స్వగతం…..


తెలుగు అక్షరవర్ణమాలలో
యాభై ఆరు సౌగంధాలను,
ఎప్పటినుంచో
అటూ ఇటూ మారుస్తూ
ఆశగా ఉన్నాం.
ఎప్పటికైనా రాకపొతుందా …
నలుగురు మెచ్చే
ఓ నవకవితా భావమాలిక
మా కోసం అని……

అప్పటి దాకా ఇలా…..

  • Trackback are closed
  • Comments (0)
  1. అది సరే.. మీకు వ్యక్తిగతంగా లేఖ వ్రాయాలంటే ఎలా? మీ ఈ-మెయిల్ ఐ.డి. ఇవ్వండి

    • nuvvusetty
    • August 6th, 2007

    ఈ రోజు బ్లాగు – నువ్వుశెట్టి
    Posted: venkat.siddareddy on Aug 03 | Blog-Of-The-Day

    తేది: ఆగష్టు 3, 2007

    చిరునామా: https://nuvvusetty.wordpress.com/

    గురించి: తెలుగు అక్షరవర్ణమాలలో
    యాభై ఆరు సౌగంధాలను,
    ఎప్పటినుంచో
    అటూ ఇటూ మారుస్తూ
    ఆశగాఉన్నా
    ఎప్పటికైనా రాకపొతుందా …
    నలుగురు మెచ్చే
    ఓ నవకవితా భావమాలిక
    నాకొసం అని……
    అప్పటి దాకా ఇలా…..

    సొంతదారు: నువ్వుశెట్టి సోదరులు(?)

    విశ్లేషణ: చందన, బొమ్మన బ్రదర్స్ సంగతి అందరికీ తెలుసు. మరి నువ్వుశెట్టి బ్రదర్స్ తెలుసా మీకు? తెలియకపోతే మీరు బ్లాగు లోకానికి కొత్త అయ్యి వుండవచ్చు. బ్లాగులోకానికి కాస్తా ఆలస్యంగా వచ్చినా ఆలోచించేలా రాస్తున్న ఈ బ్లాగు లో తప్పక చదవాల్సినవి కృకీలు. (అంటే ఏమిటో నాకు తెలియదు, జపనీస్ హైకూలాగా ఈ కృకీలు కూడా ఒక విధమైన నవ కవనమేమో.)

    “శ్రామికుడు భావకుడైతే,
    మరలు సైతం మంద్ర స్వరాలవుతాయి.
    భావానికి ఆకలివేస్తే ,
    అక్షరాలు సైతం మరఫిరంగులవుతాయి.” అని వీరు రాసిన ఒక కృకీ అధ్బుతం.ఇదొక్కటే కాదు ఇలాంటివి చాలానే వున్నాయి వీరి బ్లాగిలో. కృకీలేకాకుండా “భావాలమాల”, “చిక్కు ముడులు “, “బోసి నవ్వులు ” లాంటి వివిధ వర్గాలలో కవితలు, కథలు, పొడుపుకథలు రాస్తున్న వీరి బ్లాగు ఆసక్తి కలిగించేలావుంది. పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి వీరందించిన ఉదంతం చాలాబావుంది. బాగా రాస్తున్నారు కబట్టి ఇంకా బాగా ఎక్కువ వ్యాసాలు రాసి మన తెలుగు వెలుగులు అంత్ర్జాలంలో ప్రకాశింపచేయాలని విజ్ఞప్తి. మంచి బ్లాగు అందరూ చూడ దగ్గ బ్లాగు.

    చదవాల్సినవి: మనసులో మాట వరగం క్రింద వీరు రాసిన మూడూ కథలు “ఈగ ఆత్మ కథ”, “మృగరాజు నవ్వుతుంది…..”, “పాత చేపా ..కొత్త చీమ..!” తప్పక చదవాల్సినవి. అన్ని కథల్లోనూ జంతువులే ముఖ్య పాత్ర వహిస్తాయి. కానీ కథంతా చదివాక చురక మాత్రం మనుషులకే తగలడం ఈ కథల పత్యేకత.

    “మృగరాజు నవ్వుతుంది…..” కథైతే George Orwell నవల్ Animal farm ను జ్ఞప్తికి తెచ్చింది.

    చివరిమాట:బ్లాగు టైటిల్ లో నువ్వుశెట్టి బ్రదర్స్ అంటూన్నారు, “స్వగతం” లో నేమో “నా కోశం” అంటున్నారు. కొంచెం కన్‌ఫ్యూజింగ్ గా వుంది.ఇంతకీ ఈ నువ్వు శెట్టి బ్రదర్స్ ఒక్కరా? ఇద్దరా?

    3 Comments
    Jump to comment form | comments rss | trackback uri 3 Comments so far

    nuvvusetty brothers on August 4, 2007 10:00 am ధన్యవాదాలు మిత్రమా! అనుభవరాహిత్యంతో, అర కొర ఙ్ఞానం తో మేము బ్రౌసింగ్ సెంటర్ ల నుండీ, ఎప్పుడైనా ఆఫీసు లో చిలక్కొట్టుడు లాగా ఇంటర్నెట్ దొరికితే అక్కడనుండీ నడిపిస్తూన్న ఈ బ్లాగ్ కి మీరిచ్చిన చిరుప్రశంస మాకు చాలా ప్రొత్సాహకరంగా ఉంది. మా గురించి చెప్పుకొవటానికి ఏమీ లేకపొవటం తో వివరాలు పెట్టలేదు. ఇక మీ అనుమానానికి సమాధానం ఏమంటె మేమిద్దరం అన్నదమ్ములం, వేరువేరు నగరాల నుండి ఆపరేట్ చేస్తూవున్నాం. మీవంటి వారి సలహాలు స్వీకరించటానికీ, తగుమార్పులు చేయటానికీ ఎప్పుడూ తయారుగా వుంటాం.

    మరో సారి ధన్యవాదాలు.

    -నువ్వుశెట్టి బ్రదర్స్
    ravi on August 5, 2007 6:24 am hi guys,
    I found a very easy way to write in telugu. U just have to type telugu in english script the site converts it into telugu in telugu script. Its very interesting. Try it! The site is http://www.quillpad.in/telugu
    vinu on August 5, 2007 1:38 pm nijamE komcham variety gaa vumdi.

Comments are closed.