Archive for the ‘ మావూరు….మావారు ’ Category

మా తాతయ్య

ముత్యాల మొలనూలు
మురిపెంబుగా జుట్టు
కాలికిన్ కడియము కట్టు బొట్టు
బొడ్డున నశ్యంపు బుర్ర నిండుగ యుండు
మాడరన్ ఫేషన్లు మట్టు బెట్టు
నడ్డ కట్టుల గాంచి ఆవేశ పడబోవు
క్రాపు తలల జూచి కసరబోవు
ఆచార్య జనమునకు నతి యాదరము జూపు
భక్తి తో దేవుని భజన చేయు
నట్టి బలిజశెట్ల యందు మేల్
ధరణి పువ్వలదొర్వు గ్రామ పుర నివాసి
రాజశ్రీ నూవుశెట్టి రాఘవయ్య నెపుడు
కేలనంజలిడురు బాలలార.

                                        – శ్రీ నూవుశెట్టి వెంకట రమణయ్య
                                        – శ్రీ అళహరి వెంకట శేషయ్య
                                           రచనా కాలం 1960

మా వూరి దేవత కళుగోలమ్మ

కావలి లోన వెలుగు కనకాంబరి
కావలె   వేల్పులమ్మ,
నీ దీవెన చాలు మాకు
ధనధాన్యము లీయకున్నయో దేవీ!
మదీయ క్రుపదల్చగ రాదె కళుగోలమ్మా.

తాతయ్య….

శ్రీ వెంకటేశ్వరా!చిత్తంభులోనా,
మాటాడి తప్పవా మన్మధాకారా
సాటి ఎవ్వరునీకు సజ్జనాకారా
సరసి నీగుణములు జాజి పూదోటి
వరుసతొ నీమాట వరహాలమూట
గర్భితో పొట్టెయ్య గర్భ సుకుమారా
అతని పుత్రుండగు అతిగుణొద్ధారా
భళిభళి రాఘవయ్య భాగ్య దేవేంద్రా.