విత్తం విత్తం మహా విత్తం!

untitled
చిత్రం చిత్రం మహా చిత్రంగా ఉంది ఈ సీమాంధ్ర నాయకుల తీరు.వెనకటికెవడో ఆ కొండని తెచ్చి నా భుజం మీద పెట్టండి మోస్తా అన్నాడంట. ఆంటోని కమిటీ తుమ్మనివ్వండి రాజీనామా చేస్తాము, నోటు తయారుకానివ్వండి అంటూ చీప్ ట్రిక్స్ తో కాలం గడుపుతున్నారంటే తమ రాజకీయ భవిష్యత్తుకి ఏ ఢోకా లేదులే అన్న నమ్మకమే అయి ఉండాలి. సమైఖ్య ద్రోహులుగా పడ్డ మచ్చని ఆ మచ్చ వేసిన ప్రజలే త్వరగా మర్చిపోతారు అన్న కాంఫిడెన్స్ వాళ్ళకి. బొత్స వంటివారు రాజకీయం నేర్చుకున్న వాళ్ళు. అదే వాళ్ళ బ్రతుకు దెరువు. నీచ రాజకీయాలు తప్పవు. కాని సినిమల్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ, ఒక నాయకుడిగా ప్రజలు నమ్మిన వ్యక్తి చిరంజీవి. స్వంత ఊరిలో ప్రజలు ఓడించినా దాన్నుండి గుణపాఠం నేర్చుకోలేక పొయ్యేడు.

నిజంగా చెప్పాలంటే సమైఖ్య వాదులకి ఈ ఊసరవెల్లి సీమాంధ్ర నాయకుల రాజీనామాలు కాదు కావల్సింది. అసలు వస్తువు ఆత్మ గౌరవం. రాష్ట్ర విభజన మీద కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేసిన వెంటనే తమ మంత్రి పదవులకి రాజీనామాలు చేసి ఉంటే ఒక మోరల్ సపోర్ట్ ఉండి ఉండేది. మేక పోతు గాంభీర్యాలతో పదవులు పట్టుకుని వ్రేలాడుతూ పోరాడుతున్న బిల్డప్ ఇవ్వటం ఆంధ్రుల దురదృష్టం.

శతృవుని బోర్డర్ వరకు రాకుండా ఆపటమే అసలైన ఉద్దేశ్యం గా ఉండాలి. బోర్డర్ దాటనివ్వు చూద్దాము అంటే, దాటి నట్టింట్లోకి కూడా వచ్చేస్తాడు. ఆస్థులు, పదవుల కోసం తల్లిని అమ్మకానికి పెట్టిన ఈ మంత్రులకి రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఓడించాలి ప్రజలు. ఈ సారన్నా ప్రజలు తెలుగు వారికి తెలుగు మంత్రుల వల్ల జరిగిన అవమానాన్ని జరుగుతున్న అన్యాయాన్ని ఎన్నటికీ మర్చిపోకుండా ఉండి ఈ స్వార్ధ పరుల మాయ మాటలకి పడిపోకుండా భవిష్యత్తులో వీరికి మరో అవకాశాన్ని ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలి. ఆస్థుల సంపాదన, వాటిని కాపడుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చిన్న పిల్ల వాడికి కూడా అర్థమైపోతూ ఉంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. విత్తం విత్తం మహా విత్తం!

Advertisements
    • Anonymous
    • December 8th, 2013

    Enti pedda pedda blaagulu rasestunnav? Vallela vundi?

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: