Archive for the ‘ భావాలమాల ’ Category

ఓ అమ్మాయీ!

caad8tgf.jpg

గుండె గదుల గోడల పై
నీ రాతలు
నిండి పొర్లి పోయే వేళ
నీ
గజ్జెల సవ్వళ్ళు
పువ్వుల్లా విచ్చుకుంటే
ఒక కంటి నుండి
మరొక కంటికి
వెళ్ళి వచ్చేసరికి
చూపుల దారులు
గొడుగుల్లా మూసుకు పోయాయి.

               

కోటి…దండాలూ,శతకోటిదండాలూ

bapu.jpg

పర్వతా రోహణ ద్వారా తన జీవితాశయాన్ని
నెరవేర్చుకున్న మూడుపాయల వాలుజడ ఏ పర్వతము మీద
తన కాలు మోపాలో తేల్చుకోలేక
అటూ,ఇటూ చేస్తున్న నృత్యానికి
అడుగున ఉన్నా అడుగడుగునా  ఆనందమే నని
కాలిగజ్జెలు వంతుపాడుతుండగా
హంసలా కలహంసలా
ఘల్లు ఘల్లున నడిచే
ఓ తెలుగు కవితా భామా
కోటిదండాలూ,
శతకోటిదండాలూ……