tears.jpg

కలలోన జారిన
పరువాల దండ
జారుతూ నవ్వేసిన కన్నీటి చుక్క
కంచె దాటిన భావాలు
అక్షరాల వారధి కడితే …
కళ్ళు దాటిన అనుభూతులు
కాగితాన్ని తడిపేసాయి.

m1.jpgమనసు గాయం చేస్తే, కాలం  పసుపు పూసింది.

పాత చేపా ..కొత్త చీమ..!

image.jpg  

ఒక రాజు కి ఏడుగురు కొడుకులు.వారంతా వేటకి వెళ్ళి ఏడు  చేపలు తెచ్చారు.ఆ చేపలు అన్నీ ఎండేశారు.అన్ని చేపలు తోపాటూ మన ఎండకూడని ఏడో చేప కూడ ఏండేసింది.చేపా చేపా ఎందుకెండావు? అంటే గడ్డిమోపు అడ్డం రాలేదు,అందుకు ఎండాను అనిందంట.గడ్డిమోపూ గడ్డిమోపూ ఎందుకు అడ్డం రాలేదూ ? అంటే ఆవు నన్ను మేసిందీ అనిందంట .ఆవూ ఆవూ ఎందుకు  మేసావూ?అంటే పాలేరు నన్ను విప్పేశాడూ అనిందంట. పాలేరూ పాలేరూ ఎందుకు విప్పావూ? అంటే బాబు ఏడవలేదు అన్నడంటా.బాబూ బాబూ  ఏందుకు ఏడవలేదురా? అంటే చీమ నన్ను కుట్టలేదుగా అన్నాడంట. చీమా చీమా ఏందుకు కుట్టలేదూ? అంటే బాబు  నా పుట్టలొ వేలుపెట్టలేదుగా అనిందంట. బాబూ బాబూ  పుట్టలో వేలు ఎందుకు పెట్టలేదూ? అంటే ……..

చాలా హోంవర్క్ ఉందిగా…హోం వర్క్ చేయ్యకపొతే మా మిస్సు తన్నదూ …….అని అప్పుడు ఏడుస్తూ హోం వర్క్ ముందేసుకుని, కూర్చున్నాడంట ఆ మూడు నాలుగేళ్ళ బాబుగాడు, తడిచిన తన కళ్ళు తుడుచుకుంటూ ……..

 (చందమామ కథలకు,గుజ్జనగూడు ఆటలకూ దూరమై, చీమలచే కుట్టించుకోని, చిన్నరీ,పొన్నారుల  సాక్షిగా…)      

తాతయ్య….

శ్రీ వెంకటేశ్వరా!చిత్తంభులోనా,
మాటాడి తప్పవా మన్మధాకారా
సాటి ఎవ్వరునీకు సజ్జనాకారా
సరసి నీగుణములు జాజి పూదోటి
వరుసతొ నీమాట వరహాలమూట
గర్భితో పొట్టెయ్య గర్భ సుకుమారా
అతని పుత్రుండగు అతిగుణొద్ధారా
భళిభళి రాఘవయ్య భాగ్య దేవేంద్రా.