స్వాతిలో మా మొట్టమొదటి కధ-“బహుమానం” (సరదాగా…)

నువ్వుశెట్టి బ్రదర్స్

                                                                   బహుమానం PDF

                            

View original post

“గంట గొర్రె”

నువ్వుశెట్టి బ్రదర్స్

camx8jm9.jpg

పచ్చటి పొలాల గట్లమీద,చల్లటి పైరగాలి పీలుస్తూ, పిల్ల కాలువలలో నీళ్ళు తాగుతూ ఆడుతూ పాడుతూ గంతులేసే  మా గొర్రెల మందలో, మాతో పాటూ ఉన్న ఓ మచ్చల గొర్రె తన పనులతో అందరినీ ఆకర్షించేది. మొదట్లో అందరూ దాన్ని మచ్చల గొర్రె, మచ్చల గొర్రె, అని అన్నా, రాను రానూ అది దొంగ గొర్రె గా ముద్ర పడిపొయింది. ఎందుకంటే అది చిన్నప్పటి నుండీ అదో టైపు.ఎప్పుడూ మా మందలో కలిసేదికాదు. తన ధోరిణిలో తనుండేది.ఉన్నట్లుండి మా మందనుంచి మాయమై వేరే మందలో కలసి పోయేది. పైగా అక్కడ కుమ్ములాటలూ కొట్లాటలూ…. అక్కడనుంచి దాన్ని లాక్కుని రావాలంటే మా ప్రాణం పోయేది.ఎక్కడన్నా పచ్చగా కనిపిస్తే చాలు,ఎంగిలి చేయందే ఇంటికి రాదు.దాంతో తగవులు.ఇక దీంతో  వేగలేమని  దాని మెడలో కష్టపడి ఓ గంట కూడా కట్టాం.( క్షమించాలి…ఇది గంట కట్టక ముందు తీసిన ఫొటో…..) .అప్పటినుండీ అది ఎక్కడికి పోయినా సులభంగా తెలిసిపోయేది. ఆ గణ గణ శబ్దంతో అంతా సర్ధుకొనే వాళ్ళు.

                                కానీ ఇంత చేసినా, దాని పేరు గంట గొర్రెగా మారిందే కాని దాని తీరు మాత్రం మారలేదు. దానితొపాటు వయసొచ్చింది. కొద్దిగా కొమ్ములు కూడా మొలిచాయి. తల గట్టిపడింది.వళ్ళు చిక్కపడింది .ఇక పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. ఏ చిన్న బక్క ప్రాణి దొరికినా దాన్ని తరిమి తరిమి కుమ్మేది. చివరకి నోటి దగ్గర తిండి కూడా లాక్కోవడం…

View original post 66 more words

“తెలుగు తల్లి కి బ్రిటిష్ క్రౌన్”

నువ్వుశెట్టి బ్రదర్స్

cp_brown.jpg

తెలుగు నేల నుండి త్రవ్వి తీసిన  కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ “క్రౌన్” లో పెట్టుకున్నారని చింతిస్తున్నారా? వద్దు. అంతకన్నా ఎన్నో రెట్లు విలువైన ఓ రత్నాన్ని మన తెలుగు తల్లికి కిరీటం గా వదిగి పొమ్మని, అదే అంగ్లేయులు మనకి బహుమతి గా పంపించారు. ఆ రత్నమే “బ్రౌన్”
      
   కోహినూరు మనకి దొరికితే మహా అయితే అమ్ముకుని కోటీశ్వరులమైపోతామేమో. కాని ఆయన తెలుగు భాషకు చేసిన సేవల ముందు  అది గోకరకాణి కి కూడ పనికి రాదు.

   ఏ దేవుడు పంపాడో గాని, తెలుగు భాషకి ఆయన చేసిన సేవ అద్వితీయం. దాన్ని నేర్చుకోవటమే కాక, అందులో పూర్తిగా లీనమయి పోయి మనవాళ్ళు అంతగా పట్టించుకోని అనేక తాళపత్ర గ్రంధాలను, వేమన పద్యాలను కోకొల్లలు గా సేకరించి తెలుగు భాషకు అస్థిత్వాన్ని ఏర్పరిచాడు. లేకుంటే మనకి “ఉప్పు కప్పురంబు…” కూడా మిగిలి ఉండేది కాదు.
  
   ఆయన చేపట్టిన బృహత్తర కార్యక్రమాల్లో అత్యుత్తమమైనది తెలుగు నిఘంటువు(తెలుగు – ఇంగ్లీషు)   ని తయారు చేయటం. దాన్ని ఒకసారి తిరగేసామంటే చాలు, సి.పి.బ్రౌన్ తో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. ఈ బ్రుహద్గ్రంధాన్ని తయారు చేయటానికి ఆయన ఎంత తపించి వుంటాడో కదా! వైష్ణవుల శైవుల మధ్య జరిగిన కలహాల్లో ఎన్నో అమూల్యమైన గ్రంధాలు పంచభూతాల్లో కలిసిపోయాయని వాపోయిన బ్రౌన్ ఈ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువులో ప్రతి…

View original post 452 more words

ఆంధ్రజ్యోతి చమత్కారాలు!!

నువ్వుశెట్టి బ్రదర్స్

images1.jpgimages.jpg

తెలుగు తనాన్ని, సంస్కృతిని, సాహిత్యాన్ని పాఠకులకి ఆంధ్రజ్యోతి అందించినంతగా వేరే ఏ ఇతర పత్రిక ఇంతవరకు అందించలేదు. అది రగిల్చిన సాహిత్యాభిలాష మాత్రం ఎప్పటికీ ఆగిపోదు. కొన్ని పాత ఆంధ్రజ్యోతి లలో అందంగా పొందుపరచిన మన పూర్వ కవుల, మేధావుల చమత్కారాలను, సమయస్పూర్థిని మరియు వారి ప్రతిభ, ఔన్నత్యం మీ అందరితో కొంచం పంచుకోవాలని మా ఆకాంక్ష.

కవి వృషభుడు

సంగీతం, సాహిత్యాలలో ప్రతిభగల ఆదిభట్ల నారాయణదాసుగారు చాలా ఠీవిగా వుండేవారు. నిండైన విగ్రహం, ఆజానుబాహువు, బుగ్గమీసాలతో చాలా హుందాగా కనిపించేవారు. ఒకరోజు నలుగురైదుగురు శిష్యులతో విజయనగరం వీధిన నడిచి వెళ్తున్నారు. విద్యల భోజుడుగా వాసికెక్కిన ఆనంద గజపతి ఏదో ఒక మందహాసం చేసి వెళ్ళిపోతే ఎలా వుండేదో? దాసుగారిని చూడగానే “ఎక్కడికి కవివృషభం ఇలా బయలు దేరింది?” అన్నారు. అందుకు నారాయణదాసు క్షణమైనా ఆలోచించకుండా“ఇంకెక్కడికి తమవంటి కామధేనువు వద్దకే..” అన్నారు. ఆనంద గజపతి రసహృదయుడు కనుక దాసుగారి సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు.   

 ఆంధ్ర కేసరి

ఒకసారి విశ్వనాధ సత్యనారాయణగారికి రాష్ట్ర సచివాలయంలో ఏదో పని కావలసి వచ్చింది. చాలా రోజులుగా ఆ వ్యవహారం తెమలకపోవడంతో ఏదో సందర్భంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారిని కలిసినప్పుడు ఆ విషయం ప్రస్తావించారు. సచివాలయంలో వారికి కావలసిన పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకోమని ప్రకాశం గారిని అడిగారు. అందుకు…

View original post 1,287 more words