దేఖో సిద్ధా భాయ్! గట్లైతే నేనూ సింహం లెక్కనే !

553px-Seal_of_Andhra_Pradesh_svg
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సమైఖ్యాంధ్ర ఉద్యమం పెరిగి పెద్దైపోయి అంతా కప్పేసింది. ఇప్పుడు హైదరాబాద్ ని కూడా కమ్మేసింది. ప్రభుత్వ ఉద్యోగులు కలిస్తేనే ఒక సముద్రం పొంగినట్లుంది, ఇక రైతులు, సామాన్యులు, విధ్యార్ధులు, ప్రైవేటు ఉద్యోగులు అందరూ కలిస్తే ఎలా ఉంటుందో! ఇది సమైఖ్యాంధృలకి నూతనోత్సాహం ఇస్తే మరో ప్రాంతం వాళ్ళు అవాక్కయ్యేరు.

ఇద్దరు మాత్రం దిగులుగా కూర్చుని ఉన్నారు. ఆంధ్ర నుండి వచ్చి హైదరాబాదులో చదూకుంటున్న రామం, ఇంకా హైదరాబాదుకు చెందిన శ్యామం. ఇద్దరూ ఎల్కెజి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు యుకెజి లో ఉన్నారు.

రామం మొహాన్ని రెండు చేతుల్తో పట్టుకుని “గట్లైతే నువ్వెల్లి పోతావా రామం!” దిగులుగా అడిగేడు శ్యామం.

“అవును. మరి తప్పదుగా, మీ తాత చెప్పేడుగా! ఆంధ్ర వాళ్ళందరు హైద్రాబాదు వదిలెళ్ళి పోవాలని!” అన్నాడు రామం శ్యామం చేతులు తీసేస్తూ.

“అవుననుకో..కాని నా దిగ్లంతా నీకిష్టమైన ఈ బొమ్మ గురించే” అంటూ తన టెక్స్ట్ బుక్ లో మొదటి పేజీ తీసేడు.

తృళ్ళి పడ్డాడు రామం. ఏమి బొమ్మరా అది? అని ఆత్రంగా అడిగేడు.

అప్పుడు శ్యాం చూపించిన బొమ్మని చూసి ఆశ్చర్యపొయ్యేడు.

అది ప్రతి టెక్స్ట్ బుక్ లొ మొదటి పేజీలో ఉండే ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్ర.

“అంటే ఇది…..” అంటూ కళ్ళు పెద్దవి చేసి నోట మాట రాక ఉండి పొయ్యేడు రామం.
“అవున్రా రామం. ఇది మా ప్రాంతపు బొమ్మంట. మీరు వేరేది గీస్కోవాలంట గింక” అన్నాడు శ్యామం రామం కళ్ళల్లోకి చూస్తూ.

“అంటే ఈ చెంబు కొబ్బరికాయ ఇంక మాకుండవా?” అడిగేడు ఆ కలశాన్ని చూస్తా
“అవున్రా, నువ్వు అన్ని టెక్స్ట్ బుక్స్ లోంచి ఆ పేజి చింపేసెయ్యి ఇంక.”

పోనిలేరా మేము వేరెది గీస్కుంటాము కాని, నా దిగులంతా నీ గురించేరా! ” అన్నాడు రామం శ్యామం వంక చూస్తూ.

“గెందుకురా” అని అడిగేడు భయంగా.

“అదేరా. నీకు సినిమాలంటే చాలా ఇష్టం కదా. అందులో హీరోల భాషంటా ఆంధ్ర వాళ్ళదే ఉంటుంది కదా, దాన్ని మీ భాషలోకి డబ్బింగ్ చెప్తారంట.”

“గంటే??”

“అంటే ఇప్పుడు తమిళ్ సినిమాలని తెలుగు లోకి డబ్బింగ్ చేసి మనకి చూపిస్తారు కదా. అలాగన్నమాట. ఇప్పుడు ఆంధ్రలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టూ” అయితే ‘సీతమ్మకి దర్వాజా కాడ సిరిమల్లెకి చెట్టూ’ అని మీ రాష్ట్రం లో రిలీస్ చేస్తారన్నమాట. అందులో సీతది ఫేమస్ డైలాగ్ ఉంది కదా..’ఏమో నాకలా తెల్సిపోతుందంతే’ అని, ఆ డైలాగ్ ని ‘గేమో నాకలా సంజైపోతదంతే’ అని అని చెప్తుందంట సీత.” అన్నాడు కళ్ళు చక్రాల్లా తిప్పుతూ

“గట్లా గయితే గేం బాగుంటుంది!! నేనొప్పుకోను” అని గుడ్ల నీళ్ళు కుక్కుకుని కోపంగా చూసేడు శ్యామం.

“ఇంకా నీకు పవన్ కళ్యాణ్ అంటే చాల ఇష్టం కదా ఆయన డైలాగులకి మీ తాత డబ్బింగ్ చెప్తాడంట. “దేఖో సిద్ధా భాయ్! గట్లైతే నేనూ సింహం లెక్కనే. గదీ గడ్డం గీస్కోదు నేనూ గీస్కోను. మిగతావన్నీ షేం టు షేం బిడ్డ నకరాల్జేయకు నీ కాల్ నరకత.” అని డబ్బింగ్ చేస్తాడంట. అని అనగానే రామం మీద పడి కలబడిపొయ్యేదు శ్యామం మా తాతేం అలా మార్చడు అంటూ.

రామం కూడా కలబడిపోయి “మేము టెక్స్ట్ బుక్ లో ఒక్క పేజినే చింపాలిరా..మీరు దాంతోపాటు అన్ని చింపేస్కోవాలి. ఎందుకంటే మీ యాసలో వ్రాస్కోవాలింక.” అని కిందబడి దొర్లుకుంటూ కొట్టుకుంటున్నారు.

ఇంతలో మేడం వచ్చి కర్రతో ఒక్కటేసింది ఇద్దర్నీ వాళ్ళ వాళ్ళ క్లాసుల్లోకి పొమ్మని. ఇద్దరూ దుమ్ము దులుపుకుంటూ పరిగెత్తేరు.

“లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా!”
అని ఇటలీ భాషలో అనుకుంటూ, నవ్వుకుంటూ, మెరిసే కళ్ళతో తన గదిలోకి వెల్లిపోయింది ఆ మేడం కర్రూపుకుంటూ.

gc269ls9

Advertisements
  • indian
  • September 11th, 2013

  హా..హా…పోస్ట్ నచ్చినా ,తాలిబ్లాగన్ లకు జడిచి,ఎవరూ కామెంట్లు పెట్టరు…:)

  • Anonymous
  • September 12th, 2013

  hilarious ..!!!

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: