Archive for the ‘ భావాలమాల ’ Category

స్వాతిలో మా మొట్టమొదటి కధ-“బహుమానం” (సరదాగా…)

Capture                                                                   బహుమానం PDF

Advertisements

వెతుకులాట

where

అవును, నాకు నే కానరాక నలుదిక్కులా వెతుకుతున్నా,
కాలం విసర్జించిన నిన్నలో, మిగిలిన
అవశేషాలను కెలుకుతూ,
వ్యర్ధంగా వెతుకుతున్నా…
మనసు కుంపటిలో  కాగుతున్న
ఆలోచనల పొగసూరు ఉక్కిరిలో,
 కానరాని రేపటి భాగఫలాల కోసం
నిర్లజ్జగా వెతుకుతున్నా..
అవును నిజం
నిన్న కాలిన చేనులో
మిగిలిన నా శేషం కోసం
కాలసర్ప  కౌగిలిలో,
నలుదిక్కులా   కానరాక,
నన్ను నే వెతుకుతున్నా.

నువ్వే నువ్వే

ph-11146

అందమంటే నీదే
ఎందుకంటే
నీవందని ఎత్తులో ఉన్నావు కాబట్టి.
స్వప్నమంటే నువ్వే
ఎందుకంటే
అది పిలిస్తే వచ్చేది కాదు కాబట్టి.
కాలమంటే నీవే
ఎందుకంటే
నీవు లేని క్షణం నాకు లేదు కాబట్టి.
బలమంటే నీదే
ఎందుకంటే
నీవు కొట్టిన దెబ్బ ఇంకా తగ్గలేదు కాబట్టి.


నే బతికే ఉన్నాను….

foot-prints

ఇక్కడ నలభై..
అక్కడ ఒకటి,
చేతికొస్తున్న పంటలు చీడపడుతూ,
మొన్న కిరణ్,
నిన్న అర్పణ
నేడు విశాల్.
మరి నేనెక్కడ?
నాకు నే కనపడుటలేదు.
ఆత్రుతగా వెదికాను గూగుల్ ఏర్తులో,
నేనెక్కడని?
జూము చేసి చూశాను నేనున్నానా ? అని.
అదుగో నా బంగ్లా, అల్లదిగో నా కారు..
మరినేను?
బలుపు నలుపు తుపాకీల గురిలో,
నట్ట నడిరోడ్డులో,కటిక చీకటిలో
ఓంటరిగా…. క్రింద డాలర్లు ఏరుకుంటూ,
నేనున్నాను.
బతికే ఉన్నాను.
అక్కడ నలభై,
ఇక్కడ ఒకటి,
నే బతికే ఉన్నాను….

కాలానికి గాయం చేస్తూ….

కాలానికి గాయం చేస్తూ…
పగలూ, రేయి ఎర్ర చీరలు కడుతున్నాయి.
తెల్లవారు ఝామునే లేచిన కోళ్ళు పచ్చి నెత్తురు తాగమంటున్నాయి.
వద్దు వద్దన్నా మానవత్వపు ఘోరీల మీద మెదళ్ళు మొలుస్తున్నాయి.
రాను రాను మోకాళ్ళూ గోల చేస్తున్నాయి మాకేవి అరికాళ్లని.
నాంజేళ్ళు మొలచిన పారాణి చేతులు రిమోట్లు
నొక్కుతున్నాయి.
అన్నీ తెలిసిన అమాయకపు బాంబులు అద్భుతంగా
పేలుతున్నాయి.
తెగిపడిన కాళ్ళూ చేతులు నేలమీద రక్త కవితలు రాస్తున్నాయి.
అందమైన ఖద్దరు పెదాలు నవ్వుతూ రెండురెళ్ళు ఆరూ అంటున్నాయ్, మనల్ని నమ్మమంటున్నాయ్.
అన్నీ చూస్తూ కాలం పరుగెడుతోంది!
తన రక్త గాయాలు మానే కాలాని కోసం…

(జైపూర్ లో నిన్న (13-05-08 ) జరిగిన దారుణ మారణకాండకు స్పందనగా….)

గమ్యం

 

అంతే తెలియని గమ్యం అనుకుని

నిలబడిపోకు నేస్తమా!

గొంతే పెగలని నిరాశ తోటి

గతాన్ని చూడకు మిత్రమా!

అదుగో..

నీకోసం బతుకు వేసిన బాట.

నిట్టనిలువునా చీలిన ఆశలు

వ్రక్కలుముక్కలై

ధూళిలో కలవకముందే…

నీకోసం నాటిన క్షణాలు

నానాటికీ పెరిగి

నదిమలుపులలో కరిగి

కొట్టుకు పోకముందే,

కరిగిన కాలం కొండలై

నీకడ్డునిలిచేలోపే

క్షణమైనా వృధా చేయక

వేలనాల్కల నిరాశను

కోటి ముక్కలు చేసి

కాలు కదుపు మిత్రమా!

కదం తొక్కు నేస్తమా!

 

ఆ క్షణాలు…

holding_hands.jpg

ముసురు పట్టిన వేళ లో…
పెదవి వంపుల వాలులో,
పరుగు తీసిన మనసులు
తడిసిపొయ్యాయి.
జలపాతపు గురుతులో …
అలపొంగుల వరిపిడి లో
అదిరిపోయిన గుండెలు
మురిసిపొయ్యాయి.
మాధుర్యపు మొహరింపు లో
నీ నవ్వుల ముట్టడింపులో
కదం తొక్కిన క్షణాలు
హృదయం లో
నిలచిపొయ్యాయి.

Advertisements