పచ్చనాకు సాక్షిగా నామినికో లేఖ…

నువ్వుశెట్టి బ్రదర్స్

bapu18.jpg

“కష్టిపడాలకూడుతినాలఅనిమంచిమాటచెబితివికదరానాబట్టాయాడికిపోయినావురానామినోడాదోవనబొయ్యేచీమనికూడామంచీచెడ్డాఅడిగేటోడివిగదరాఅసలునీకుఈడమేమనేటోల్లంఒకరంసావలేకబతకతావుండామనిచీవగుట్టినట్టన్నావుందంటరానాబట్టాఈడవూర్లోకోడిపుంజులుతెగబలిసికొట్టుకుంటావుండాయిరాదొబ్బుకుపోయికోసకతినడానికినీసావాసకోపులుయాడికిబోయినార్రాబీకిదిఇంకాఎండనకావాననకాఎనుములుమేపతానేవుండాదిరాసామీపండిరాలిపోయినచింతకాయలుఎండిమట్టిలోకలిసిపోతావుండాయిమేమేరిస్తాములేగానినువురాసామీఎన్నుమీదగువ్వలుఏడిమీనామినిసుబ్బరమన్నెంనాయడనిఎక్కిరిస్తావుండాయినువ్వురాయేమిరామిట్టూరోడామీఇండల్లోజరిగేఇషయాలనేకతలుగారాయండబ్బాఅనిఅందరినితట్టిలేపితివిగదరాసామీనువ్వురాయవేమిరానామినోడాయాడఎలాంటికష్టింపడతన్నావోగదరాసామీలేకనీపెళ్ళాంజెప్పినట్టుట్రాక్టర్లుకొనేదానికిపెట్టుకున్నావంటరానాబట్టాఅసలుమాకుతెలీకఅడగతావుండామురామేముకుచ్చుంటేకతలేస్తేకతచెప్పినోడివికదాఇప్పుడుకతలుజెప్పేదానికినీకుమనిషులేలేరంటరాసామీ

పచ్చనాకుసాచ్చిగాచెప్తావుండామురాదచ్చినతట్టునారప్పకొడకాఇంకాఇక్కడమేముదుక్కిదున్నేదానికిబూముల్లేకదూకిచావడానికిబావుల్లేకుండానేవుండామురానువ్వుమాకతలుజెప్తావనిఆశగావుండామురామిట్టూరోడా

View original post 45 more words

“తల్లీ! భిక్షాందేహీ!”

నువ్వుశెట్టి బ్రదర్స్

images (3)

“తల్లీ! భిక్షాందేహీ!” ఓ ఇంటిముందు నిలుచొని దీనంగా అరిచాను. కొద్దిసేపటికి ఓ నడివయసు ఉన్న ఆవిడ చేతిలో బియ్యపు పాత్రతో బయటకువచ్చింది. ఆమె ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతూంది, నుదుటన సింధూరం తనకు మరింత శోభనిచ్చింది. …ముక్కు మాత్రం కోటేరుగా ఉంది  ఎవరిముక్కునో గురుతుకు తెస్తున్నట్లుగా

.“తల్లీ బిక్షాందేహీ!” మళ్ళీ అడిగాను ఈ సారి కాస్త ఆర్ద్రత నిండిన గొంతుకతో. బిక్ష వేయబోయి అనుమానంతో నావంక తేరిపార చూసి అడిగింది. ” నీవు ఈ ప్రాంతానికి చెందినవాడిలా కనిపించడములేదే? నీ దేహరంగు చూస్తుంటే ఉత్తరాదివాడిగా ఉన్నావు, నిజమేనా?”

“లేదమ్మా బిక్షకుడను, ఒక ప్రాంతం వాడినని ఎలా చెప్పను? అన్ని ప్రాంతములు తిరిగినవాడిని, అయితే ఎక్కువుగా హిమాలయములు, కాశీ, హరిద్వార్ వంటి పుణ్య క్షేత్రములలో తిరిగినందువలన కాస్త దేహం రంగు మారి ఉండవచ్చు. అంతే కాని నే ఉత్తరాదివాడిని కాను తల్లీ !…. అచ్చముగా తెలుగువాడినే.” అన్నాను.

“కాని, నాకు నమ్మకము కుదురుటలేదు. నీ భాష నందు యాస అదో మాదిరిగా ఉంది. అనాదిగా ఉత్తరాదివారు మమ్ము దోచుకొనుచున్నారు. వారికి నేను బిక్ష వేయనుగాక వేయను.” అందా మహా తల్లి.

“లేదు తల్లీ ! లేదు, నేను అచ్చ తెనుగువాడినే కావలిసినన్న నే చిన్నప్పుడు చదువుకున్న వేమన పద్యం చెబుతా విను అంటూ “ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు,చూడ చూడ రుచుల జాడవేరు..పురుషులందు…”

“ఆపూ !!” అని గట్టిగా గద్దించింది. ఒక్కసారి ఉలిక్కిపడి…

View original post 365 more words

మొక్కుతో కోరికలు తీరుతాయా? ……..

నువ్వుశెట్టి బ్రదర్స్

images.jpg

జీనమోత్తముడు(ఉత్తమ  జీనోంకోడ్  కలవాడు.)
ఏడుకొండలవాడా! ఆపదమొక్కులవాడా గోవిందా గోవిందా! ఇలా భగవంతుడి కి మొక్కుకొని తమకోరికలు తీరాయని తమను ఆపదలనుంచి  గట్టెక్కిచ్చాడని భగవంతుడికి మొక్కులు  తీర్చుకోవటం పరిపాటి.అసలు నిజంగా భగవంతుడికి ఇలా మనం కోరిన కోరికలు తీర్చే శక్తి  ఉందా? ఓ కథ తో కూడిన విశ్లేషణ ….సరదా గానూ ,సీరియస్ గానూ…..

 నాపేరు వినాయకరావు. వినాయకుడి భక్తుణ్ణి. ఉద్యోగం వస్తే భగవంతుడికి  నిలువుదోపిడి   ఇస్తానని మొక్కుకొని  సమయానికి రైలు అందక ఇంటర్వ్యూ కి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకున్నాను.  తరువాత  భగవంతుడి కీ నాకు మధ్య ఏమిజరిగిందో ఇక కధ  లో చూద్దాం…….
 
నేనూహించినట్లుగా  ఇక్కడ మేఘాలు లాంటివి ఏమీలేవు. నేల మాత్రం మన ఆకాశం లా ఉందంతే. ఒక్కచెట్టూ కనిపించలా ,కాని సంగీతంతో కూడిన సువాసనల చల్లటి గాలిమాత్రం వీస్తూంది ఎక్కడినుండో.ఆ మధుర వాసనలని పీలుస్తూ అటూ ఇటూ చూశాను ఎక్కడ మా వినాయకుడని. అడుగో ఇటే వస్తున్నాడు తొండం తిప్పుకుంటూ. ఉక్రొషం గా తల పక్కకు తిప్పుకున్నాను. అనవసరంగా చచ్చిపోయెటట్టు చేశాడు మరి, కోపం  రాదూ.రానియ్ చెబుతాను మనసులో అనుకున్నాను గట్టిగా.. కొద్దిసేపటికి నా భుజం మీద ఓ చల్లటి స్పర్శ మృదువుగా ..తొండంలాగుంది. ఇక లాభం లేదని వెనక్కి తిరిగి చూసాను. మనోహర రూపం. తనే ముందుగా అడిగాడు “కోపం పోయిందా?” అని… తలూపాను పోలేదని.
“అసలు ఎందుకొచ్చిందీ?” అడిగాడు అమాయకంగా.
చెప్పాను ఎందుకొచ్చిందో..
“అయితే నాకు మొక్కేసుకుంటే  నీకు…

View original post 655 more words

శవాలకి పెళ్ళిళ్ళు చేస్తున పెళ్ళిమంటపాల సాక్షిగా… జై

1అమ్మా “టీ” పెద్దగా అరిచాడు మొద్దబ్బాయి మంచం దిగకుండానే,
అరే ఆగరా మొద్దొడా! టీ పెట్టడమంటే చిన్న విషయమా? పాలు పితకాలి నీళ్ళు కలపాలి తరువాత మంటపెట్టి పొడేస్తే కాని టీ రాదు కాస్తవుండరా తయారు చేస్తాను, అంతలోపల ఆ కుర్చి తుడువు దుమ్ముకొట్టుకుపోయి ఉంది అంది ఆ మహా తల్లి తన చేతిలోని కత్తెర నూరుతూ.

                                                    అయినా ఈ పాలేరెదవ ఎటు పోయాడు పాలు తెమ్మంటే…. రేయ్…. ఎంకన్నా ఎక్కడకి పోయావురా? పాలు తేకుండా ఇక్కడ అబ్బాయికి టీ కావాలంట, త్వరగా రా అంటూ పెద్దగా అరిచింది తన చేతులలోని కత్తెరని పక్కనేఉన్న మాప్ పైన పెడుతూ. ఆ అరుపులు విని పెరట్లోనుంచి పరుగెత్తుకొచ్చాడు పాలేరు వెంకన్న.వాడి మూతి పగిలుంది, చెంపవాసి పోయుంది, వళ్ళంతా పేడ అంటుకునివుంది. 

ఏంట్రా ఈ వేషం ఎవరిచేత తన్నిచ్చుకొచ్చావ్ అరాగా అడిగింది.
పాలు తీయబోతే ఆ గేద ఎడమ కాలితో తన్నిందమ్మా, మహ పొగరుగా ఉంది,అన్నాడు పగిలిన తన ముక్కు తడుముకుంటూ..
పాలు పితకతం రాని వెదవా నువ్వెం పాలేరువిరా ఎదవన్నర ఎదవా దాని రెండూ కాళ్ళు కట్టెయ్  ఇవ్వకుండా ఎక్కడికి పోద్ది హుకుం జారి చేసింది.
అది కూడ చేసాను తల్లి అయినా అరుస్తూనేఉంది అన్నాడు పాలేరు తల గోక్కుంటూ..
అరిస్తే నోరుకట్టెయ్ రా అది కూడా చెప్పాల్నా?
కట్టేసానమ్మ అయినా ఇంకా కుమ్ము తుంది అంటూ నసిగాడు ఆ పాలేరెదవ.
కుమ్మితే కొమ్ములు కోసెయరా వెదవా అన్నీ చెప్పాలి యెదవకి
కోసేసానమ్మ
ఇప్పుడేంచేస్తుందిరా?
కిందపడి మూలుగుతుందే అమ్మా రేపో మాపో సచ్చే తట్లుంది.
పర్లేదు ఇప్పుడు పాలు పితుకునిరా అబ్బయికి కడుపులోకి టీ పోతే కాని తరువాత పనులు కావంట అంది ఎదురుగావున్న కుర్చి వంక చూస్తూ..
పాలేరు కదిలాడు దూరంగా సచ్చిన శవానికి జరుగుతున్న ఊరేగింపు చూస్తూ తన చావ బోయే గేదని ఎలా వూరేగించాలా అని..

 శవాలకి పెళ్ళిళ్ళు చేస్తున పెళ్ళిమంటపాల సాక్షిగా… జై