep it up

 1. thank u sreerama

 2. హాస్యం హాస్యంలా ఉండాలి కానీ కోట్లాది ప్రజల దశాబ్దాల పోరాటాన్ని ఎగతాళి చేయడం సబబు కాదు.

  Very funny to note your history starts with Sonia, YSR & Babu. When Telangana first fought for statehood 44 years ago, YSR & Babu were still in school and Sonia had just come to India.

  • ఇక్కడ ఎగతాళి అనే సమస్యే లేదు ,అందరం ఒకటే, ఇచ్చిన ఉద్దేశమే ప్రశ్నార్ధకం, తెలంగాణా ప్రజలకోసం ఇచ్చింది కాదిది, యువరాజు రాజకీయ లబ్దికోసం ఇచ్చింది.

   • కాంగ్రెస్, తెదేపా & వైకాపా పార్టీల అభిప్రాయాల మేరకే తెలంగాణా ఏర్పాటు జరిగిందని స్పష్టం. ఇప్పుడు చెబుతున్న అభంతరాలు చెప్పే అవకాశం ఇచ్చినా వాడుకోక అంతా అయినాక లొల్లి చెయ్యడం మూర్ఖత్వం.

   • ఆ ముగ్గురూ చెబితే తను ఇటలికి తిరిగి వెళుతుందా?అయినా ఇస్తున్నాము మీ అభ్యంతరాలు ఏమిటి అని ఎవరినీ అడగలా తను.
    పాపం భుట్టొ కాలం నుంచి పాకిస్తాను వాళ్ళు కూడా అడుగుతున్నరు కాశ్మీర్ కావాలని, ఇచ్చేద్దాం ,అక్కడ మన M.P సీట్లు ఉంటే ఇచ్చినా ఇస్తది మరి

  • nadeem ansari
  • August 26th, 2013

  అంగట్ల బేరాలు మేకకు ఎరుకా ? అని ఒక మళయాళ సామెత ఉన్నది.

  (ఆడరియుమో అంగాడి వాణిభం ) ఇది మా తెలంగాణ విషయం లో అక్షర సత్యం.

  కొన్ని విషయాలు పంచతంత్రం చదివైన తెలుసుకుంటె మంచిది.

  ముందె ఊహిస్తె విజ్ఞత అంటరు. తెలంగాణ బర్ బాదికి తొలి అడుగు పడింది.

  ఇక ఎవర్ని నిందించి ప్రయోజనం లేదు.

  కథ చాతుర్యం గనే ఉన్నది. ఇంకింత మెరుగుదిద్దవచ్చు. కోస్తాంధ్రులకు తెలుగులో రచన చేసే సామర్థ్యం

  ఉండుట ఆశ్చర్యమే. వారు మాట్లాడేటప్పుడు వాడే అసభ్య పదజాలం వింటె అట్లనిపించదు.

  ఓవరయి పోయింది, మెంటలెక్కింది, కట్టింగులొద్దు వంటి ఏహ్యమైన భాషా ప్రయోగాలను దాటి ఒక కథ

  రాసినందుకు ఒక తెలంగాణీయుని అభినందనలు

  నదీమ్

  • ఒక తెలుగువాడిగ మీ అభినందనలు స్వీకారమే,ఇక మీరన్న “కోస్తాంధ్రులకు తెలుగులో రచన చేసే సామర్థ్యం
   ఉండుట ఆశ్చర్యమే”. వారు మాట్లాడేటప్పుడు వాడే అసభ్య పదజాలం వింటె అట్లనిపించదు. ఇది మీ విజ్ఞత కే వదిలేస్తున్నా.

  • Jai Gottimukkala
  • August 26th, 2013

  Really funny. Do you expect the center to ask all 5 crore Andhras!

  Did they ask every Tamil before giving Andhra in 1953?

  దౌర్జన్యం చేసి ఎంత కాలం బలవంతంగా కలిసి ఉండగలరు? తెలంగాణా వాళ్ళు లేనప్పుడు సమైక్య ఉద్యమానికి అర్ధం ఉందా?

  తమ మానిఫెస్టోలో, పాలిట్బ్యూరో తీర్మానాల్లో, అధికారిక లేఖలలో రాసిన విషయాన్ని మర్చిపోయినట్టు నటిస్తున్న వాళ్ళు మూర్ఖులా దుర్మార్గులా?

  • దౌర్జన్యం చేసేదెవరో నిన్న లాయర్ల మీటింగ్ రుజువులిస్తుంది. అందరిని అడగగక్కరలేదు మన కవితక్కని, హరిష్ మామని అడిగి ఇచ్చేస్తే చాలు.

    • chandu
    • August 26th, 2013

    dourjanyam evaru chesthunnaru gunturro lo group 1 offficer pai dhadi chesindapudu teliaydaa , oka lady meedha penda vesinapudu teliyaledaa, okaa garbinini baytaku pampi napudu teiyledaa, AP ngo meeting ku telagana vadu vasthe gate out ante teliyaledaa 🙂

  • ravi sankar
  • August 26th, 2013

  super….reflecting the current scenario perfectly…

  • giri
  • August 26th, 2013

  very nice. good naratio

  • Phani
  • August 26th, 2013

  Well narrated i do respect d telengana aggitation that was done 44years ago……but how can people relate the present to the former,,,,, as its well known that the present one orginated bcoz of the selfishness of KCR and bcoz of the congress strategy to defeat chandrababu….the sad thing is that bcoz of these political strategies v common people are getting into arguments and spoiling relations but d fact is that bcoz of these two aggitations development has gone dead…..I wish everyone should realize this ……..instead of youth supporting telengana or samaikyandra if they had raised an aggitation on corruption and d crooked politics these 4yrs by now we would have created an new era in politics in india

   • ravi sankar
   • August 29th, 2013

   rightly said Mr.Phani
   Telangana or samaikandhra will not change any one’s fate except those politicians
   Come lets fight against corruption, for better politics,for development…..

  • girichand
  • August 27th, 2013

  Well said Mr.Phani.

   • Phani
   • August 27th, 2013

   Thank u Mr.Giri

 3. ఆడుకోమని దేశాన్నిస్తానంటే, ఆటబొమ్మలు కావాలంటున్నాడా..? హా.. హతవిధీ..!!

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: