“అంతకుముందు ఆ తరువాత”

at

అంతకుముందు
——————

ఖళ్, ఖళ్
ఓరేయ్ పెద్దోడా ఈ దగ్గుతో ప్రాణం పోతోందిరా?
ఉండవే అమ్మా ఇంకెన్ని రోజులు, కొద్దిరోజులు, మనకి తెలంగాణా రాగానే నీకు దగ్గు తగ్గిపోతుందే తొందరపడకు.
ఎందోరా నీది చాదస్తమో, నాది చాదస్తమో నాకైతే సమజవుతుల్లా దగ్గుకి తెలంగాణాకి ముడేంది బిడ్డా నీ పిచ్చిగాని,

నీకదే తెలుసమ్మా మీరిలా ఉండబట్టే సీమాంద్రానుంచి వచ్చి మనల్ని దోచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోగానే నాకూ పేద్ద ఉద్యోగం వచ్చెస్తది.

ఎందోరా నువ్వు సదివిందేమో వానాకలం సదువు , పేద్ద కొలువెట్టొస్తదో , ఎవరెక్కిచ్చరా ఇయన్నీ నీకు?

అమ్మా అది నాకు తెలవదు అందరికీ ఉద్యొగాలొస్తయీన్నారు అంతే వస్తై, అన్నాడు కొడుకు, తన పదో తరగతి సర్టిఫికేటుని మురిపెంగా చూసుకుంటూ..
మరి చెల్లాయి పెళ్ళి , అదికూడా అయిపోతుంది చూడవే .
ఏమొరా ఖళ్, ఖళ్ .

ఆ తరువాత
—————-

ఖళ్, ఖళ్
ఓరెయ్ నువ్వు చెప్పిన తెలంగాణా వచ్చి సమచరీకం కూడా అయిపోయిందికదరా, మరి నా దగ్గు తగ్గలేదెందిరా ?

నీకా ఏ ఉజ్జొగమూ రాకపొయే అమ్మాయి పెల్లేట్రా

అదే అలో చిస్తున్నా నే అమ్మా ఎవరిని అడగాలో తెలియట్లేదే?

అప్పుడు చెప్పినవాళ్ళెవరూ ఇప్పుడు అందుబాట్లో లేరే ,వాల్ల ఇళ్ళ చుట్టుతా పెద్ద గోడలుకట్టారే

ఇప్పుడు సంజైందే యమ్మా , విభజనమైనా సమైక్యమైనా మనకొరిగేదేమిలేదే, అంతా నాయకులకేనే మన బతుకులింతేనే.
అంతేరా బిడ్డ ఖళ్,ఖళ్ .

Advertisements
 1. ప్రయత్నం బాగుంది కానీ ఈ రకం ఆంద్ర భాష ఎవరు మాట్లాడుతారు చెప్మా!

  • msk
  • September 21st, 2013

  good one.. meeru cheppinattu bhaavam mukhyam..bhaashademundi.
  @JG: andhra bhaasha eviti, manadi telugu bhaasha. andhra bhaasha telangaana bhaasha raayala seema bhaasha ani undavu, avi bhaashalu kaavu mitramaa yaasalu maatrame..

 2. No problem, have it your own way. Anyhow, thanks for conceding Telangana.

  • Anonymous
  • September 21st, 2013

  jGji… mari inta alpasantoshamaa… oohallo telangana vachchina chalaa? adi vachchina tarvaata, em sadhinchakapoyina parleda.. mari anta obsessed a?

  • giri
  • September 23rd, 2013

  chala baagumdi.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: