Archive for the ‘ చిక్కు ముడులు ’ Category

దీని లోగుట్టు విప్పగలరా?

casx6fk5.jpg

కానని భూమి లో కస్తూరి కోనలో
మందర గిరి మీద మఱ్ఱి చెట్టు
చెట్టుకు చేర్చింది పది నూర్ల కొమ్మలుండు
కొమ్మ కొమ్మ కు కోటి కోతులుండు
నగధరంబైనట్టి నడి కొమ్మ మీద
నక్క ఒకటున్నది చుక్క వలెను
చుక్కకు తూర్పున సూర్యచంద్రాదులు తేజరిల్లు.
దీని కర్ధంబు జెప్పిన దేశకులకు
నెలలు పండ్రెండు  గడు విత్తు నేర్వతోడ
చెప్ప లేకుంటె నా నగవు చిన్ని నగవు.

(“ఆ పెద్దాయన ఎవరో గాని, 12 నెలలు గడువిచ్చాడు కదా!  ఆలోచించండి
గత 12 సంవత్సరాలు గా నేను చేస్తున్నది అదే.”)

దీని గుట్టు విప్పగలరా?

“ఏటినుదకము దెచ్చి ఓ కొమ్మ నిమ్మ చెట్టుకు
పోయవె. కాకర, పూలు పూచి నిమ్మకాయలు కాచున్.”

(ఇందులో “కొమ్మ” అంటే అమ్మాయి అని అర్ధం. “కాకర” అనేది ఆమె పేరు. ఇప్పుడు మళ్ళీ చదవండి.)