“రాజకీయభేతాళం”

bhetaalam

                       పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, “రాజా, ఇంత అర్ధరాత్రి వేళ విశ్రాంతి, నిద్రా సుఖాలకు దూరమై, గుడ్ల గూబలూ ,విషసర్పాలు, ఆకలిగొన్న నక్కలూ తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వుపడుతున్న శ్రమ అర్ధహీనంగా తోస్తున్నది. నీ జీవితాశయం, ధ్యేయము ఏమిటి? గొప్ప కీర్తి సంపాదించాలనా? లేక అంతులేని సంపదా, లేక ఇంకా ఉన్నతమైన పదవా? ఎందుకంటే ఉన్నత పదవులలో ఉన్న మనిషి ఆవేశాలకూ, ఉద్వేగాలకూ లొంగకుండా సరైన నిర్ణయాలు తీసు కోగలిగినప్పుడే తన పదవికి, సమాజానికి న్యాయంచేయగలడు.
రాజుకి రాజనీతి విషయాలలో సలహాలిచ్చేందుకు మంత్రులూ, యుద్దవ్యూహాలలో తోడ్పడేటందుకు సేనాపతులూ, ఐహిక ఆధ్యాత్మిక చింతనాపరంగా కలిగే సంశయాలను తీర్చేందుకు పండితులూ ఉంటారు , నీ ఆస్థానములో అలాంటి వారికి కొదువవుండదని భావిస్తున్నాను. కాని వారి లో కొందరు ఒక్కొక్కసారి స్వార్ధం కొద్దిగాని, లేక హేతు,ఆచార విరుద్దమైన సమస్యను ఏదోవిధంగా పరిష్కరించి తృప్తి పడదామన్న తాపత్రయం కొద్దీ గానీ చిత్రమైన ఆలోచనలు చేస్తారు అలాంటివారి సలహాలు విని నిర్ణయాలు తీసుకుంటే తరువాత ఇరువైపులా న్యాయం చేయలేక  మౌనమోహనుడిలా మౌనాన్నే ఆశ్రయించక తప్పదు. నీకు ముందే హెచ్చరికగా ఉండేందుకు ఆయన కధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను,” అంటూ ఇలా చెప్పసాగాడు.

ఫాటలి పుత్రా న్ని మౌనమోహనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నకాలంలో, త్రిలింగ రాజ్యం అనే ఓ పచ్చటి సామంత రాజ్యం ఉండేది,దాన్ని కిరణకుమారుడు అనే ఉప రాజు హంసద్వీపం రాజధానిగా పాలించేవాడు.  ఫేరుకి తగ్గట్టే హంసద్వీపం అందమైన నగరంగా పేరుపొందింది. గత రాజుల ప్రత్యేక శ్రద్ద తో ఓ గొప్ప నగరంగా , మిగతా నగరాలలో ప్రత్యేకంగా నిలచి దేశవిదేశాలలో ఓ మంచి  వ్యాపార కేంద్రం గా భాసిల్లుతూ అందరికీ జీవనోపాధిగా మారి రాజధాని అని పొట్టకూటికొసం వచ్చే వారందరిని తన కడుపులో పెట్టుకొని కాపాడసాగింది.  పాలకులు మరే నగర అభివృద్ధి మీదా దృష్టి పెట్టకపోయినా ఇది తమది అనే భావనతో అక్కడ జరిగే అభివృద్ధిని అందరూ స్వాగతిస్తూ వచ్చారు., కాని కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండధనే నానుడి ఋజువు చేస్తూ, పచ్చటి పొలానికే పురుగుపడుతుందనే చందంగా పచ్చటి త్రిలింగ రాజ్యాన్ని రెండు ముక్కలు చేసి హంసద్వీప రాజధానితో కలసిన  కొంతప్రాంతాన్ని తమకు వదిలి మిగతావారు వెళ్ళిపోవాలని  లేదా తమ భిక్షతో  ఇక్కడ బతకాలని , కొందరు రాజకీయ నిరుద్యోగ గొంగళిపురుగులు చేసిన ప్రసంగాలతో ఓ వైపు రేగిన  ప్రాంతీయ విద్వేషాలలో రాను రానూ  ప్రజలూ భాగస్వాములు కాక తప్పలేదు.

ఉద్యమ నాణాన్ని ఓ వైపునుంచే చూసిన మహరాజ రాజకీయ సలహాదారులు తాత్కాలిక రాజకీయ లబ్ధితో వేసిన లెక్కలతో రెండోవైపు జరిగే దీర్ఘకాలిక నష్టము గురించి ఆలోచించకుండా, విభజన పరమైన సమన్యాయాన్ని వదిలేసి, తమకు తోచినదే న్యాయమని భావిస్తూ ఇచ్చిన సలహాతో విభజనకి పచ్చజెండా వూపేసాడు మౌనమోహనుడు .  దీనితో హంసద్వీపంతో తమ జీవితాలు ముడిపడి ఉన్న ఇతర ప్రాంత ప్రజలు, తమ భాగ స్వామ్యంతో అభివృద్దిచెందిన నగరం తమకు, తమ పిల్లలకు కాకుండా పోతుందనే క్రోధాగ్నితో దహించుకు పోయి నిరసనలతో, తమ ఆగ్రహాన్ని పాలకులకు రుచి చూపిస్తూ వీధిపోరాటాలు చేయసాగారు. ఇది లేశ మాత్రంగానైనా ఊహించలేని  మహారాజు  సలహాదారులు తమ తప్పుడు నిర్ణయాన్ని సమర్దించుకోలేక  ఇచ్చినమాటని వెనుకకు తీసుకోలేక అన్యాయంగా ముందుకి పోలేక   అవస్థలు పడుతున్నారు.  అందుకే రాజా,  ఉన్నత పదవిలో ఉన్నవారు తాత్కాలిక ప్రయోజనాలు ఆశించకూడదు, దేశం కోసం ఓ ప్రాంతాన్ని, ఓ ప్రాంతం కోసం ఓ ఊరుని,  ఓ ఊరు కోసం ఓ ఇంటిని , ఓ ఇంటికోసం ఓ మనిషిని  బలి చేయొచ్చు అని పెద్దలన్నారు , కాని ఇక్కడ ఓ మనిషి కోసం ఓ ప్రాంతాన్ని బలి చేసిన రాజు నిర్ణయం సరైనదేనా? అలా అని మహ రాజు స్థానంలో ఉండి ఓ ప్రాంతానికి ఇచ్చిన మాట తప్పటం న్యాయమేనా?  రాజధాని మావైపు వుంది మాకే కావాలి అనే వారిది తప్పా?, దాని అభివృద్ధిలో మా వాటానే ఎక్కువ ఇప్పుడు మాది కాదంటారా అనే వారిది తప్పా? ఇదంతా  హాస్యాస్పదంగాలేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది.

దానికి విక్రమార్కుడు, నువ్వు చెప్పినట్లు రాజనీతి సలహాలిచ్చేవారిలో స్వార్ధం ఉంటే తమ నాయకుడునో, నాయకురాలినో తృప్తి పరచటానికి ధీర్ఘకాలిక  దేశ ప్రయోజనాలు ఆలోచించక,  సలహాలిస్తే ఇలాగే తరాలు , ప్రాంతాలు నాశనమౌతాయి. అందుకే ప్రతిరాజు తన సలహాదారులను ఎంచి ఎన్నుకోవాలి. ఇటువంటి  సలహాలతో చివరకు వీరు ఎవరినీ తృప్తి పర్చలేరు వారు ఆశించిన ఫలితమూ పొందలేరు. అందరూ కలిసి అభివృద్ది చేసారు కాబట్టి ఆ ఫలం  ఒకరికే చెందదు,  అవతలి వైపు వారి సొమ్ముతొ చేస్తున్నఅభివృద్ధికి ముందు  ఎవరూ అడ్డు చెప్పక, అభివృద్ది అంతా జరగనిచ్చి  ఇప్పుడు మీది కాదు అనటం  ఒక విధంగా పంట చేతికి వచ్చిన తరువాత భాగ స్వామిని తరిమేసినట్లు , అందువల్ల అది ఖచ్చితంగా అన్యాయమే , ఈ నేలలో ఉందని ఒకరిదైపోదు. రెండోవైపు ఒప్పించి తీసుకోవలిసిందే కాని హక్కుగా కాదు. రాజుకి ఈ విధంగా మౌన భగం కలగగానే , భేతాళుడు శవం తో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

  • హర్ష
  • August 29th, 2013

  కెవ్వు కేక ఈ కథ. దిక్కుమాలిన నాయకత్వంతో దేశం ఇప్పుడు అధోగతి వైపు పరుగు తీస్తోంది. లక్షల కోట్ల రూపాయిల కుంభకోణాలు జరిగినా పదవులు పట్టుకుని వేలాడుతున్న ప్రధాని వంటివారు మన నాయకులవటం మన దురదృష్టం. మర మనుషులు మన పాలకులు. రాజకీయ లబ్ధి కోసం కాకుంటే ఒక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని వీళ్ళు విడతీయరు. ప్రజలు ఇవి అర్థం చేసుకోలేనంత వెర్రి వాళ్ళు మాత్రం కాదు. హైదరాబాదు ఆంధ్రలో ఉండి ఉంటే ఎప్పుడో తెలంగాణాన్ని అడగ్గానే వదిలేసే వాళ్ళు ఆంధ్రులు, ఇన్ని గొడవలుండేవి కాదు.

  కథా విధానం చాల బాగుంది.

  • “హైదరాబాదు ఆంధ్రలో ఉండి ఉంటే”

   Nice dream 🙂

   హైదరాబాద్ 1956లొ కూడా తెలంగాణాలో ఉండేది. ఆ విషయం బెతాలుడికి తెలిసే అవకాశం లేదంటారా?

  • ravi sankar
  • August 29th, 2013

  bagundhi….inka rayandi…..mee lantivari kalam veyyi gonthukulatho samanam….
  Thank you

 1. @హర్ష,
  హైదరాబాద్ ఆంద్రాలో ఉంటే అసలు తెలంగాణా అడిగేదెవరు?

 2. అవే పాత కాలం చెల్లిన వాదనలు!

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: