“తోక తెగని బల్లి “

lizards_large.jpg

“నెక్స్ట్” అంటూ పిలిచి బెల్లు నొక్కాడు డాక్టరు.
క్యు లో ముందు ఉన్న బల్లి చరచరమంటూ పాక్కుంటూ డాక్టరు గారి దగ్గరి కొచ్చింది.
“ఏమిటి నీ సమస్య?” కుర్చిలో బాగా వెనక్కి వాలి అడిగాడు.
“…సార్”
“నసగకు..చెప్పు..ఇక్కడ ఇంకెవరూ వినరులే. అసలేమిటి నీ సమస్య?”
“సార్! నాకూ…నాకు తోక తెగటం లేదు సార్.”
“తోక తెగటం లేదా?” అని విరగబడి నవ్వాడు డాక్టరు. నవ్వి నవ్వి”ఎక్కడ దాకా తెగాలో గుర్తు పెట్టివ్వు, అక్కడికి అంగుళం పైనే కోసేస్తాను” అని నవ్వుతూనే అడిగాడు “అది సరే!   అసలెందుకు తోక తెగటం?”
సిగ్గుతో బిక్కచచ్చిపొయిన బల్లి ఇలా అంది.
“ఎవరైనా మమ్మల్ని చంపటానికి వచ్చినప్పుడు, తోకలో కొంత భాగాన్ని వదిలేస్తాం సార్. శత్రువు దృష్టి, కిందపడి తనకలాడే తోక మీదకు వెళ్ళి కొద్ది క్షణాలు కన్ ఫ్యూజ్    అవుతారు సార్. ఈ లోపు మేము తప్పించేసుకుంటాం సార్.”
“తోక తెంచుకోవటం  దేనికి? ఎదురు తిరిగి పోరాడచ్చు గదా? లేకపోతే పారిపోవచ్చుగా!”
“ఏం చేస్తాం సార్? మమ్మల్ని మేం రక్షించుకోవటానికి భగవంతుడు మాకు పెట్టిన రక్షణ పద్దతి ఇది సార్.”
“మరి భగవంతుడ్నే వెళ్ళి అడగలేక పోయావా?”
“ఈ భూమ్మీద మీరె కద్సార్ భగవంతులు.” అంది ఇంకేం అనాలో అర్ధం కాక.
దాక్టరు గారికి జాలేసింది.
“సరే! ఈ సమస్య నీకొక్కదానికేనా? లేక మీ ఇంట్లో ఇంకెవరికైనా ఉందా?” అడిగాడు వివరాలు  వ్రాసుకుంటూ.
“లేద్సార్…నాకు తెలిసి ఇంకెవరికీ లేదు సార్.”
“మీ తాతముత్తాతలకి?”
వాళ్ళక్కూడా లేద్సార్.”
“..అయితే! ఇది నీతోనే ప్రారంభమైందన్నమాట!”
“అవున్సార్. అందుకే భయంగా ఉంది.”
“ఏం భయపడకు!…మెదడులో ఎడమవైపు నరాలన్నీ శరీరం లో కుడి వైపుని నియంత్రిస్తాయి, అలాగే కుడివైపు నరాలన్నీ ఎడం వైపుని నియంత్రిస్తాయి. అయితే… వచ్చిన చిక్కేమిటంటే? నీ తోక అటు కుడీ కాక, ఇటు ఎడమా కాక నడిమధ్యలో ఉంది.”

“అయితే ఏం చేద్దాం సార్?” భయంగా అడిగింది.

“ఏముంది? నీ మెదడు కు ఆపరేషన్ చేసి ఒక్కోనరాన్ని పట్టి లాగి, ఏనరం నీ తోకని నియంత్రిస్తూ ఉందో కనుక్కుని, దాన్ని రిపేరు చేయాలి.”

అసలే, కొంతమంది దాక్టర్లు పేషెంట్లకి తెలీకుండా కిడ్నీలు తీసేస్తున్నారని గుర్తుకు రావటంతో “తోక తెగని బల్లి డాక్టరు దగ్గరకు వెళితే…కోసి కిడ్నీ తీసేసాడని..” రేపు పేపర్లో రాదు కదా? అనుకొని.. గజగజా వణుకుతూ అడిగింది.

“తప్పదా సార్?”

“ముందు బ్లడ్ టెస్త్, యూరిన్ టెస్ట్, బోరిక్ ఆసిడ్ టెస్ట్, నీ తోక శాంపిల్ టెస్ట్ అన్నీ చేయాలి…వీటన్నింటికీ తొంభై వే…” అని ఇంకా ఏదో చెప్పే లోపు
“సార్!” అని పెద్దగా అరిచింది.
“ఏమిటి? ఏమైంది?”
“నా తోక వూడిపోయింది సార్!” అని సంతోషంతో కేక పెట్టి డాక్టరుకి షేక్ హ్యాండిచ్చి చరచర పాక్కుంటూ క్షణాల్లో మాయమైంది.
క్రిందపడి గిలగిలా కొట్టుకుంటూన్న బల్లి తోకనే చూస్తూ   టెస్ట్ లు మరీ ఎక్కువ చెప్పానా అని అనుకుంటూ ఆ కార్పోరేట్ హాస్పిటల్ డాక్టరు గారు. “ఫీజు”  అడగటం కూడా మర్చిపోయారు.

    • teresa
    • August 11th, 2007

    Very funny and your narration is wonderful!

  1. సెబాషో!

  2. ha ha ha…

  3. బాగుంది

  4. హ.. హ.. హా.. నవ్వలేక కింద పడి ‘తనకలాడతా’ ఉన్నాం మిత్రమా..
    -పూలవాన

    • నువ్వుశెట్టి బ్రదర్స్
    • August 15th, 2007

    ఐతే నీకు MRI స్కాన్ తీయాలి బాసూ…

  5. తోక తెగిపోయింది … హ హ హా
    మీ కామెడీ అమోఘం
    ఇలాంటివి అప్పుడప్పుడూ విసురుతూ ఉండండి

  6. ఇంత మంది మంచి కామెడీ రచయితల్ని ఉపయోగించుకోకపోవడం పత్రికల దురద్రుష్టం!

  7. జీవి గారు , సుజాత గారు చాలా చాలా థ్యాంక్స్. 🙂

  8. మొత్తానికి తోక తెగింది?
    కొసమరుపు అదిరింది!

  1. No trackbacks yet.

Leave a comment