మనసు దోచుకున్న తెలుగు కీచకుడు

నువ్వుశెట్టి బ్రదర్స్

(కీచక వేషధారి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు మరియు విరాటరాజు పాత్రధారి)

వసంత కాలం ఆరంభమైందంటే చాలు, కళలు పురివిప్పి నాట్యం చేస్తాయి అహ్మదాబాద్ లో. దక్షిణ భారతదేశం లో పుట్టి జగమంతా వ్యాప్తి చెందిన భరతనాట్యానికి గుజరాత్ లో జీవం పోసింది గురు శ్రీమతి ఇలాక్షి బెన్ ఠాకోర్. “నృత్యభారతి” సంస్థని 1960 లో స్థాపించి భరతనాట్యానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి కొన్ని వందలమంది నృత్యకారుల్ని తయారుచేసింది . కళ కే అంకితమైన ఈ సంస్థను ఇప్పుడు పాత కొత్తల మేలి కలయికలతో, అనేక కొత్త నృత్యరీతులు కనుగొని సరికొత్త కోణాలను ఆవిష్కరించిన ఆమె కుమారుడు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ మరియు నృత్యకారుడు శ్రీ చందన్ ఠాకూర్ సమర్ధవంతంగా నడిపిస్తున్నారు.

(గురు శ్రీ చందన్ ఠాకోర్)

ప్రతి సంవత్సరం వసంత కాలారంభంలో మూడు రోజులపాటు కనులవిందుగా జరిగే ఈ నృత్య కార్యక్రమాలకు మన దేశంలోని ఇతర నృత్యకారుల్ని సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా ఈ సారి చెన్నై నుండి చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అధినేత శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ మరియు ఆమె శిష్యురాళ్ళు, ఒరిస్సా , నృత్యాయన్ నుండి శ్రీ దుర్గా చరణ్ రణబీర్ మరియు వారి విద్యార్ధులు…..ఇక ఆడిటోరియం ని దద్దరిల్లజేసి, అందరి చేత ఔరా! అనిపించుకున్న శ్రీ బాల త్రిపుర సుందర కూచిపూడి నాట్య కళాక్షేత్రం, విజయవాడ నుండి గురు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర…

View original post 394 more words

“రాజకీయభేతాళం”

నువ్వుశెట్టి బ్రదర్స్

bhetaalam

                       పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, “రాజా, ఇంత అర్ధరాత్రి వేళ విశ్రాంతి, నిద్రా సుఖాలకు దూరమై, గుడ్ల గూబలూ ,విషసర్పాలు, ఆకలిగొన్న నక్కలూ తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వుపడుతున్న శ్రమ అర్ధహీనంగా తోస్తున్నది. నీ జీవితాశయం, ధ్యేయము ఏమిటి? గొప్ప కీర్తి సంపాదించాలనా? లేక అంతులేని సంపదా, లేక ఇంకా ఉన్నతమైన పదవా? ఎందుకంటే ఉన్నత పదవులలో ఉన్న మనిషి ఆవేశాలకూ, ఉద్వేగాలకూ లొంగకుండా సరైన నిర్ణయాలు తీసు కోగలిగినప్పుడే తన పదవికి, సమాజానికి న్యాయంచేయగలడు.
రాజుకి రాజనీతి విషయాలలో సలహాలిచ్చేందుకు మంత్రులూ, యుద్దవ్యూహాలలో తోడ్పడేటందుకు సేనాపతులూ, ఐహిక ఆధ్యాత్మిక చింతనాపరంగా కలిగే సంశయాలను తీర్చేందుకు పండితులూ ఉంటారు , నీ ఆస్థానములో అలాంటి వారికి కొదువవుండదని భావిస్తున్నాను. కాని వారి లో కొందరు ఒక్కొక్కసారి స్వార్ధం కొద్దిగాని, లేక హేతు,ఆచార విరుద్దమైన సమస్యను ఏదోవిధంగా పరిష్కరించి తృప్తి పడదామన్న తాపత్రయం కొద్దీ గానీ చిత్రమైన ఆలోచనలు చేస్తారు అలాంటివారి సలహాలు విని నిర్ణయాలు తీసుకుంటే తరువాత ఇరువైపులా న్యాయం చేయలేక  మౌనమోహనుడిలా మౌనాన్నే ఆశ్రయించక తప్పదు. నీకు ముందే హెచ్చరికగా ఉండేందుకు ఆయన కధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను,” అంటూ ఇలా చెప్పసాగాడు.

ఫాటలి పుత్రా న్ని మౌనమోహనుడు…

View original post 361 more words

కాలమే దేవుడా…..? ఏమో?

నువ్వుశెట్టి బ్రదర్స్

question mark

                ఎప్పుడూ అనిపిస్తూఉంటుంది, నిజానికి (కొంతవరకు) కాలమే దేవుడని. ఎందుకంటే  దేవుడు చూడలేని ప్రదేశాలు ఉండవచ్చునేమో కాని, కాలం కాలుపెట్టని ప్రదేశం లేదు. తను స్పర్శించని వస్తువుకాని, తను ప్రయాణించలేని దూరము కాని లేవు. రాయి,రప్ప,నువ్వు, నేను,మంచి చెడు, ఇలా మనల్ని తను పలకరించని క్షణం లేదు. అలాంటి క్షణం ఉంటే మనం లేము. 

నిజానికి రాముడు,కృష్ణుడు,మిగతా దేవుళ్ళు ఎవరైనా సృష్టి చేసిన దేవుళ్ళుకాదు, ఎందుకంటే వాళ్ళకి తల్లి తండ్రులున్నారు, వారికి ముందు కావలిసినంత సృష్టి జరిగింది కాబట్టి వారిని అవతార పురుషులుగానే కీర్తిద్దాం. అలా అయితే మరి అసలు సృష్టి కర్త ఎవరు? ఈ గ్రహాలని, నక్షత్రాలని, అంతులేని పాలపుంతలకి పద్దతులు,నడకలు నేర్పిన ఘనుడెవరు? నేను దేవుడిని, సర్వశక్తి సంపన్నడునని, నేను ఈ సృష్టి చేయాలి అన్న భావన తనకు పుట్టకముందు తనెక్కడ? తనెవరు?  మొట్టమొదటిసారిగా తన శక్తి గురించి తనకు ఎప్పుడు తెలిసింది? ఒకవేళ తనే ఈ సృష్టి ని చేసివుంటే ఎందుకు ఒకేసారి అభివృద్దితో కూడిన సృష్టి చేయలేదు? ఎందుకు ఒకేసారి నాగరికుడిని, అన్నీ తెలిసిన ఆధునిక మానవుడిని ఈ ప్రపంచంలోకి  సృష్టించి వదలలేదు? ఎవరన్నా ఓ మంచి చిత్రకారుడు తన తృప్తి తీరా ఓ బొమ్మ వేసి అది పూర్తయిన తరువాతే ప్రపంచంమీదకి వదులుతారు, మరి మనం తన బొమ్మలమైతే మరి అంచలంచలుగా ఏకకణ జీవులనుంచి ఇన్ని కోట్ల సంవత్సరాలకు ఈ ప్రస్తుత రూపానికి ఎందుకు తీసుకుని…

View original post 183 more words

వెతుకులాట

నువ్వుశెట్టి బ్రదర్స్

where

అవును, నాకు నే కానరాక నలుదిక్కులా వెతుకుతున్నా,
కాలం విసర్జించిన నిన్నలో, మిగిలిన
అవశేషాలను కెలుకుతూ,
వ్యర్ధంగా వెతుకుతున్నా…
మనసు కుంపటిలో  కాగుతున్న
ఆలోచనల పొగసూరు ఉక్కిరిలో,
 కానరాని రేపటి భాగఫలాల కోసం
నిర్లజ్జగా వెతుకుతున్నా..
అవును నిజం
నిన్న కాలిన చేనులో
మిగిలిన నా శేషం కోసం
కాలసర్ప  కౌగిలిలో,
నలుదిక్కులా   కానరాక,
నన్ను నే వెతుకుతున్నా.

View original post