Archive for the ‘ భావాలమాల ’ Category

స్వాతిలో మా మొట్టమొదటి కధ-“బహుమానం” (సరదాగా…)

Capture                                                                   బహుమానం PDF

వెతుకులాట

where

అవును, నాకు నే కానరాక నలుదిక్కులా వెతుకుతున్నా,
కాలం విసర్జించిన నిన్నలో, మిగిలిన
అవశేషాలను కెలుకుతూ,
వ్యర్ధంగా వెతుకుతున్నా…
మనసు కుంపటిలో  కాగుతున్న
ఆలోచనల పొగసూరు ఉక్కిరిలో,
 కానరాని రేపటి భాగఫలాల కోసం
నిర్లజ్జగా వెతుకుతున్నా..
అవును నిజం
నిన్న కాలిన చేనులో
మిగిలిన నా శేషం కోసం
కాలసర్ప  కౌగిలిలో,
నలుదిక్కులా   కానరాక,
నన్ను నే వెతుకుతున్నా.

నువ్వే నువ్వే

ph-11146

అందమంటే నీదే
ఎందుకంటే
నీవందని ఎత్తులో ఉన్నావు కాబట్టి.
స్వప్నమంటే నువ్వే
ఎందుకంటే
అది పిలిస్తే వచ్చేది కాదు కాబట్టి.
కాలమంటే నీవే
ఎందుకంటే
నీవు లేని క్షణం నాకు లేదు కాబట్టి.
బలమంటే నీదే
ఎందుకంటే
నీవు కొట్టిన దెబ్బ ఇంకా తగ్గలేదు కాబట్టి.


నే బతికే ఉన్నాను….

foot-prints

ఇక్కడ నలభై..
అక్కడ ఒకటి,
చేతికొస్తున్న పంటలు చీడపడుతూ,
మొన్న కిరణ్,
నిన్న అర్పణ
నేడు విశాల్.
మరి నేనెక్కడ?
నాకు నే కనపడుటలేదు.
ఆత్రుతగా వెదికాను గూగుల్ ఏర్తులో,
నేనెక్కడని?
జూము చేసి చూశాను నేనున్నానా ? అని.
అదుగో నా బంగ్లా, అల్లదిగో నా కారు..
మరినేను?
బలుపు నలుపు తుపాకీల గురిలో,
నట్ట నడిరోడ్డులో,కటిక చీకటిలో
ఓంటరిగా…. క్రింద డాలర్లు ఏరుకుంటూ,
నేనున్నాను.
బతికే ఉన్నాను.
అక్కడ నలభై,
ఇక్కడ ఒకటి,
నే బతికే ఉన్నాను….